*✳️హైదరాబాద్: డా. బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ(బి.ఏ, బికాం, బీ.ఎస్సీ), పీజీ (బిఎల్‌ఐఎస్‌సి, ఎంఎల్‌ఐఎస్‌సి పీజీ డిప్లోమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో చేరడానికి ఆలస్య రుసుము 200 రూపాయలతో చివరి తేదీ అక్టోబరు 13వ తేదీ వరకూ పొడిగించినట్టు విశ్వ విద్యాలయ అధికారులు ఒక ప్రకనలో తెలిపారు. రెండు తెలుగు రాష్ర్టాల్లోని విద్యార్ధులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.*
*✳️ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు , ఫీజు ఇతర వివరాలను సంస్ద వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్టు తెలిపారు. మరిన్ని వివరాలకు 7382929570/ 580 లేదా 040-23680290/291/294/295 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.*
@@@@@
2).26 కేజీబీవీల ఏర్పాటు: సబిత
‘రాష్ట్రంలో త్వరలో 26 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 475 కేజీబీవీలు, 194 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. వాటిల్లో 1.10 లక్షల మంది చదువుకుంటున్నారు’ అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. తెరాస ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, బానోత్ హరిప్రియలు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు.‘ఇటీవల ఎంసెట్ పరీక్షలో ఇక్కడి విద్యార్థులు 268 మంది హాజరైతే 220 మంది అర్హత పొందారు. బాలికలకు ప్రత్యేక ఆరోగ్య కిట్లను అందజేస్తున్నాం. వాటిలోని సిబ్బందికి పీఆర్సీ అమలు పరిశీలనలో ఉంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఆదర్శ పాఠశాలల్లో అమలు చేస్తాం. కేజీబీవీల్లో అమలు చేసే అంశం పరిగణనలో లేదు’ అని సబిత చెప్పారు.
@@@@@3).*🔊సర్కారు బడుల్లో 68% హాజరు*
*🍥విశాలంగా తరగతి గదు లు.. భౌతికదూరం పాటించేలా కూర్చునే వెసులుబాటు.. పక్కాగా కొవిడ్ నిబంధనల అమలుతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు జోరందుకున్నది. ప్రత్యక్ష తరగతులు ప్రారంభమై శుక్రవారంతో నెల రోజు లు పూర్తయింది. శుక్రవా రం ప్రభుత్వ బడుల్లో 67.87 శాతం హాజరు నమోదైంది. అదే సమయంలో ప్రైవేటు స్కూళ్ల లో 39.54 శాతం, ఎయిడెడ్ పాఠశాలల్లో 38.86 శాతం హాజరు రికార్డయిం ది. సెప్టెంబర్ 1న ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కాగా.. ఆ రోజు 21.77 శాతం వి ద్యార్థులే హాజరయ్యారు. రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెద్దగా నమోదుకాకపోవడంతో వివిధ స్కూళ్ల లో విద్యార్థుల హాజరు ప్రస్తుతం 50.68 శాతానికి చేరుకున్నది. ఇందులో సర్కారు బడులకు 67 శాతానికిపైగా విద్యార్థులు హాజరవుతున్నారు.*
@@@@@
4)*🔊ఆదర్శ బడుల్లో పొరుగు సిబ్బందికి కొత్త వేతనాలు*
* రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో పొరుగు సేవల విధానంలో పనిచేసే సిబ్బందికి కొత్త పీఆర్‌సీని అమలు చేస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో 194 పాఠశాలలు ఉండగా ఒక్కో దాంట్లో నలుగురు ఉద్యోగులు ఉన్నారు. వారందరికీ రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు వేతనాలు పెరిగాయి. ఉత్తర్వులు జారీ చేసినందుకు సంఘాల నేతలు భూతం యాకమల్లు, జగదీష్ తదితరులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.*
@@@@@
Ad:
Smart Online Shop :
Shopping Now @ : https://amzn.to/3usLyV4