LPC


Last Pay Certificate

IFMIS  లో LPC ని  పొందడం : 

1. మీ యొక్క DDO తో లాగిన్ అయిన తర్వాత HR  section  కి వెళ్ళండి.

2.HR SECTION  లో 
Transfer/depute/ for.ser  పై క్లిక్ చేసి ఓపెన్ చేయండి

3. అక్కడ select  type  అని అడుగుతుంది అప్పుడు మీరు transfer  ని క్లిక్ చేయండి ఓపెన్ చేయండి

4.next step bill ID అడుగుతుంది మీ బిల్లు  id ఏముంటే అది క్లిక్ చేసి ఒక్కొక్క employee నీ వేరువేరుగా సెలెక్ట్ చేసుకోవాలి.
(Date selection  చేసుకోవాలి example: 31-12-2021 afternoon  noon ఈ డేట్ సెలెక్ట్ చేసుకుంటే  కింది కాలం లో no సెలెక్ట్ చేసుకోవాలి. after 31/12/2021 తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకుంటే example  3/1/2022  క్రింది కాలంలో 
YES  సెలెక్ట్ చేసుకుని నాన్ పేమెంట్ సర్టిఫికెట్ ఇవ్వవలసి ఉంటుంది నెక్స్ట్ లెవెల్ లో)
( HRA సెలక్షన్ ఏవిధంగా చేసుకోవాలి అంటే అతను ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాడు example mahaboob nagar 17% HRA , gadwal 13%HRA  Wanaparthy  13 % HRA  11 % HRA OTHER SELECTED  చేసుకోవాలి)

5 . DDO  mobile  number  కు OTP నంబర్ వస్తుంది దాన్ని ఎంట్రీ చేయాలి

6.peeniding approvals లోకి వెళ్లి approved  చెయ్యాలి ప్రింటవుట్ వస్తుంది దాన్ని మూడు లేదా నాలుగు కాపి తీసి పెట్టుకుంటే మంచిది ఒకటేసారి.

*లాస్ట్ పే సర్టిఫికేట్ (Last Pay Certificate) జారీ నిబంధనలు:*


 *లాస్ట్ పే సర్టిఫికేట్  కు సంబంధించిన నిబంధనలు సాధారణంగా కంట్రోలర్ & ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా జారీ చేస్తాడు.*

 *ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్ వాల్యుమ్-2, అనుబంధం 18 ప్రకారం LPC జారీచేయాలి.*

 *ఉద్యోగికి LPC జారీచేసిన తరువాత సంబంధించిన ఎలాంటి క్లైములు డ్రాయింగ్ అధికారి చేయరాదు.*

 *ఉద్యోగి నెల మధ్యలో బదిలీ అయితే పాత కార్యాలయంలోనే ఆ నెలకు సంబంధించిన పూర్తిజీతాన్ని సంబంధిత హెడ్ ఆఫ్ అకౌంట్లలో డ్రా చేసి ఇవ్వాలి.*

 *LPC లో ఉద్యోగికి సంబంధించిన స్టాండర్డ్ మినహాయింపులు (Deductions) రికవరీ వివరాలు పొందుపర్చాలి. కొత్త కార్యాలయంలో ఉద్యోగి నుండి రికవరీ చేయవలసిన లోన్ లు,అడ్వాన్సులు ఎంత వరకు రాబట్టుకున్నది ఇంకా ఎన్ని కిస్తులు రికవరీ చేయవలసి ఉన్నది* అను వివరాలు LPC లో పొందుపర్చాలి- *APF Volume-1 లోని ఆర్టికల్ 239(c)(2)*

 *ప్రస్తుతం ఉద్యోగులకు జీతాలు బ్యాంకుల ద్వారా చెల్లిస్తున్న కారణంగా LPC లో ఉద్యోగి గుర్తింపు సంఖ్యను(ID Number) పొందుపరచాలి* - *G.O.Ms.No.80 Fin Dt:19.3.2008 మరియు G.O.Ms.No.90 Fin Dt: 31.1.2002*

 *ఉద్యోగులు బదిలీ అయినపుడు సర్వసాధారణంగా LPC మరియు సర్వీసు రిజిస్టరు వెనువెంటనే పంపించాల్సి ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో పరిపాలన జాప్యం వల్ల గాని,ఇతరత్రా కారణాల వల్లగాని ఉద్యోగి LPC సకాలంలో పంపనందు వల్ల ఉద్యోగి జీతభత్యాలు రాక ఇబ్బందులకు గురవుతుంటారు. అలాంటి సందర్భాలలో LPC రాకపోయినప్పటికి 3 నెలల వరకు ఉద్యోగికి క్యాడర్ లోని స్కేలు కనిష్ట జీతం (Basic Pay) డ్రాయింగ్ అధికారి నియమ నిబంధనల మేరకు డ్రా చేసి చెల్లించవచ్చును.*
*G.O.Ms.No.454 F&P Dt: 06.12.1961*

DOWNLOAD:

@    LPC FORMAT