------
INCOME TAX 2020-2021 ANALYSIS
◙నూతనంగా తీసుకువచ్చిన 6 అంచెల స్లాబ్ లో టాక్స్ చెల్లిస్తే 1,50,000ల 80C వదులుకోవాల్సి వస్తుంది. పాత మూడు స్లాబ్ ల విధానం లో అయితే 1,50,000ల సేవింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
◙మరి కొత్త, పాత స్లాబ్ రేట్ లు ఎంతవరకు లాభమో ఇప్పుడు కొన్ని ఉదాహరణలతో పరిశీలించి చూద్దాం.
1. ఉద్యోగి Taxable Income 6,50,000, సేవింగ్ 1.5 లక్షలు
పాత విధానం లో
6,50,000-1,50,000 =5,00,000
2.5 లక్షల వరకు టాక్స్ = 0
5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X 5% = 12,500
కానీ 87A ప్రకారం టాక్స్ మినహాయింపు 12,500 పోగా
చెల్లించాల్సిన టాక్స్ = 0
కొత్త విధానం లో
2.5 లక్షల వరకు టాక్స్ =0
2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X 5% = 12,500
5.0 - 6.5 లక్షల వరకు టాక్స్ 1,50,000 X 10% = 15,000
చెల్లించాల్సిన టాక్స్ =27,500
*****
2. ఉద్యోగి Taxable Income 7,00,000, సేవింగ్ 1.5 లక్షలు
పాత విధానం లో
7,00,000-1,50,000 = 5,50,000
2.5 లక్షల వరకు టాక్స్ = 0
5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X 5% = 12,500
5.0 - 5.5 లక్షల వరకు టాక్స్ 50,000 X 20% = 10,000
చెల్లించాల్సిన టాక్స్ = 22,500
కొత్త విధానం లో
2.5 లక్షల వరకు టాక్స్ = 0
2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X 5% = 12,500
5.0 - 7.0 లక్షల వరకు టాక్స్ 2,00,000 X 10% = 20,000
చెల్లించాల్సిన టాక్స్ = 32,500
****
3. ఉద్యోగి Taxable Income 8,50,000, సేవింగ్ 1.5 లక్షలు
పాత విధానం లో
8,50,000-1,50,000 =7,00,000
2.5 లక్షల వరకు టాక్స్ = 0
5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X 5% = 12,500
5.0 - 7.0 లక్షల వరకు టాక్స్ 2,00,000 X 20% = 40,000
చెల్లించాల్సిన టాక్స్ = 52,500
కొత్త విధానం లో
2.5 లక్షల వరకు టాక్స్ =0
2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 - 7.5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X10% = 25,000
7.5-8.5 లక్షల వరకు టాక్స్ 1,00,000 X15% = 15,000
చెల్లించాల్సిన టాక్స్ = 52,500 . పాత కొత్త టాక్స్ లో తేడా లేదు
******
4. ఉద్యోగి Taxable Income 9,00,000, సేవింగ్ 1.5 లక్షలు
పాత విధానం లో
9,00,000-1,50,000 =7,50,000
2.5 లక్షల వరకు టాక్స్ = 0
5లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 - 7.5 లక్షల వరకు టాక్స్ 2,50,00 X20% = 50,000
చెల్లించాల్సిన టాక్స్ = 62,500
కొత్త విధానం లో
2.5 లక్షల వరకు టాక్స్ = 0
2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 - 7.5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X10% = 25,000
7.5-9.0 లక్షల వరకు టాక్స్ 1,50,000 X15% = 22,500
చెల్లించాల్సిన టాక్స్ = 60,000
******
5. ఉద్యోగి Taxable Income 12,50,000, సేవింగ్ 1.5 లక్షలు
పాత విధానం లో
12,50,000-1,50,000 =11,00,000
2.5 లక్షల వరకు టాక్స్ =0
5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X 5% = 12,500
5.0 - 10 లక్షల వరకు టాక్స్ 5,00,000 X 20% = 1,00,000
10 - 11 లక్షల వరకు టాక్స్ 1,00,000 X 30% = 30,000
చెల్లించాల్సిన టాక్స్ = 1,42,500
కొత్త విధానం లో
2.5 లక్షల వరకు టాక్స్ = 0
2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 - 7.5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X10% = 25,000
7.5-10 లక్షల వరకు టాక్స్ 2,50,000 X15% = 37,500
10 - 12.5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X20% = 50,000
చెల్లించాల్సిన టాక్స్ = 1,25,000
*****
6. ఉద్యోగి Taxable Income 16,00,000, సేవింగ్ 1.5 లక్షలు
పాత విధానం లో
16,00,000-1,50,000 =14,50,000
2.5 లక్షల వరకు టాక్స్ = 0
5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 - 10 లక్షల వరకు టాక్స్ 5,00,000 X20% = 1,00,000
10 - 14.5 లక్షల వరకు టాక్స్ 4,50,000 X30% = 1,35,000
చెల్లించాల్సిన టాక్స్ = 2,47,500
కొత్త విధానం లో
2.5 లక్షల వరకు టాక్స్ =0
2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 - 7.5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X10% = 25,000
7.5-10 లక్షల వరకు టాక్స్ 2,50,000 X15% = 37,500
10 - 12.5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X20% = 50,000
12.5 - 15 లక్షల వరకు టాక్స్ 2,50,000 X25% = 62,500
15.0 - 16 లక్షల వరకు టాక్స్ 1,00,000 X30% = 30,000
చెల్లించాల్సిన టాక్స్ = 2,17,500
పై ఉదాహరణలతో చూస్తే Taxable Income 8,50,000 వరకు ఉండి 1,50,000 ల సెవింగ్స్ ఉన్న వారికి పాత విధానం లొనే లాభం .
6 అంచెల స్లాబ్ లతో పెద్ద మొత్తం జీతాలను తీసుకునే వారిని దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చిన స్లాబ్ లు మాత్రమే. ఎక్కువ మొత్తంలో 8.5 లక్షల లోపు taxable income ఉన్న ఉద్యోగులకు ఏమాత్రం ఉపయోగం లేదు.
DOWNLOAD :
******
*Income Tax పైన కొన్ని సందేహాలు-సమాధానాలు*
ప్రశ్న : ప్రతీ నెల నా జీతం నుండి IT ని మా DDO గారు cut చేయిస్తున్నారు. చాలా సంత్సరాల నుండి ఇలాగే చేస్తున్నాం.నేను టాక్స్ కట్టినట్ల కదా?
జ: కాదు, మీరు కట్టిన వేల రూపాయలు tax వృధా అవుతుంది. ఎందుకనగా మీ DDO గారు నీ పేరు మీదుగా cut చేసిన Tax వెళ్లి DDO TAN అకౌంట్ లో పడుతుంది.(Tan అనేది ఒకరకంగా జీరో Account లాంటిదే) అక్కడే టాక్స్ జమ అయి ఉంటుంది .కానీ ప్రభుత్వం నకు నీ పేరు మీదుగా చేరకుండా Unknown గా ఉంటుంది.
ప్రశ్న : నేను కట్టిన టాక్స్ నా పేరు మీదుగా ప్రభుత్వం నకు చేరాలంటే ఏమి చేయాలి.
జ: ముందుగా మీ DDO గారి ద్వారా మీరు కట్టిన tax ను chalan no తొ పాటుగా నీ యెక్క PAN accountlo జమ చేయించుకోవాలి.దీన్నే TDS అంటారు. TDS process అయితేనే నీ PAN అకౌంట్లో నీవు కట్టిన టాక్స్ జమ అవుతుంది.
ప్రశ్న : TDS చేయిస్తే నేను టాక్స్ కట్టినట్లేనా?
జవాబు: కాదు. మీరు ఈ -ఫైలింగ్ చేయించడం ద్వారా మీ టాక్స్ ను ప్రభుత్వం నకు కట్టినట్లు అవుతుంది. చివరకు TDS-ఈ-ఫైలింగ్ అయ్యే కొద్దీ ఖర్చు కు వెనుకడుగు వేసి. వేల రూపాయల పన్ను ను చేతుల్లో నుండి జారవిడుచు కుంటున్నాం .పన్ను కట్టి కూడా కట్టని కోవలోకి వెళ్తున్నారు. ఆలోచించి సరయిన సమయంలో ప్రతిస్పందించండి.
మీరు ప్రతినెల కట్ చేయించిన టాక్స్ ని TDS చేయించుకుని .సరియైన సమయంలో ఈ-ఫైలింగ్ చేయిస్తేనే మీరు ప్రభుత్వం దృష్టి లో పన్ను చెల్లింపు దారులు కోవలోకి వస్తారు.