Thursday, 7 October 2021

Teacher's Diary : 07.10.2021

1)ఏకోపాధ్యాయ పాఠశాలలు 6,678
తెలంగాణలో పరిస్థితి ఇది..

యునెస్కో నివేదిక వెల్లడి

@ తెలంగాణ రాష్ట్రంలో 6,678 (16.08%) పాఠశాలలు ఒకే ఉపాధ్యాయుడితో నడుస్తున్నట్లు యునెస్కో తెలిపింది. ఈ విషయంలో అరుణాచల్‌ప్రదేశ్‌ (18.22%), గోవా (16%) తొలి రెండు స్థానాల్లో నిలవగా.. తెలంగాణ మూడు, ఆంధ్రప్రదేశ్‌ నాలుగు స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఏకోపాధ్యాయ పాఠశాలలు 1,10,971 ఉండగా.. అందులో 89% గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయని పేర్కొంది. ‘నో టీచర్‌ నో క్లాస్‌.. స్టేట్‌ ఆఫ్‌ ది ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌ ఫర్‌ ఇండియా-2021’ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది.

రాష్ట్రంలో 73% పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా.. 70% మంచి స్థితిలో ఉన్నాయని, 86% స్కూళ్లకు ఉచిత పాఠ్యపుస్తకాలు అందుతున్నాయని పేర్కొంది. వాట్సప్‌, రేడియో, టెలివిజన్‌ ద్వారా రికార్డు చేసిన పాఠాలను బోధిస్తూ విద్యార్థులు ఆన్‌లైన్‌    పాఠాలకు అంటిపెట్టుకొని ఉండేలా చేయడంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు.. ప్రైవేటు కంటే మెరుగైన పనితీరు కనబరిచాయని నివేదిక పేర్కొనడం విశేషం.  

‘‘దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల లభ్యత పెరిగినప్పటికీ టీచర్లు-విద్యార్థుల నిష్పత్తి మాధ్యమిక పాఠశాలల్లో ఆశాజనకంగా లేదు. సంగీతం, ఆర్ట్స్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్ల సమాచారం ఎక్కడా కనిపించడంలేదు. తెలంగాణలోని పూర్వప్రాథమిక పాఠశాలల్లో 1.42% మంది, ప్రాథమిక స్థాయిలో 0.52% ప్రాథమికోన్నతలో 0.31%, మాధ్యమిక స్థాయిలో 0.12%, మాధ్యమికోన్నత స్థాయిలో 0.04% మంది టీచర్ల అర్హతలు నిర్దిష్ట ప్రమాణాలకంటే తక్కువ (అండర్‌క్వాలిఫైడ్‌)’’ అని నివేదికలో పేర్కొన్నారు.
@@@@
2). కరోనతో అనాథలైన చిన్నారుల సంరక్షకులు కలెక్టర్లే
పీఎంకేర్స్‌ మార్గదర్శకాల జారీ

డిసెంబరు 31 వరకు దరఖాస్తుకు అవకాశం

కరోనాతో అనాథలైన చిన్నారుల సంరక్షకులు కలెక్టర్లే..
@: కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఆదుకునే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంకేర్స్‌ పథకానికి కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీచేసింది. అర్హులు డిసెంబరు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. కరోనా ప్రభావం మొదలైనప్పట్నుంచి (2020 మార్చి 11), 2021 డిసెంబరు 31 వరకు కరోనా కారణంగా తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన, తల్లి లేదా తండ్రిని అప్పటికే కోల్పోయి కరోనాతో మిగిలిన ఒక్కర్నీ కోల్పోయిన, చట్టబద్ధమైన సంరక్షకులు, దత్తత తీసుకున్న తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు పథకం కింద లబ్ధిపొందేందుకు అర్హులని తెలిపింది. తల్లిదండ్రులు చనిపోయిన నాటికి పిల్లల వయసు 18 ఏళ్లు నిండకూడదని స్పష్టంచేసింది. ఈ పథకం పిల్లలకు 23 ఏళ్ల వయసు వచ్చేవరకు కొనసాగుతుందని, అప్పటివరకు విద్య, సంరక్షణ, ఆరోగ్య బీమా, సాధికారత తదితరాలు ప్రభుత్వమే పర్యవేక్షిస్తుందని స్పష్టంచేసింది. ‘‘దరఖాస్తుల పరిశీలన, తనిఖీ, అర్హుల గుర్తింపు బాధ్యత జిల్లా కలెక్టర్లదే. అనాథలైన పిల్లలకు వారు చట్టబద్ధమైన సంరక్షకులుగా వ్యవహరించాలి. పీఎంకేర్స్‌ ఖాతాల పరిశీలన, వారి ఖాతాల్లో నగదు జమచేసే బాధ్యతా వారిదే. ఏటా పిల్లల కార్యకలాపాలు పోర్టల్‌లో అప్‌లోడ్‌  చేయడంతోపాటు వారితో కలెక్టర్లు తరచూ మాట్లాడాలి. విద్య, ఆరోగ్య ప్రమాణాలు పరిశీలించి అదనపు సహాయాన్ని అందించాలి’’ అని నిర్దేశించింది. తెలంగాణలో అలాంటి అనాథలు దాదాపు 226 మందిని ప్రభుత్వం గుర్తించినట్టు సమాచారం.
పథకం అమలు...సహాయం ఇలా

* అనాథలుగా మారిన పిల్లల్ని గుర్తించి బాలల సంరక్షణ కమిటీల(సీడబ్ల్యూసీ) సహాయంతో..కుటుంబ సభ్యులు, బంధువుల వద్ద పునరావాసం పొందేలా జిల్లా కలెక్టర్లు సంరక్షణ చర్యలు చేపట్టాలి.

* ఒకవేళ బంధువులు నిరాకరిస్తే 4-10 ఏళ్ల పిల్లలను బాలల న్యాయ చట్టం కింద ఫాస్టర్‌కేర్‌ కింద దత్తత ఇవ్వాలి. దత్తతకు ఎవరూ ఆసక్తి చూపించని పక్షంలో వారిని బాలల సంరక్షణ గృహాల్లో చేర్పించాలి.

* 18ఏళ్లలోపు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలు, కేవీ, గురుకులాల్లో చేర్పించాలి.

* ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విద్యాహక్కు చట్టం కింద ఫీజు మినహాయింపు లభిస్తుంది.

* పిల్లలు ఉన్నత విద్య, వృత్తి విద్య చదవాలని భావిస్తే వారికి ప్రభుత్వమే విద్యారుణం ఇప్పిస్తుంది. వడ్డీ రాయితీ అవకాశం లేకుంటే..ఆ మొత్తాన్ని పీఎం కేర్స్‌ నుంచి చెల్లిస్తుంది. విద్యార్థులకు పీఎంకేర్స్‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాల నుంచి ఉపకార వేతనాలు కూడా అందుతాయి.

* లబ్ధిదారులైన పిల్లల పేరిట పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరుస్తారు. వారికి 18 ఏళ్లు వచ్చే నాటికి రూ.10 లక్షలు అయ్యేలా కార్పస్‌ ఫండ్‌ జమచేస్తారు. ఉదాహరణకు ఓ చిన్నారికి ఆరేళ్ల వయసు ఉంటే ఇప్పుడు రూ.4,15,200, పదహారు సంవత్సరాల వయసుంటే రూ.8,63,730 లక్షలు ఖాతాలో వేస్తారు. 18 ఏళ్లు నిండిన తరువాత ఆ నిధిని పెట్టుబడిగా పెట్టి విద్యార్థికి స్టయిపెండ్‌గా అందిస్తారు. వారికి 23 ఏళ్లు వచ్చిన తరువాత రూ.10 లక్షలు ఇస్తారు. 18 ఏళ్లలోపు పిల్లలకు జిల్లా కలెక్టర్‌తో కలిసి జాయింట్‌ ఖాతా తెరుస్తారు.

* ‘ఇప్పటివరకూ స్టయిపెండ్‌ గరిష్ఠంగా రూ.2 వేలు అందించాలని నిర్ణయించ[గా, దాన్ని రూ.4 వేలకు పెంచే అవకాశం ఉంది’ అని మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ అధికారి ఒకరు వెల్లడించారు.
@@@@@
3).
*🔊బ్యాంకుల్లో 5,830 క్లర్క్ పోస్టులు*

*🍥దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి* *కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్-XI నోటిఫికేషన్‌ను ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్* *(ఐబీపీఎస్) విడుదల చేసింది. ఈ*
*ప్రకటన ద్వారా 5, 880 క్లరికల్ క్యాడర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగాణలో 263, ఏపీలో 263 ఖాళీలు ఉన్నాయి.బీవోబీ, కెనరా, ఇండియన్ ఓవర్సీస్, యూకో, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్‌బీ, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర బ్యాంకుల్లోని*
*ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులై, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారు ఈ నెల 27 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 2021 జూలైలోనే* *నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ స్థానిక భాషలకు* *సంబంధించిన కారణాలతో ఐబీపీఎస్ తిరిగి నోటిఫికేషన్‌ను* *ప్రకటించింది. జూలైలో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ* *చేసుకోవాల్సిన అవసరం లేదు. వివరాలకు*
*https://www.ibps.inలో చూడవచ్చు.
@@@@@
4).*🔊💉Covaxin for Children: చిన్నారులకు టీకా.. నివేదిక సమర్పించిన భారత్‌ బయోటెక్‌*


*🍥హైదరాబాద్‌: 18 ఏళ్లలోపు వారికి కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ మరికొన్ని రోజుల్లోనే అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. చిన్నారుల కోసం రూపొందించిన కొవాగ్జిన్‌ టీకా ప్రయోగాలను ముగించుకున్న భారత్‌ బయోటెక్‌.. ఆ నివేదికను భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI)కు అందజేసింది. ఈ విషయాన్ని భారత్‌ బయోటెక్‌ బుధవారం వెల్లడించింది. పిల్లలపై రెండు, మూడు దశ ప్రయోగాలు పూర్తి చేసినట్లు గత నెలలోనే సంస్థ ప్రకటించింది. డీసీజీఐ అనుమతి లభిస్తే భారత్‌లో పిల్లలకు వేసే మొట్టమొదటి టీకా కొవాగ్జిన్‌ కానుంది.*

*🌀18 ఏళ్లలోపు చిన్నారుల కోసం రూపొందించిన కొవాగ్జిన్‌ 2/3 దశల ప్రయోగాలు పూర్తయినట్లు గత నెలలో భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. సమాచార విశ్లేషణ కొనసాగుతున్నట్లు తెలిపింది. దాదాపు వెయ్యి మంది వాలంటీర్లపై ఈ ప్రయోగాలు నిర్వహించినట్లు ఆ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్లా వివరించారు. ఇప్పటికే 18ఏళ్ల పైబడిన వారికి కొవాగ్జిన్‌ టీకా ఉత్పత్తిని గణనీయంగా పెంచామన్నారు. ఒకవేళ ఇతర భాగస్వామ్య సంస్థలు తయారీని ప్రారంభిస్తే నెలకు 10కోట్ల డోసుల ఉత్పత్తి సాధ్యమని.. ఇందుకు ఇండియన్‌ ఇమ్యూనాలాజికల్స్‌, హెస్టర్‌ బయోసైన్సెస్‌తో ఇప్పటికే ఒప్పందం చేసుకున్నట్లు స్పష్టం చేశారు.*

*🥏కొవాగ్జిన్‌ టీకాను అత్యవసర వినియోగ వ్యాక్సిన్ల జాబితా (ఈయూఎల్‌)లో చేర్చాలన్న అంశంపై వచ్చే వారంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. డబ్ల్యూహెచ్‌వో, స్వతంత్ర నిపుణుల బృందం వచ్చే వారంలో భేటీ అయి కొవాగ్జిన్‌ టీకా మూడు దశల క్లినికల్‌ ట్రయల్స్‌ డేటాను, భద్రత, సామర్థ్యం, రోగ నిరోధకత తదితర అంశాలను సమీక్షించి అత్యవసర వినియోగ జాబితాలో చేర్చే అంశంపై తుది నిర్ణయం తీసుకోనుంది.*