Medical Reimbursement

*మెడికల్ రీయంబర్స్మెంట్*
*(MEDICAL REMBURESEMENT)*



✴ ప్రభుత్వ,పంచాయతీ రాజ్ ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు నిర్ధారింపబడిన వ్యాధులకు ప్రభుత్వ గుర్తింపుపొందిన ఆసుపత్రులయందు చికిత్సకై రీయంబర్స్మెంట్ విధానం వర్తించును.
*( G.O.Ms.No.74 తేది:15-03-2005 )*

✴ ఉద్యోగులకు, పెన్షనర్లకు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు 2 లక్షలకు మించకుండా రీయంబర్స్మెంట్ సౌకర్యం కల్పించబడును.
*( G.O.Ms.No.397 తేది:13-11-2008 )*

✴ కేంద్రప్రభుత్వ ఆరోగ్య పథకం(CGHS) లో నిర్ణయించబడిన ప్యాకేజి ప్రకారం రీయంబర్స్మెంట్ ఖర్చులు చెల్లిస్తారు.

✴ వైద్యఖర్చులు రూ.50,000 అయితే సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి(DEO) అంతకు మించినచో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్(DSE) కి పంపాలి.
 *( G.O.Ms.No.346 dt: 17.12.2011 )

✴ ప్రైవేట్ రెఫరల్ గుర్తింపుపొందిన ఆసుపత్రులనందు కూడా 10% కోత లేకుండా పూర్తిమొత్తం చెల్లిస్తారు.
*( G.O.Ms.No.68 తేది:28-03-2011 )*

✴ కీమోథేరపీ, రేడియోథేరపీ,డయాలసిస్,క్యాన్సర్,కిడ్నీ,గుండెజబ్బులు,ఎయిడ్స్,నరాల సంబంధిత వ్యాధులకు రెఫరల్ ఆసుపత్రుల యందు అవుట్ పేషంట్ వైద్యఖర్చులు కూడా చెల్లిస్తారు.

✴ కంటి చికిత్స,దంత చికిత్సలకు గరిష్ఠంగా రూ.10,000 చెల్లిస్తారు.కాస్మోటిక్ డెంటల్ సర్జరీకి రీయంబర్స్మెంట్ సౌకర్యం లేదు.దంతచికిత్స సర్వీసులో (లేదా) జీవిత కాలంలో 3సార్లు చేయించుకోవచ్చును.
*( G.O.Ms.No.105 dt: 9.4.2007 ) *

✴ రోడ్డుప్రమాదాలు సంభవించినపుడు  మాత్రమే ప్రాణాపాయ రక్షణ నిమిత్తం దగ్గరలోని ప్రభుత్వ గుర్తింపులేని ఆసుపత్రులలో చికిత్స పొందినను రీయంబర్స్మెంట్ చెల్లిస్తారు.స్థానిక పోలీస్ స్టేషన్లో నమోదయిన FIR కాపిని జతచేయాలి.
*(G.O.Ms.No.175 తేది:29-05-1997)*

✴ 40సం॥ నుండి రిటైర్ అయ్యేవరకు (లేదా) జీవితకాలంలో 3 సార్లు మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకునే అవకాశం కలదు.  గరిష్టంగా రూ . 3000/- చెల్లిస్తారు.
*( G.O.Ms.No.105 తేది:09-04-2007 )*

✴ మహిళా ఉద్యోగుల తల్లిదండ్రులు పూర్తిగా డిపెండెంట్స్ అయినచో రీయంబర్స్మెంట్ అవకాశం కలదు.
*( DSE Rc.No.350/D2-4/2008 తేది:15-04-2008 )*

✴ కుటుంబ పెన్షన్ పొందేవారికి కూడా రీయంబర్స్మెంట్ సౌకర్యం వర్తించును.అయితే వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు వర్తించదు.
*( G.O.Ms.No.87 తేది:28-02-2004 )*

✴ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ లకు జీవిత కాలంలో ఒకే వ్యాధికి 3 పర్యాయాల వరకు రీయింబర్స్మెంట్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చును.
*( G.O.Ms.No.601 M&H Dt:15-10-2003 )*

✴ నిర్ణీత పదవీ విరమణ వయస్సు పూర్తి చేసి(సూపరాన్యుయేషన్) పై రిటైరైన వారికి మాత్రమే రీయింబర్స్మంట్ సౌకర్యం వర్తింపచేసారు.నిర్బంధ పదవీ విరమణ,వాలంటరీ రిటైర్మెంట్,మెడికల్ ఇన్వాలిడేషన్ పై రిటైర్మెంట్ పొందిన వారికి ఈ సౌకర్యం వర్తించదు.
*(G.O.Ms.No.401 Dt:25-06-1991)*

✴ హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయిన తేది  నుండి 6 నెలలలోపు, చనిపోయినచో 8 నెలలలోపు DEO/DSE కి ప్రతిపాదనలు పంపాలి.

✴ రీయంబర్స్మెంట్ పొందుటకు సమర్పించవలసిన సర్టిఫికెట్లును Rc.No. *8878/D2-4/09 తేది:02-09-2009* ద్వారా వివరించారు.
@  రీయంబర్స్మెంట్ పొందుటకు సమర్పించవలసిన సర్టిఫికెట్లపై MEO/HM తప్పక సంతకం చేయాలి .

***************


*✍🏻Medical Reimbursement proposals 0nline process for teachers..✍🏻*

 మెడికల్ రేయింబర్సుమెంట్(MR)ఆన్లైన్ విధానం  )

@  వైద్య ఖర్చులు 50,000రూ పైబడిన టీచర్లు అందరూ విద్యాశాఖ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

@  ముందుగా మన MR కి సంబంధించిన డిశ్చార్జి సమ్మరీ, ఎమర్జెన్సీ సర్టిఫికెట్, essentiality సర్టిఫికెట్, డిపెండెంట్ సర్టిఫికెట్ పిడిఎఫ్ ఫార్మాట్ లో 6kb నుండి 1mb సైజు లోపు ఉండేటట్లు స్కాన్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకోవాలి.

@  ఇపుడు  https://schooledu.telangana.gov.in/ISMS/    వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి.

@  Online Service   పై క్లిక్ చేయగానే Medical Reimbursement ( MR ) కనబడుతుంది.దీనిపై క్లిక్ చేయాలి.

@  వెంటనే స్క్రీన్ పై
 Online Services :

 Medical Reimbursement(Service Employee) Claim Form

 MR - Check Claim Status

 MR - Know Your Application Number

 Medical Reimbursement(Retired Employee) Claim Form.  కనబడుతాయి .

@  Medical Reimbursement(Service Employee) Claim Form పై క్లిక్ చేయగానే Enter Treasury Id వస్తుంది .
@  Treasury Id Enter చేయగానే మన Registered మొబైల్ నెంబర్ కి OTP ( One Time Password ) వస్తుంది .
@  OTP Enter చేయగానే MEDICAL REIMBURSEMENT - CLAIM REGISTRATION FORM వస్తుంది
@ ఇందులో మన School Details & Personal Details ఢీ  ఫాల్ట్ గా ఉంటాయి.
@  మరియు క్లెయిమ్ ఫారం లో అడ్రస్, పేషెంట్ వివరాలు, హాస్పిటల్ వివరాలు పూర్తిచేయాలి.
@  Documents ( proof in support of the claim) లో Emergency, Essentiality, Discharge or Death Summary, Appendix II Form, Non-drawl declaration attested by DDO, IP Details, Abstract of Bills Genuinity Certificate, Hospital Recognition copy మరియు Other Documents లను scan చేసి విడివిడిగా  6kb  నుండి  1 mb మధ్య లోని సైజు వరకు pdf format లో కి మార్చవలెను . తదనంతరం ప్రతి pdf ఫైల్ ను Individual గా   అప్లోడ్ చేయాలి.
@  అనంతరం సబ్మిట్ నొక్కాలి.వెంటనే స్క్రీన్ పై successfully అని వస్తుంది.
@  దీనిని ప్రింట్ తీసుకొని దానిని DDO ద్వారా Medical Reimbursement  క్లెయిమ్ దరఖాస్తు కి జతచేసి DSE కి 3 sets పంపాలి.
@  DSE - Address: The Director of School Education, Near Telephone Bhavan, Saifabad, Hyderabad - 500004. ( Through Registered Post or Speed Post.)

*********
 * Required Certificates (we have take these certificates from the Hospitals )*

*Genuinity certificate
*Referral GO copy from the hospital
*Emergency certificate
*Essentiality certificate
*Discharge Summary
*Final bill
*Medicine bills
*Consolidated bills
*Proceeding order copy given by DME to the particular hospital
*Non Availment of EHS Certificate



*********

Related GOs & Proc : 

@    G.O.Ms.No.77 dt:14.7.22 Medical Reimbursement - Health Insurance Info

@  G.O.Ms.No. 74 dt: 15.03.2005 APIMA Rules 1972 - Revision of the Rules

G.O.Ms.No. 397 dt: 14.11.2008 Enhancement fo the Medical Reimbursement from Rs.1 Lakh to Rs. 2 Lakhs

G.O.Ms.No. 175 dt: 29.5.1997 Treatment in Private recognized Hospitals within & outside the State– Admissibility of Medical Expenditure with 20% cut on eligible amount without a referral from NIMS, Hyderabad/SVIMS, Tirupati in cases of emergencies – Orders

@  G.O.Ms.No. 68 dt : 28.03.2011 PRC Recommendations 2009 on Medical Reimbursement 

@  Proc.No : 350 dt: 15.04.2008 మహిళా ఉఫాధ్యాయినిల తల్లిదండ్రులు,భర్త,పిల్లలు తనపై ఆధారపడి నివసిస్తే వారికి మెడికల్ రీయింబర్సేమేంట్ వర్తింపు