Dies - Non

 


అనుమతి లేని గైర్హాజర్ 
(డైస్ నాన్)

💥 ఉద్యోగులు సంబంధిత అధికారి నుండి ఎలాంటి పూర్వానుమతి లేకుండా, లేక కనీసం సెలవు దరఖాస్తు పెట్టకుండా గర్హాజర్ అయిన కాలాన్ని ఫండమెంటల్ రూల్ FR-18 ప్రకారం డైస్ నాన్(Dies-Non) గా పరిగణిస్తారు.

💥 డైస్ నాన్ అంటే No work-No pay పని చేయలేదు కాబట్టి జీతం లేదు అని అర్ధం.

💥 డైస్ నాన్ కాలాన్ని సర్వీస్ బ్రేక్ గా పరిగణించకూడదు.

💥 కాని అట్టి డైస్ నాన్ కాలము తదుపరి వార్షిక ఇంక్రిమెంటుకు గాని, పెన్షనుకు గాని, సెలవుకు గాని పరిగణలోకి తీసుకోరు.

💥 ఉద్యోగిపై CCA రూల్స్-1991 ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకోబడతాయి.

💥 ఒక సంవత్సరం మించి విధులకు
గైర్హాజరైన ఉద్యోగిని సర్వీసు నుంచి తొలగించాలని G.O.Ms.No.11 Fin తేది:13.01.2004 ద్వారా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

💥ఒక సంవత్సరం మించి విధులకు
 గైర్హాజరైన ఉద్యోగి రాజీనామా చేసినట్లు పరిగణించాలని రూలు 18 కి సవరణ ఉత్తర్వులు G.O.Ms.No.128 Fin తేది:1.6.2007 వెలువడ్డాయి.

💥 పై సందర్భంలో ఉద్యోగిపై చర్యలు తీసుకునేముందు ఆ ఉద్యోగి వాదనను వినిపించుకొనుటకు తగిన అవకాశం ఇవ్వవలెను. Rule 5B & G.O.Ms.No.129 Fin తేది:1.6.2007

💥 విధులకు గైర్హాజరైన ఉద్యోగి ఏ పరిస్థితుల్లో నైనా రాజీనామా చేసిన యెడల A.P.Subordinate Service రూల్స్ 1996 లోని రూలు 39 ప్రకారం. ఆమోదించవచ్చు.

💥 విధులకు గైర్హాజరైన ఉద్యోగి ఏ కారణం చేతనైనా A.P.రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 లోని 43 మరియు 44 మేరకు స్వచ్చంద పదవీ విరమణ చేయదలచుకున్న నిబంధనల మేరకు అనుమతించవచ్చు.

💥 విధులకు అనుమతి లేకుండా గైర్హాజరైన ఉద్యోగి తిరిగి కొంతకాలం తర్వాత జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చిన సందర్భంలో తిరస్కరించకుండా, వెంటనే విధులలో చేర్చుకోవాలి. తదుపరి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి.
Govt.Circular.Memo.No.C.9101-4/8/FR-I/91 తేది:25.12.1991.