1).*🔊ఉద్యోగాలు... లేదా కారుణ్య మరణాలు!*
*🌀హక్కుల కమిషన్‌కు గురుకుల పీఈటీ అభ్యర్థుల వినతి*
‘తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల్ని గౌరవిస్తూ గురుకులాల్లో పీఈటీ ఉద్యోగాలిచ్చి జీవితాలను నిలబెట్టండి.. లేకుంటే కారుణ్య మరణాలకైనా అనుమతివ్వండి’ అంటూ గురుకుల పీఈటీ అభ్యర్థులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్‌హెచ్‌ఆర్‌సీ)కి శనివారం విన్నవించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు విలేకరులతో మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలల్లో పీఈటీ పోస్టుల కోసం 2017 ఏప్రిల్‌లో నోటిఫికేషన్ ఇచ్చింది. 2018 మేలో ధ్రువపత్రాలు పరిశీలించగా.. అర్హత సాధించని అభ్యర్థులు కొందరు హైకోర్టుకు వెళ్లడంతో నియామకాలను నిలిపివేశారు. 2021 మార్చిలో కేసు పరిష్కారమైంది. ఎంపికైన అభ్యర్థులందరికీ మూడు వారాల్లో పోస్టింగ్ ఇవ్వాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ఆదేశాలు వచ్చి ఆరు నెలలైనా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులు బలవన్మరణానికి పాల్పడగా.. శుక్రవారం మరో అభ్యర్థి శ్రీనాథ్ ఆత్మహత్య చేసుకున్నాడు’ అని వాపోయారు. వారం, పది రోజుల్లో పోస్టింగ్‌లు ఇవ్వకపోతే సామూహిక ఆత్మహత్యలే శరణ్యమని వారు తెలిపారు.*
@@@@
2).*🔊తెలుగు వర్సిటీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్*
*🍥ఈనాడు, హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పీహెచ్‌డీ, ఎంఫిల్‌తో పాటు హైదరాబాద్‌లో బీఎఫ్‌ఏ, ఎంఎఫ్‌ఏ (శిల్పం-చిత్రలేఖనం, ప్రింట్ మేకింగ్), ఎంఏ (తెలుగు, అనువర్తిత భాషాశాస్త్రం చరిత్ర, టూరిజం, కర్ణాటక సంగీతం, జర్నలిజం), ఎంపీఏ (కూచిపూడి/ఆంధ్రనాట్యం, జానపద, రంగస్థల కళలు), ఎంఏ జ్యోతిషం, వివిధ లలిత కళల్లో పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్, ప్రాథమిక, ప్రవీణ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రాజమహేంద్రవరంలో ఎంఏ (తెలుగు), శ్రీశైలంలో ఎంఏ (చరిత్ర, పురావస్తు శాస్త్రం), కూచిపూడిలో ఎంపీఏ (కూచిపూడి నృత్యం), వరంగల్‌లో రెండేళ్ల కాలవ్యవధితో పేరిణి నృత్యంలో విశారద కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేదీ అక్టోబరు 11గా నిర్ణయించినట్లు రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేశ్ తెలిపారు. పూర్తి వివరాలను www.teluguuniversity.ac.in లేదా www.pstucet.org లలో చూడాలని సూచించారు*
@@@@@
3).*🔊అక్టోబర్ 21 వరకు ఓపెన్ ప్రవేశాల గడువు*
*🍥తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో 2021-22 విద్యాసంవత్సరానికిగానుఎస్సెస్సీ, ఇంటర్ ప్రవేశాల గడువును అక్టోబర్ 21 వరకు పొడిగించినట్టు డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు.
@@@@@
4) *🔊నవోదయలో ప్రవేశానికి దరఖాస్తులు*
*🍥జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2022-23 విద్యాసంవత్సరానికి ఆరో* *తరగతిలో ప్రవేశానికి నవంబర్ 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 30న నిర్వహిస్తారు. విద్యార్థులు 2021-22లో ఐదో తరగతి చదివి ఉండాలి. విద్యార్థులు 1.5.2009నుంచి 30.4.2013 మధ్య జన్మించి ఉండాలి. సంబంధితజిల్లాలోని పభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలలో 3, 4వ తరగతులు చదివిఉండాలి. దరఖాస్తులను www.navodaya.gov.in లో పొందవచ్చు.
Advt:
Smart Online Shop :
@ ఫ్లోర్ శుభ్రం చేసేటప్పుడు అన్ని మూలలకు సులభంగా చేరుకోగలిగే mop ఇది.
@ రెండు చేతులతో పని లేకుండా ఒక చేత్తో దీన్ని ఆపరేట్ చేయొచ్చు
@ మాపింగ్, డస్టింగ్ రెండు అవసరాలకు దీన్ని వాడవచ్చు
తడిని బాగా పీల్చుకునే మైక్రో ఫైబర్ mop ఇది.
✅డిస్కౌంట్ తో ఇప్పుడు కేవలం రూ. 1,399 లకే లభిస్తోంది.
దీంట్లో మూడు రంగులు లభిస్తున్నాయి.
✅కొనుగోలు చేసే లింక్: https://amzn.to/2Xy4Fk0
💐💐💐💐💐💐💐💐💐💐💐💐