Monday, 4 October 2021

SSC NOTIFICATION 2021

 SSC RECRUITMENT 2021




  పది, ఇంటర్ అర్హతతో SSC లో 1,775 ఉద్యోగాలు.....పూర్తి వివరాలు ఇలా....

🌴స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (Staff Selection Commission) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

🦋ఈ నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు విభాగాల్లో ఎస్ఎస్‌సీ ఖాళీలను భర్తీ చేస్తుంది.

🌴ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3,261 పోస్టులు భర్తీ చేయనున్నారు.

⛱️ఈ పోస్టులలో పది, ఇంటర్ విద్యార్హతతో ఎస్ఎస్‌సీలో 1,775 ఉద్యోగాలు ఉన్నాయి.

🌴పోస్టుల దరఖాస్తుకు అక్టోబర్ 25, 2021 వరకు అవకాశం ఉంది.

🦋దరఖాస్తు అనంతరం ఫీజు చెల్లించేందుకు అక్టోబర్ 28, 2021 రాత్రి 11.30 వరకు అవకాశం ఉంది.

🌴బ్యాంక్ ద్వారా చలాన్ రూపంలో ఫీజు చెల్లించేందుకు నవంబర్ 1, 2021 వరకు అవకాశం ఉంది.

🦋పోస్టుల ఎంపిక పరీక్ష ద్వారా నిర్వహిస్తారు.

🌴ఈ పరీక్ష జనవరి 2022 లేదా ఫిబ్రబరి 2022లో జరిగే అవకాశం ఉంది.

🦋దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తరువాత పరీక్ష తేదీలు విడుదల చేస్తారు.

🌷ఎంపిక విధానం..🌷

🌴ఈ పోస్టుల భర్తీకి ప్రాథమికంగా కంప్యూటర్ బెస్డ్ (Computer Based Exam) పరీక్ష నిర్వహిస్తున్నారు. పరీక్ష సమయం - 60 నిమిషాలు

🦋ఇది అబ్జెక్టీవ్ టైప్ (Objective type) ప్రశ్నలను కలిగి ఉంటుంది. అయితే పోస్టును బట్టి విద్యార్హతను బట్టి మూడు పరీక్షల వరకు నిర్వహించే అవకాశం ఉంది.

🌴పరీక్ష రాసే అభ్యర్థులు ఆచితూచి సమాధానం పెట్టాలి. ప్రతీ తప్పు ప్రశ్నకు 0.50 మార్కులు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

🦋పరీక్ష ఉత్తీర్ణులైన వారిని నైపుణ్య (Skill) పరీక్షకు పిలుస్తారు. ఎంపిక విధానంలో దరఖాస్తు చేసుకొన్న పోస్టుల ఆధారంగా ఉంటుంది.

🌷పరీక్ష విధానం🌷

🌴 జనరల్ ఇంటలిజన్స్ ప్రశ్నలు-25 మార్కులు-50

 🦋జనరల్ అవెర్నెస్ ప్రశ్నలు-25 మార్కులు-50

 🌴క్వాంటిటేవ్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలు-25 మార్కులు-50

 🦋ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రశ్నలు-25 మార్కులు-50

⛱️విద్యార్హత, వయోపరిమితి..⛱️

🌴విద్యార్హతలు పోస్టుల వారీగా మారుతూ ఉంటుంది.

🦋పదోతరగతి ఉత్తీర్ణతతో కొన్ని ఉద్యోగాలు, 12వ తరగతి ఉత్తీర్ణతతో కొన్న ఉద్యోగాలు ఉండగా పలు పోస్టులకు గరిష్ట విద్యార్హత గ్రాడ్యుయేషన్‌గా ఉంది.

🌴ఈ పోస్టులకు దరఖాస్తుచేసుకోవడానికి అర్హత కనీస వయసు 18 సంత్సరాలు ఉంది.

🦋చాలా పోస్టులకు గరిష్ట వయసు 30 ఏళ్లుగా ఉంది.

🌴 అయితే రిజర్వేషన్‌ల ప్రకారం ఆయా విభాగాల వారీకి వయోపరిమిత సడలింపు ఉంటుంది.

🌷దరఖాస్తు విధానం..🌷

🌴దరఖాస్తు ప్రక్రియ రెండు భాగాలుగా ఉంటుంది.

🦋ముందుగా అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ను సందర్శించాలి.

🌴అందులో NOTICES లోకి వెళ్లి. OTHERS విభాగంలో నోటిఫికేషన్ చదవాలి. అనంతరం హోం పేజీకి వచ్చి దరఖాస్తు ప్రక్రియ మొదలు పెట్టాలి

🦋మొదట వన్‌టైం రిజస్ట్రేషన్ చేసుకోవాలి.

🌴అభ్యర్థి ప్రాథమిక విద్యార్హత, పాస్‌పోర్టు ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసి ఫాం సబ్‌మిట్ చేయాలి.

🦋ఈ ప్రక్రియ అనంతరం అభ్యర్థికి రిజిస్ట్రేషన్ నంబర్‌, పాస్ వర్డ్ వస్తాయి.

🌴రెండో భాగంలో రిజిస్ట్రేషన్ నంబర్ పాస్ వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.

🦋అనంతరం ఏ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నారో క్లిక్ చేసి సమాచారం , ఫీజు చెల్లించి సబ్‌మిట్ చేయాలి.

🌴పరీక్షకు దరఖాస్తు చేసుకొనేందుకు ఫీజు రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్ఎం క్యాటగిరీ అభ్యర్థులకు, మహిళలకు పరీక్ష ఫీజు లేదు.