1)*🔊 ‘పీఎం పోషణ్'గా మధ్యాహ్న భోజనం*
*💰ఐదేండ్లకుగాను రూ.1.30 లక్షల కోట్లు*
*🌀రూ.31,733 కోట్లు భరించనున్న రాష్ర్టాలు*
*🥏పథకంలో ప్రి-ప్రైమరీ స్కూళ్లకూ చోటు*
*💫కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు*
*🌍పాఠశాల విద్యార్థులకు పోషకాలతో కూడిన వేడివేడి ఆహారాన్ని అందిస్తున్న ‘మధ్యాహ్న భోజనం’ పథకం పేరును ‘పీఎం పోషణ్ శక్తి నిర్మాణ్ (పీఎం పోషన్)’గా మారుస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు ఆమోదం తెలిపింది.*
*పీఎం పోషణ్ స్కీమ్-ముఖ్యాంశాలు*🔰
```★మధ్యాహ్న భోజనం పథకం..
ఇకపై ‘పీఎం పోషణ్’ పథకంగా కొనసాగుతుంది.
★2021-22 నుంచి 2025-26 వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది.
★దీని కోసం రూ. 1,30,794.90 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో రూ. 31,733.17 కోట్లు రాష్ర్టాలు భరించనున్నాయి.
★ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే 1-8వ తరగతి విద్యార్థులతో పాటు, బాలవికాస్ లేదా ప్రీ-ప్రైమరీ స్కూళ్లను కూడా ‘పీఎం పోషన్’ పథకంలో చేర్చనున్నారు.
★ఈ పథకం ద్వారా మొత్తం 11.80 కోట్ల విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
★పండుగలు, ప్రత్యేక పర్వదినాల్లో ‘తిథి భోజన్’ పేరిట ప్రత్యేక వంటకాలను వడ్డిస్తారు.```
@@@@@
2).*🔊ఇంటర్‌లో 70% సిలబస్సే!*
*🔶రాష్ట్రాలకు కేంద్రం సూచన*
*🔷త్వరలో నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం*
*🍥రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం(2021-22) కూడా ఇంటర్‌మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో 70 శాతం సిలబస్సే ఉండనుంది. కరోనా పరిస్థితుల కారణంగా గత ఏడాది 30 శాతం పాఠ్య ప్రణాళికను తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కూడా 70 శాతం సిలబస్ ఆధారంగానే పరీక్షలు ఉండేలా చూడాలని సూచిస్తూ కేంద్ర విద్యాశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. రాష్ట్ర విద్యాశాఖ కూడా ఇందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. త్వరలో దీనిపై అధికారికంగా నిర్ణయం వెలువడనుంది.*
*💥పరీక్షలు తప్పనిసరా?*
*🌀గత మే నెలలో జరగాల్సిన ద్వితీయ ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. వారికి మొదటి సంవత్సరంలో వచ్చిన మార్కులనే ద్వితీయ సంవత్సరంలోనూ వేసి ధ్రువపత్రాలు ఇచ్చింది. ప్రథమ ఇంటర్ విద్యార్థులను మాత్రం పరీక్షలు లేకుండానే రెండో ఏడాదిలోకి ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించింది. అనుకూల పరిస్థితుల్లో పరీక్షలు జరుపుతామని ఆనాడు పేర్కొంది. విద్యార్థులు మాత్రం ప్రమోట్ అంటే 35 శాతం కనీస మార్కులతో పాసైనట్లేననుకున్నారు. ఒకవేళ భవిష్యత్తులో పరీక్షలు జరిపినా ఇష్టం లేకుంటే రాయాల్సిన అవసరం లేదని భావిస్తూ వచ్చారు. ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్‌బోర్డు కాలపట్టిక ప్రకటించింది. అయితే అందరూ తప్పనిసరిగా రాయాలా? కనీసం 35 శాతం మార్కులు ఇవ్వరా? అన్న దానిపై స్పష్టత లేదు. దీనిపై కూడా ప్రభుత్వ స్థాయిలో చర్చ సాగుతున్నట్లు సమాచారం.*
*💥రెండు సెక్షన్లలో 50 శాతం ఛాయిస్!*
*🥏కరోనా పరిస్థితుల్లో ప్రత్యక్ష తరగతులు జరగనందున గత మే నెలలో జరగాల్సిన వార్షిక పరీక్షల్లో రెండు సెక్షన్లలో 50 శాతం ఛాయిస్ ఇవ్వాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. ప్రశ్నపత్రాల్లో ఏ, బి, సి సెక్షన్లు ఉంటాయి. అందులో ఏ సెక్షన్‌లో గతంలో మాదిరిగానే 10కి 10 ప్రశ్నలకు జవాబులు రాయాలి. బి, సి సెక్షన్లలో 7లో 5 ప్రశ్నలకు గతంలో సమాధానాలు రాయాల్సి ఉండగా...10లో 5 రాసేలా విధానాన్ని మార్చాలని అనుకున్నారు. చివరకు పరీక్షలు జరగలేదు. వాటినే ఈసారి అక్టోబరు 25వ తేదీ నుంచి జరిగే ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షల్లో అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.*
@@@@@
3).*🔊మైనార్టీ రెసిడెన్షియల్ ఉద్యోగులకు సవరించిన వేతనాలు*
*📜ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం*
*🌍రాష్ట్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేష నల్ సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సవరించిన వేతనాలనువర్తింపజేయాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. 1 జూలై 2018 నుంచి ఉద్యోగులకు ఈ వేతనాలను అందజేయాలని పేర్కొంది. ఉద్యోగులు ప్రభుత్వం నిర్దేశించిన ప్రొఫార్మా ప్రకారం అప్డేట్ చేసిన సర్వీస్ రిజిస్టర్ ను సమర్పించాలని ఆదేశించింది. టీఎంఆర్ఈఐఎస్ విధులు నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్, జూనియర్ లెక్చరర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, ట్రెయిన్ డ్యుయేట్ టీచర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, లైబ్రేరియన్, స్టాఫ్ నర్స్, మ్యూజిక్ టీచర్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్లకు లబ్ది చేకూరనుంది.*
@@@@@
4).*🔊ఏపీ స్థానికత*
*ఉద్యోగులకు తీపికబురు*
*💱స్వరాష్ట్రానికి వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్!*
*📜అక్టోబర్ 15 వరకుదరఖాస్తులు*
*💫 శాశ్వతబదలీలకు సర్కార్ సిద్ధం*
*♦️నిరభ్యంతర పత్రంతో రిలీవ్కేసులు లేకుంటేనే అవకాశం*
*🌻తెలంగాణలో ఉద్యోగ ఫ్రెండ్లీవిధానాలతో పునరాలోచనలోఉద్యోగులు*
హైదరాబాద్, *🌍ఏపీకి వెళ్లాలనుకునే తెలంగాణలో పనిచేస్తు న్న ఉద్యోగులు అక్టోబర్ 15లోగా దర ఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆప్షన్ ఇచ్చింది. శాశ్వతంగా కోరుకున్న ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదలీకి నిర భ్యంతర పత్రంఅందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారంనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ సర్య్కులర్ జారీ చేశారు. ఏపీకి వెళ్లా లని భావిస్తున్న ఉద్యోగులు వచ్చే నెల 15లోగా శాఖా ధిపతులకు దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించారు. ఎటువంటి శాఖాపరమైన విచారణలు, కేసులు లేని ఉద్యోగుల వినతులను పరిశీలించి ప్రభుత్వానికి సిఫా రు చేయనున్నారు. ఆ తర్వాత ఎన్వోసీ జారీ చేయా లని నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వ ఆమోదం తర్వాత వారిని తెలంగాణ నుంచి రిలీవ్ చేసి సర్వీస్ పుస్తకంలో నమోదు చేయనున్నారు. ఉద్యోగిని రిలీవ్ చేసిన తర్వా త ఎటువంటి పరిస్థితుల్లోనూ తిరిగి వచ్చేందుకు అనుమతించబోమని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది.*
*🍥తాజా ఉత్తర్వులతో రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి వెళ్లా లనుకుని బదలీ అవకాశం కోల్పోయిన పలు వురికి మేలు చేకూరనుంది. ఏపీకి శాశ్వతంగా వెళ్లేం దుకు ఇరు రాష్ట్రాల సమ్మతి నేపథ్యంలో అతిపెద్ద కసర త్తు కీలక దశకు చేరింది. ఇందుకు ఉద్యోగులు ఏపీ నుం చి అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ తర్వాత నిర్దేశిత చట్టంలో పేర్కొన్న ఆస్తు లు, అప్పులు, భవనాలు, శాఖల వారీగా ఉద్యోగులవిభజన కూడా జరిగింది, అయితే ఉద్యోగుల నుంచి అప్పట్లో ఆప్షన్లు తీసుకుని బదలీలుపూర్తి చేశారు. రాష్ట్ర కేడర్ పోస్టులను 58:42నిష్పత్తిలో విభజించి ఇరు రాష్ట్రాలకు కేటాయింపులు చేశారు. ఇతర ఉద్యో గులను ఏ జిల్లాలో పనిచేస్తున్న వారిని ఆ జిల్లాకే కేటా యించారు. నియామకం సమయంలో సర్వీస్ బుక్ లో నమోదు చేసిన సొంత జిల్లాలను అప్పట్లో ప్రాతిపదికగా తీసుకున్నారు. ఈ తతంగాన్ని షీలాబిడే కమిటీ పూర్తి చేసింది. తాజా నిర్ణయంతో ఏపీ నుంచి తెలంగాణకు 223 మంది ఉద్యోగులు రావాల్సి ఉండగా వారికి కూడా మేలు చేకూరనుంది. ఇందులో 123మంది ఎన్జీవోలు, 100మంది వరకు గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు ఉన్నారు. వీరందరినీ స్వరాష్ట్రానికి తీసుకురానున్నారు.*
*💱ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతా నికి చెందిన పలువురు తెలంగాణలో ఉపాధ్యాయు లుగా ఎంపికయ్యారు. ఇతర శాఖల్లోనూ ఇలా ఎంపి కైన వారి సంఖ్య భారీగానే ఉంది. ఈ నేపథ్యంలో అనే కమంది ఉద్యోగులు ఖాళీల కారణంగా సొంత రాష్ట్రా ల ఆప్షన్ లభించక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేప థ్యంలో ఏపీకి వెళ్లే ఉద్యోగులతోపాటు, ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే ఉద్యోగులకు కూడా ప్రయో జనంకల్గేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏపీకి శాశ్వతంగా బదలీపై వెళ్లే ఉద్యోగులు తప్పని సరిగా నిరభ్యంతర పత్రాలు పొందాల్సి ఉంటుందని, ఇందుక 3 వచ్చే నెల 15లోగా శాఖాధిపతులకు దర ఖాస్తు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ దర ఖాస్తుల ఆధారంగా వారిని ఏపీకి పంపేందుకు ఎటు వంటి అభ్యంతరం లేదని హెచ్వీడీలు తమ శాఖల ముఖ్య కార్యదర్శులకు సిఫార్సు చేయాలని ఆదేశిం చింది. ఈ జాబితాను ఏపీ ప్రభుత్వానికి పంపి వారి అనుమతి రాగానే ఇక్కడి నుంచి రిలీవ్ చేయాలని నిర్దేశించారు.*
*💫ఈ అవకాశంతో సుమారు 3వేలకు పైగా ఉద్యో గులు ఏపీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని తెలు స్తోంది. ఇందులో ఉపాధ్యాయులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్, నాల్గో తరగతి ఉద్యోగులు ఉన్నారు. అయితే పదవీ విరమణ పెంపు నేపథ్యంలో కొందరు తెలం గాణలో ఉండాలని నిర్ణయించుకున్నారని, ఏపీకి చెంది, బాగా స్థిరపడిన వారే వెళ్లేందుకు సుముఖంగా ఉన్నారని సమాచారం. ఏపీలో పదవీ విరమణ వయ సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచారు. తెలం గాణలో ఈ పరిమితి 61ఏళ్లుగా ఉంది. ఏపీలో ఫిట్ మెంటు బదులు 27శాతం మధ్యంతర భతి ప్రక టించారు. కానీ తెలంగాణలో 30 శాతం పీఆర్సీ ఫిట్మెంట్ను ప్రభుత్వం ప్రకటించి అమలు చేసింది. తెలంగాణలో ఉద్యోగులకు ప్రతినెలా ఠంచన్ 5లో పు వేతనాలు అందుతున్నాయి. ఏపీలో ప్రతినెలా 20 తర్వాత కూడా వేతనాలు చెల్లింపుల్లో జాప్యం జరు గుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు మంచీ చెడు లను కూడా పునరాలోచన చేస్తున్నారు. తాజా నిర్ణ యంతో వచ్చే నెల 15లోగా ప్రభుత్వానికి ఎంతమంది దరఖాస్తు చేస్తారో వేచి చూడాలి.*
Ad:
Smart Online Shop :