Half Pay Leave


అర్థజీతపు సెలవు (Half Pay Leave)

💎 ఈ సెలవుల ప్రస్తావన AP Leave Rules నందు 13,18,23 నందు పొందుపరచారు.

💎 సర్వీసు రెగ్యులరైజ్ అయిన తరువాత నియామక తేది నుండి ప్రతి సం॥ కి 20 రోజుల అర్ధవేతన సెలవు జమచేయబడుతుంది. సం॥ నకు కొన్ని రోజులు తక్కువైనను ఈ సెలవు రాదు. (G.O.Ms.No.165 Dt:17-08-1967)

💎 ఈ సెలవు జమచేయుటకు డ్యూటీ కాలముతో పాటు అన్ని రకాల సెలవుల పై వెళ్ళిన కాలాలను కూడా పూర్తి సం॥ సర్వీసు క్రింద పరిగణిస్తారు.

💎 అర్జిత (Earned Leave) మాదిరి జనవరి నెల మొదట,జూలై నెల మొదట తేదిన అర్ధవేతన సెలవు జమచేయరు.సం॥ సర్వీసు పూర్తి చేసిన తర్వాతనే సగం జీతపు సెలవు ఖాతాకు జమచేస్తారు.

💎 అర్ధవేతన సెలవు రెండు రకాలుగా మంజూరు చేస్తారు.
1⃣ వైద్య ధృవపత్రం ఆధారంగా(Medical Certificate)
2⃣ స్వంత వ్యవహారాలపై (Private Affairs)

💎 సంపాదిత సెలవు నిల్వయున్నను అర్ధవేతన సెలవు వాడుకోవచ్చును.

💎 ఇంక్రిమెంట్లు,సర్వీసుకు ఎటువంటి ఆటంకం కలగదు.

💎 వైద్య కారణముల పై అర్ధవేతన సెలవు పెట్టి పూర్తి జీతం పొందుటను కమ్యూటెడ్ సెలవు అందురు.సెలవు పెట్టిన రోజులకు రెట్టింపు రోజులు అర్ధజీతపు సెలవు ఖాతా నుండి తగ్గిస్తారు. {APLR 15(B) & 18(B}

💎 కమ్యూటెడ్ సెలవును 180 రోజుల నుండి 240 రోజులకు పెంచనైనది. (G.O.Ms.No.186 Dt:23-07-1975)

💎 సర్వీసు మొత్తంలో 480 రోజుల అర్ధజీతపు సెలవుల స్థానంలో 240 రోజుల పూర్తి జీతం పొందవచ్చు {Rule 15(B}

💎 ఇలా వాడుకోగా మిగిలిన సెలవులను అర్ధజీతంతో మాత్రమే వాడుకోవాలి.

💎 వైద్యకారణాల పై సెలవు పొందాలంటే Form-A,B లను సమర్పించాలి.

💎 వ్యక్తిగత అవసరాలకు అర్ధవేతన సెలవును వినియోగించుకున్నచో వేతనం,డి.ఏ సగము మరియు అలవెన్సులు పూర్తిగా చెల్లిస్తారు. (Memo No.3220/77/A1/PC-01/05 Dt:19-02-2005)
                (Memo No.14568/63/PC-1/A2/2010 Dt:31-01-2011)

💎 అర్దవేతన సెలవు 180 రోజులు దాటినచో HRA,CCA లు చెల్లించబడ వు.

💎 క్యాన్సర్,మానసిక జబ్బులు,కుష్టు,క్షయ, గుండె జబ్బు, మూత్రపిండాల వైఫల్యం వంటి ధీర్ఘకాల వ్యాధులకు చికిత్స పొందుతున్న వారు సంబంధిత వైద్య నిపుణుడి ధృవపత్రం ఆధారంగా 6 నెలల గరిష్ట పరిమితితో తన ఖాతాలో నిల్వయున్న అర్ధవేతన సెలవులను వినియోగించుకుని పూర్తివేతనం పొందవచ్చును.
(G.O.Ms.No.386 Dt:06-09-1996)
(G.O.Ms.No.449 Dt:19-10-1976)

💎 వ్యాధిగ్రస్తులకు 8 నెలల వరకు HRA,CCA లు పూర్తిగా చెల్లిస్తారు.
    (G.O.Ms.No.29 Dt:09-03-2011)

💎 ఎట్టి పరిస్థితులలోనూ కమ్యూటెడ్ సెలవును HPL గా మార్చుకొనుటకు వీలులేదు.
    (G.O.Ms.No.143 Dt:01-06-1968)

💎 ఇట్టి సెలవు వినియోగించుకున్న తర్వాత ఉద్యోగి తిరిగి డ్యూటీలో చేరాలి.కాని ఏ కారణం చేతనైనా రాజీనామా చేయుటకు గాని,లేక పదవీ విరమణ చేయుటకు గాని సిద్దపడినట్లయితే అట్టి సందర్భాలలో అంతకుముందే మంజూరైన కమ్యూటెడ్ సెలవును సగం జీతం సెలవుగా మార్చి అధికంగా పొందిన సెలవు జీతం అట్టి ఉద్యోగి నుండి తిరిగి రాబట్టాలి.

💎 సెలవు పెట్టి తిరిగి డ్యూటీలో చేరకముందే ఉద్యోగి మరణించినా కమ్యూటెడ్ సెలవు మరియు సగం జీతం సెలవు జీతాలలో తేడాను అట్టి ఉద్యోగి నుండి తిరిగి వసూలు చేయనవసరం లేదు.
    (G.O.Ms.No.33 F&P Dt:29-01-1976)

********
ప్రత్యేక అర్ధవేతన సెలవు
* లెప్రసీ,టి.బి,క్యాన్సర్, మానసిక అనారోగ్యం, గుండె జబ్బులు, మూత్రపిండాల వైఫల్యంతో వంటి వ్యాధులతో ధీర్ఘకాల చికిత్స పొందుతున్న వారు,సంబంధిత వైద్య ధృవపత్రం ఆధారంగా 6 నెలల గరిష్ట పరిమితితో తన ఖాతాలో నిల్వయున్న అర్ధవేతన సెలవును వినియోగించుకుని పూర్తివేతనం పొందవచ్చు._
(G.O.Ms.No.188 Fin Dt:30-07-1973)
(G.O.Ms.No.386 Fin Dt:06-09-1976)
(G.O.Ms.No.20 Fin Dt:25-01-1977)

* గుండె జబ్బులకు: (G.O.Ms.No.449 Fin Dt:28-10-1976)

*మూత్రపిండ వైఫల్యానికి: (G.O.Ms.No.268 Fin Dt:25-01-1977)

*  సెలవులో వెళ్ళడానికి ముందు పొందిన వేతనం ఆధారంగా మాత్రమే సెలవు కాలపు జీతభత్యాలు చెల్లించబడతాయి._

* ఏ కారణం వల్లనైనా సెలవు మధ్యలో వేతనం పెంపుదల జరిగినప్పటికీ, సెలవు అనంతరం డ్యూటీలో చేరిన తేది నుండి మాత్రమే ఆర్ధిక లాభం వర్తింపచేస్తారు._

* 6 నెలల వరకు వినియోగించుకున్న అన్ని రకాల సెలవులకు HRA,CCA చెల్లించబడుతుంది.(G.O.Ms.No.28 Fin Dt:09-03-2011)

* కుష్టు,గుండె జబ్బు,క్యాన్సర్,ఎయిడ్స్,మానసిక అనారోగ్యం, మూత్రపిండాల వైఫల్యం వంటి జబ్బుల చికిత్స సందర్భంలో 8 నెలల వరకు HRA చెల్లించబడుతుంది.

* ఒకసారి మంజూరు చేయబడిన సెలవు ఎట్టి పరిస్థితులలో మార్పుచేయబడదు.

#    Download :



మీ సందేహాలు - మా సమాధానాలు 
ప్రశ్న :  మా పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాలు అక్టోబర్ లో పదవీ విరమణ గా వించబోతున్నారు. ఆమె ఖాతాలో 500 అర్థవేతన సెలవులున్నాయి. పదవీ విరమణ సమయంలో వీటిని నగదుగా మార్చుకొనవచ్చునా ? 
సమాధానం  :  మార్చుకోవచ్చును. రాష్ట్ర ప్రభుత్వం G.O.MS. No. 109, Finance, తేది : 29-7-2015 ద్వారా అర్థవేతన సెలవులను నగదుగా మార్చుకొనే అవకాశం కల్పించింది. అయితే రోజుల పరిమితికి లోబడి లెక్కిస్తారు. అర్థవేతన సెలవు పొందడానికి సూత్రం  =  పదవీ విరమణ తేదికి అర్థవేతనం + అర్థవేతనంపై ఆ రోజుకు చెల్లిస్తున్న DA/30 X అర్థవేతన సెలవులు.


@ For  More Information & GOs available --------------------------->  GOs DIARY