వేతన సంరక్షణ
( P A Y P R O T E C T I O N)
@ ఒక ఉద్యోగంలో రెగ్యులర్ గా నియమించబడి ఉద్యోగం చేస్తున్న ఉద్యోగి, తిరిగి మరొక ఉద్యోగానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( TSPSC or DSC ) ద్వారా ఎంపిక కాబడి నియమించబడిన సందర్భాల్లో వెనుకటి పోస్టులో అతడు పొందుతున్న జీతం కంటే తక్కువ కాకుండా కొత్తపోస్టులో అతని వేతనం స్థిరీకరించాల్సి ఉంది. దీనినే మనము వేతన సంరక్షణ (Pay Protection) అందురు.
@గతంలో ఉద్యోగులకు, టీచర్లకు పే ప్రొటెక్షన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తేదీ: 02.06.2011 నాడు GO 105 జారీచేసింది.
@ తర్వాత... 19 ఫిబ్రవరి, 2014లో.... అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 45, 46 నంబర్ జీవోలు ఒకేరోజు జారీచేసి.... 02.06.2011 నుంచి 31.12.2013 మధ్యకాలంలో ఎంపికైన పంచాయత్ రాజ్ టీచర్లు, ఉద్యోగులకు పే మరియు సర్వీస్ ప్రొటెక్షన్ల సౌకర్యాన్ని పొడిగించింది.
@ 01.01.2014 నుంచి ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన, చేరుతున్న, చేరబోయే టీచర్లు,ఉద్యోగులకు పే, సర్వీస్ ప్రొటెక్షన్ కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో . 46. dt: 31.03.2021 విడుదల చేయడం జరిగినది. మానిటరీ బెనిఫిట్స్ తేదీ : 31.03.2021 నుంచి అమలు కాబడినవి .
@ ఉద్యోగం చేస్తూ సర్వీసు కమీషను ( TSPSC )ద్వారా గాని,జిల్లా ఎంపిక సంఘం(DSC) ద్వారా గానీ మరొక ఉద్యోగానికి ఎంపిక అయిన వారు తమ మొదటి ఉద్యోగానికి రాజీనామా చేసినయెడల వెనుకటి ఉద్యోగంలోని బెనిఫిట్స్ అన్ని కోల్పోతారు.
Download :