REGULARIZATION OF SERVICE
@ DSC/TSPSC మరియు ఇతర సెలక్షన్ కమిటీల ద్వారా నియామకము కాబడిన టీచర్లు రెండు
సంవత్సరముల సర్వీసు పూర్తి కాగానే యాంటిసిడెంట్స్ మరియు సంబంధిత ప్రొఫార్మా దాఖలు చేసినచో పోలీసు
డిపార్ట్ మెంట్ నుండి యాంటిసిడెంట్స్ తిరిగి రాగానే నియమాకపు తేదీనుండి రెగ్యులరైజ్ చేస్తారు.
@Memo.No.4583 G1/69-30 Edn. dt:20.5.74 ప్రకారం ఆరువారాలలోగా యాంటిసిడెంట్స్ తిరిగిరానచో ఎలాంటి వ్యతిరేక రిపోర్టు లేదు భావించి రెగ్యులరైజ్ చేయాలి. సీనియార్టీ రెగ్యులరైజేషన్ తేదీ నుండి గుర్తించబడుతుంది.
@ఒకమారు రెగ్యూలరైజ్ కాబడి పై క్యాడర్కు ప్రమోషన్ పొందినచో ఆరు నెలల తరువాత యాంటిసిడెంట్స్ తో పనిలేకుండా పై క్యాడర్లో తిరిగి రెగ్యూలరైజ్ చేయబడుతారు. అఫీషియల్ డిలే కారణంగా రెగ్యులరైజేషన్ జరగనప్పుడు .జరిపినట్లుగానే భావించబడును.
@ రెగ్యులరైజ్ కాబడిన వారికి పూర్తి ఆర్జిత, కమ్యుటెడ్, HPL సెలవులు లభించును.
@ స్టైపెండరి ఉపాధ్యాయులు అబార్న్, రెగ్యులరైజేషన్ కొరకు స్పష్టమైన విధానం G.O.MS.No.112 Edn. dt: 23.9.1997 ద్వారా రూపొందించబడినది. నియామకము కాబడిన పోస్టుకు పూర్తి అర్హతలు సంపాదించిన రోజునుండే రెగ్యులరైజ్ చేస్తారు. ఆ రోజు నుండే ప్రమోషన్కు సీనియారిటీ లెక్కించబడుతుంది. DSC Rc.No. 2265/D2-1/2010 dt:2.9.2010 మేరకు మండల, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు DEO రెగ్యులరైజేషన్ చేయాలి.
DOWNLOAD :
************