1)*🔊సర్కారు బడికి.. విద్యార్థులు*
*🥏ప్రైవేట్ స్కూళ్లను కాదని ప్రభుత్వ బడుల్లో చేరిక*
*💱ఇప్పటికే 2.20 లక్షల మంది విద్యార్థినీ, విద్యార్థులు ప్రవేశం*
*💫ఒకటో తరగతిలో 1.87లక్షల మంది*
*🌍ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల చేరికలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ప్రైవేట్ స్కూళ్లను కాదని తమ పిల్లలను సర్కారు బడులకు తల్లిదండ్రులు. పంపిస్తున్నారు. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులకు తోడూ కొన్ని ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీని తట్టుకోలేక విద్యార్థుల తల్లిదండ్రులు సర్కారు బడిబాట పడుతున్నారు.. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల తాకిడి పెరగడంతో 1202 జీరో అడ్మిషన్ స్కూళ్లల్లో 212 స్కూళ్లను ఈ విద్యా సంవత్సరానికి పునఃప్రారంభించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఒకటో తరగతిలో ఈ ఏడాదికి 1.87లక్షల అడ్మిషన్లు నమోదయ్యాయి. అలాగే ప్రైవేట్ నుంచి ప్రభుత్వ స్కూళ్లలో వివిధ తరగతుల్లో చేరిన వారు 2.20 లక్షల మంది ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రైవేట్ నుంచి ప్రభుత్వ బడుల్లో చేరుతున్న విద్యార్థుల సమాచారాన్ని ప్రైవేట్ యాజమాన్యాలు చైల్డ్ ఇన్ఫోలో సరిగా నమోదు చేయకపోవడంతో విద్యార్థుల సంఖ్యలో ఒకింత గందరగోళం ఏర్పడుతోంది. అలాగే టీసీల సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. మంగళవారం కల్లా స్కూళ్లలో చదివే విద్యార్థుల సంఖ్యను పాఠశాల విద్యాశాఖకు మొత్తం సమర్పించాలని విద్యా అధికారులకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.*
@@@@@
2)*📢రేపటి నుంచి బడులకు దసరా సెలవులు*
*🌍రాష్ట్రంలోని బడులకు పాఠ శాల విద్యాశాఖ ఈ నెల 6వ తేదీ నుంచి 17 వరకు దసరా సెలవులు ప్రకటించింది. పాఠశాలలు ఈ నెల 18వ తేదీన పునఃప్రారంభం కానున్నాయి. సెప్టెంబరు 1వ తేదీ నుంచి ప్రత్యక్ష బోధన మొదలుకాగా సెలవుల ప్రారంభం (6వ తేదీ) నాటికి 25 రోజులు మాత్రమే తరగతులు జరుగుతాయి. భారీ వర్షాల వల్ల కొన్ని జిల్లాల్లో తక్కువ రోజులు తరగతులు నిర్వహించారు. జూనియర్ కళాశాలలకు ఈ నెల 13వ తేదీ నుంచి 16 వరకు దసరా సెలవులు ప్రకటించారు.*
@@@@
3)*🔊దోస్త్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు నేటి వరకు పొడిగింపు*
*🌀ఇప్పటివరకూ రిపోర్ట్ చేసినవారు 2.08 లక్షల మంది*
*Degree ఆన్‌లైన్ సర్వీసెస్-తెలంగాణ (దోస్త్) మూడో విడతలో సీట్లు పొందిన వారు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి, కళాశాలల్లో సీటును నిర్ధరించుకోవడానికి మంగళవారం వరకు గడువు పొడిగించినట్లు కన్వీనర్ ఆచార్య ఆర్.లింబాద్రి తెలిపారు. ఇతర తేదీల్లో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నాటికి 2.08 లక్షల మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారని, అందులో 1.69 లక్షల మంది కళాశాలల్లో రిపోర్ట్ చేశారని వివరించారు. దోస్త్ ద్వారా సీట్లు పొందిన 5 వేల మంది సీట్లు రద్దు చేసుకొని బీటెక్‌లో ప్రవేశాలు పొందారని ఆయన చెప్పారు.*
@@@@@
4)*🔊ఇంటర్ పరీక్షల టైంటేబుల్లో మార్పు!*
*🌀ఇంటర్ ఫస్టియర్ పరీక్షల టైంటేబుల్ లో స్వల్ప మార్పులు చేయాలని ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయించారు.హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ముందుగా ప్రకటించిన షెడ్యూల్ లో రెండు రోజుల
పాటు పరీక్ష తేదీలను మార్చనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ అనుమతి తీసుకొని, ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన చేయనున్నారు. ఇంటర్ సెకండియర్ లోని విద్యార్థులకు ఫస్టియర్ పరీక్షలను ఈ నెల 25 నుంచి నవంబర్ రెండు వరకు నిర్వహించనున్నవిషయం తెలిసిందే.*
@@@@@
Ad:
Online Smart Shop :
@ మంచి laptop తీసుకుందామనుకునే వారికి నా బెస్ట్ suggestion ఇది.
@ 55 వేలకు డీల్‌లో లభిస్తున్న టాప్ లాప్టాప్ - అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ఇప్పుడు నడుస్తున్న కారణంగా మంచి price కి వస్తుంది.
ప్రత్యేకతలు:
@ ఇంటెల్ సంస్థ తాజాగా విడుదల చేసిన 11th Gen i5 ప్రాసెసర్ ఉపయోగించబడి ఉంటుంది.
@ Windows 10 lifetime validity లభిస్తుంది.
@ 8gb ram, 512gb అత్యంత వేగంగా ఉండే SSD లభిస్తున్నాయి. అదనపు స్టోరేజ్ కోసం ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కొనుగోలు చేయవచ్చు.
@ ఒక్కసారి చార్జింగ్ చేస్తే వినియోగాన్ని బట్టి ఆరు గంటల పాటు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది.
@ డైరెక్ట్ గా అమెజాన్ product పేజీ లింక్ కొనుగోలు చేయడానికి : https://amzn.to/3uypIzp
(మనకు లేదా మన పిల్లల అవసరాలకు మంచి Laptop తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా బెస్ట్ product ఇది.)