Requirement of Tests

TESTS REQUIRED FOR PROMOTIONS


ఎ) ప్రస్తుతం అమలులోనున్న నియామకాల ప్రకారము సెకెండరీ గ్రేడ్ టీచర్లు , యస్.ఎ.గా పదోన్నతి పొందుటకు BA,BEd/B.SC , B.Ed. ఉన్నచాలు అర్హతలు ఎక్కువగా ఉన్నచో అర్హతలను బట్టి వేరువేరుగా పోస్టులకు పదోన్నతికై అవకాశం కలదు. PS(LFL)HM పదోన్నతికి కేవలం SGT సర్వీసు సీనీయర్టీ మాత్రమే చూస్తారు.  మిగతాపరీక్షలు Pass కావలసిన అవసరం లేదు .  LFL HM పదోన్నతికి Inter + TTC వారు అర్హులు .

బి) స్కూల్ ఆసిస్టెంట్ (పండిట్ గ్రేడ్-1, పీడిలతో సహా) మరియు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, MEO/
High School HM ప్రమోషన్ కొరకు గ్రాడ్యుయేషన్ + బి ఈడీ అకడమిక్ అర్హతలతో పాటు ఈ క్రింది శాఖాపరమైన
పరీక్షలు కూడా ఉత్తీర్ణత పొందాలి.
1) Departmental test for Gazetted Officers of Education Dept. Paper I & II (88&97)
2) Accounts test for Executive Officers (Paper Code : 141)
3) Special Language test for the officers of the Education Dept.in Telugu (Highter Standard) 37.
4) Special Language test for the officers of the Education Dept. in Hindi / Urdu of Lower Standard.

*  పదవ తరగతి లేదా ఆపైస్థాయిలో హిందీ / ఉర్దూ ఒక భాషగా చదివినవారు  Special Language test for the officers of the Education Dept. in Hindi / Urdu of Lower Standard  ఉత్తీర్ణత పొందాల్సిన అవసరం లేదు.
* ఇంటర్మీడియట్ లేదా ఆ పై స్థాయిలో తెలుగు ఒక భాషగా చదివినవారు  Special Language test for the officers of the Education Dept.in Telugu (Highter Standard) Paper Code :37  పరీక్ష ఉత్తీర్ణత పొందాల్సిన అవసరం లేదు.

సి) G.O.No.29 మరియు 30 విద్య, తేది: 23.6.2010 ప్రకారం SSC/HSC/MPHSC తో పాటు 5/4/3 సం॥ల చదువుల పూర్తి చేసి, బీ ఈడీ పండిట్ ట్రైనింగ్, BPED అర్హతలు పొందియుండాలి.

డి ) సర్వీసులో ఒక ప్రమోషన్ కూడా 'తీసుకొననివారు 45సం|॥ల వయసు దాటితే ప్రస్తుతము పనిచేయుచున్న కేటగిరి నుండి పై కేటగిరికి (AAS ) ప్రమోషన్కు  పై నాలుగు శాఖాపరమైన పరీక్షలు పాస్కానవసరం లేదు.

***********