1)
*🔊డిపార్ట్మెంటల్ పరీక్షకు దరఖాస్తులు*
*🍥ప్రభుత్వ ఉద్యోగులకు నవంబర్ 22 నుంచి డిసెంబర్ 1 వరకు డిపార్ట్ మెంటల్ పరీక్షలు నిర్వహించనున్నట్టు టీఎస్ పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ వెల్లడించారు. ఈ నెల 11 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని, షెడ్యూల్ ను గురువారం విడుదలచేశారు. కంప్యూటర్ బేస్డ్ టెస్టు పాత 9జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్, రంగారెడ్డిజిల్లాలకు హెచ్ఎండీఏ పరిధిలో సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.www.tspsc.gov.in ను సంప్రదించాలని సూచించారు.*
@@@@@
2)
*🔊పార్ట్-టైమ్ ఉద్యోగులు*
*🌀క్రమబద్ధీకరణ కోరడం కుదరదు*
*🍥పార్ట్-టైమ్ ఉద్యోగులు మంజూరైన పోస్టుల్లో పని చేయడం లేదని, వారు క్రమ బద్ధీకరణ(రెగ్యులరైజేషన్) కోరడం కుదరని సుప్రీంకోర్టు గురువారం తేల్చిచెప్పింది. ప్రభు త్వాలు ప్రకటించే రెగ్యులరైజేషన్ పాలసీకి అనుగుణంగానే క్రమబద్ధీకరణ చేయడం సాధ్యమవుతుందని తెలిపింది. ఎవరూ క్రమ బద్ధీకరణను తమ హక్కుగా భావించకూడదని స్పష్టం చేసింది. సమాన పనికి సమాన వేతనం అనే సూత్రం పార్ట్-టైమ్ ఉద్యోగుల విషయం లో వర్తించదని జస్టిస్ ఎం.ఆర్. షా, జస్టిస్ ఎ.ఎస్. బోపన్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మా సనం వెల్లడించింది. ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థలో పార్ట్-టైమ్, తాత్కాలిక ఉద్యోగు లుగా పని చేస్తున్నవారు రెగ్యులర్ ఉద్యోగుల తో సమానంగా వేతనం ఇవ్వాలని కోరడం సమంజసం కాదని సూచించింది. పంజాబ్, హరియాణా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) ఆర్డర్ను సవరిస్తూ పంజాబ్, హరియాణా హైకోర్టు గతంలో ఉత్తర్వు జారీ చేసింది. నిర్దిష్టమైన రెగ్యులరైజేషన్ పాలసీ రూపొందించాలని ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విభాగాన్ని రాజ్యాంగం లోని ఆర్టికల్ 226 కింద హైకోర్టు ఆదేశించలే దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా ఒక విధానాన్ని రూపొందించడం కేవలం ప్రభు త్వం బాధ్యత అని, దాంతో కోర్టుకు సంబంధం లేదని తెలియజేసింది.*
@@@@@
3).🔊💰కాంట్రాక్టు లెక్చరర్ల జీతాలకు రూ.58.23 కోట్లు విడుదల*
*🍥రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల జీతాల కోసం రూ.58.23 కోట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు ఇంటర్ విద్యా కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలోని ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మూడు నెలల వేతనాలను విడుదల చేశామని తెలిపారు. జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారులు (డీఐఈవో) జీతాలను డ్రా చేసుకుని కాంట్రాక్టు అధ్యాపకులకు చెల్లించాలని ఆదేశించారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలోని జూన్, జులై వేతనాలను ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 405 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 3,600 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. అయితే ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తారనే పేరుతో వారికి ఇప్పటి వరకు జీతాలు చెల్లించకపోవడం గమనార్హం.*
@@@@@
4).
*💠👩🏫అతిథి’ని మరిచారా..!*
*🌀తరగతులు ప్రారంభమైనా కార్యాచరణ కరవు*
*✴️పాఠశాలలు, కళాశాలల్లో సెప్టెంబరు నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభమైంది. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్నచోట సర్దుబాటు ప్రక్రియ కొనసాగుతుండగా.. జూనియర్ కళాశాలల్లో మాత్రం గతంలో పనిచేసిన అతిథి అధ్యాపకులను తిరిగి నియమించకపోవడం విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. ఇంటర్ విద్యాక్యాలెండర్‌ను విడుదల చేసి బోధన నుంచి పరీక్షల వరకు వివిధ కార్యాచరణను ప్రకటించిన ప్రభుత్వం.. అతిథి అధ్యాపకుల నియామకంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో పూర్తి స్థాయిలో బోధన సాగడం లేదు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్న చోట ఒప్పంద అధ్యాపకులు, అతిథి అధ్యాపకులను సర్కారు నియమించింది. కరోనాతో కళాశాలలు మూతపడ్డాయి. ఫలితంగా అతిథి అధ్యాపకులను తొలగించారు. తిరిగి గతనెల నుంచి కళాశాలలు ప్రారంభమైనప్పటికీ అతిథి అధ్యాపకులను నియమించలేదు. గతంలో పనిచేసిన చోట వీరి పోస్టులు ఖాళీగా ఉండటంతో సంబంధిత సబ్జెక్టు బోధించేవారు లేక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈనెల 25 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. మరో వైపు అధ్యాపకులు లేకపోవడం ఇబ్బందిగా మారింది.*