1)*🔊నేటి నుంచి బడులకు దసరా సెలవులు*
*🔶13 నుంచి ఇంటర్ విద్యార్థులకు*
*🔷నేటి నుంచి బడులకు దసరా సెలవులు*
*🍥రాష్ట్రంలో బుధవారం నుంచి ఈ నెల 17 వరకు పాఠశాలలకు అధికారులు దసరా సెలవులు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయి. మరోవైపు, ఈనెల 13 నుంచి 17 వరకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు దసరా సెలవులు ప్రకటిస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఓ ప్రకటన చేశారు. 18 నుంచి తిరిగి తరగతులు ప్రారంభించాలని పేర్కొన్నారు. కాగా, దోస్త్ మూడవ దశ కౌన్సెలింగ్‌లో భాగంగా సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో చేరడానికి వీలుగా గురువారం వరకు గడువు పొడిగించారు. కాగా, నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ స్కీంకు దరఖాస్తు చేసుకునే గడువును ఈనెల 30 వరకు పొడిగించారు. 2020-21లో ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.*
@@@@@
2)*🔊తెలంగాణ ఉద్యోగుల రిలీవ్‌కు కసరత్తు*
*🎙️ఏపీజీఈఎఫ్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి*
*🍥ఏపీలో పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రానికి వెళ్లాలని భావిస్తున్న ఉద్యోగులను రిలీవ్ చేసే ప్రక్రియపై ప్రభు త్వం కసరత్తు మొదలుపెట్టింది. తెలంగాణ స్థానికతతో పాటు జీవిత భాగస్వాములు ఆ రాష్ట్రంలో పని చేస్తున్నవారికి ఈ వెసులుబాటు కల్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు బదిలీపై వెళ్లాలనుకునే ఉద్యోగుల నుంచి ఆప్షన్ ఫార్మ్స్ సేకరించాలని అధికారులకు సీఎం జగన్ సూచించారని, దీనిపై ఒకటి రెండు రోజుల్లో మార్గదర్శకాలు జారీ అయ్యే అవకాశం ఉందని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకట్రామిరెడ్డి తెలిపారు. 2వేల మంది వరకు ఆప్షన్లు ఇచ్చే అవకాశం ఉందన్నారు.*
@@@@@
3)*🔊TS: ఈహెచ్‌ఎస్‌లో ఉద్యోగుల భాగస్వామ్యం*
*🔶మూల వేతనంలో ఒక శాతం వసూలుకు ప్రతిపాదనలు*
*🔷పథకంపై వైద్యారోగ్య శాఖ ఉన్నతస్థాయి భేటీ*
*🔶కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమలు, ఇతర సమస్యలపై చర్చ*
*🔷త్వరలో ముఖ్యమంత్రికి నివేదిక!*
*🍥సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్)లో సమస్యలను పరిష్కరించడం, పథకాన్ని మరింత మెరుగ్గా నిర్వహించడంపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ దృష్టిసారించింది. దీనికి సంబం ధించి మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించింది. ఇందులో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో నిమ్స్ డైరెక్టర్ మనోహర్, వైద్య విద్య డైరెక్టర్ రమేశ్ రెడ్డి, సీఎంవో ప్రత్యేకాధికారి తాడూరి గంగాధర్, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ డైరెక్టర్ ప్రీతిమీనా, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈహెచ్‌ఎస్ అమలు కోసం ఉద్యోగుల మూల వేతనంలో ఒక శాతాన్ని తీసుకోవాలన్న ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి, పథకాన్ని సక్రమంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.*
*💰రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నా..*
*🌀ఈహెచ్‌ఎస్ అమలు పరిస్థితిపై ఉద్యోగులు, పింఛన్ దారులు అసంతృప్తితో ఉన్నారని.. చాలా ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు ఈ పథకాన్ని అమలు చేయడం లేదని సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. బడ్జెట్లో ఈ పథకానికి రూ.300 కోట్ల మేర కేటాయిస్తున్నా.. నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని అధికారులు అభిప్రాయపడ్డారు. ‘‘సరిగా బిల్లులు అందడం లేదని, వివిధ చికిత్సలకు చెల్లించే ధరలు చాలా తక్కువగా ఉన్నాయని ప్రైవేటు ఆస్పత్రులు అంటున్నాయి. ఈ కారణాలతోనే ఈహెచ్‌ఎస్ కింద వైద్యచికిత్సలు అందించేందుకు నిరాకరిస్తున్నాయి.*
*💠ఆస్పత్రులపై ఒత్తిడి చేయలేని పరిస్థితి ఉంది..’’అని అధికారులు రిజ్వీ దృష్టికి తీసుకొచ్చారు. గత ఐదేళ్లలో పథకం అమలు గణాంకాలను వివరించారు. దీనిపై స్పందించిన రిజ్వీ.. వెంటనే పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక ఉద్యోగులు కోరుతున్నట్టుగా వారి మూల వేతనంలో ఒక శాతం మొత్తాన్ని కంట్రిబ్యూషన్‌గా తీసుకుంటే.. సమస్య పరిష్కారమవుతుందా అన్న చర్చ జరిగింది. ఉద్యోగులు కంట్రిబ్యూషన్ ఇచ్చాక ఇంకా ప్రభుత్వం ఎంత భరించాల్సి ఉంటుందన్న అంచనాలు వేశా రు. దీనిపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని, తగిన ప్రతిపాదనలతో సీఎం కేసీఆర్‌కు నివేదిక ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది.*
@@@@@
4)*🔊జీపీఎఫ్‌పై 7.1% వడ్డీరేటు*
*🍥 రాష్ట్రంలో ఉద్యోగుల జీపీఎఫ్‌కు వడ్డీ రేటును నిర్ణయిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరం జులై 1వ తేదీ నుంచి అదే ఏడాది సెప్టెంబరు 30 వరకూ జీపీఎఫ్‌పై 7.1 శాతం వడ్డీరేటును నిర్ణయిస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.*
@@@@@
5)*🔊నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ కు దరఖాస్తులు*
*🍥కేంద్ర విద్యాశాఖ అందజేసే నేషనల్ మెరిట్ స్కాలర్ షిమకు ఇంటర్మీడియట్ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ వెల్లడించారు. ఈ స్కాలర్షిప్ కు తెలంగాణ నుంచి 81,594 మంది (ఫ్రెష్,రెన్యువల్) విద్యార్థులు అర్హులని, schlarships.gov.in వెబ్ సైట్ లో నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.*
Ad:
Online Shop Store :
బెస్ట్ వాషింగ్ మెషీన్స్
@టాప్ in 7.5 KG - 7.5 KG కెపాసిటీలో బెస్ట్ టాప్ లోడింగ్ మోడల్ - నలుగురైదుగురు కుటుంబ సభ్యులకు పనికొస్తుంది -
@ Whirlpool 7.5 Kg 5 Star Fully-Automatic Top Loading Washing Machine (WHITEMAGIC ELITE 7.5, Grey, Hard Water Wash)
@ Best Buy Price Now @ : https://amzn.to/3A0V6rG