*🔶ప్రస్తుతం సెకండియర్ చదువుతున్న విద్యార్థులకే..*
*🔷షెడ్యూల్ విడుదలచేసిన ఇంటర్‌బోర్డు*
*🔶హాజరుకానున్న 4.35 లక్షల మంది*
*🍥కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో వాయిదా పడిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షల నిర్వహణపై ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది మే 5 నుంచి జరగాల్సిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను వాయిదావేసి.. విద్యార్థులందరినీ పైతరగతులకు ప్రమోట్‌చేసింది. అప్పట్లో ఫస్టియర్‌లో 4.35 లక్షల మంది పరీక్ష ఫీజు చెల్లించారు. ప్రస్తుతం సెకండియర్‌లో ఉన్న వీరందరికీ అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 వరకు ఫస్టియర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇంటర్‌బోర్డు ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ శుక్రవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు.*
*💥పరీక్షల షెడ్యూల్*
*➡️తేదీ పేపర్*
*➡️25-10-21 ద్వితీయభాష*
*➡️26-10-21 ఇంగ్లిష్*
*➡️27-10-21 గణితం పేపర్ -1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్*
*➡️28-10-21 గణితం పేపర్ -1బీ, జువాలజీ, హిస్టరీ*
*➡️29-10-21 భౌతికశాస్త్రం, అర్థశాస్త్రం*
*➡️30-10-21 రసాయనశాస్త్రం, వాణిజ్యశాస్త్రం*
*➡️1-11-21 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జికోర్సు గణితం (బైపీసీ విద్యార్థులకు)*
*➡️2-11-21 మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ*
*💥పక్కాగా కొవిడ్ నిబంధనలు*
*➡️గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం 70 శాతం సిలబస్‌కే పరీక్షలు నిర్వహిస్తారు.*
*➡️వ్యాక్సిన్లు వేసుకున్న సిబ్బందినే పరీక్షల నిర్వహణకు కేటాయిస్తారు.*
*➡️పరీక్ష కేంద్రాల్లో కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తారు,*
*➡️ఒక్కో పరీక్ష కేంద్రంలో ఒకటి లేదా రెండు ఐసొలేషన్ గదులు ఏర్పాటుచేస్తారు. కొవిడ్ లక్షణాలుంటే వారిని ఆయా గదుల్లో ఉంచి పరీక్ష రాయిస్తారు.*
*➡️ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ ఎగ్జామ్స్‌ను అసైన్‌మెంట్ల రూపంలో ఇచ్చినందున ప్రస్తుతానికి ఆ పరీక్షలు నిర్వహించరు.*
*➡️వొకేషనల్ కోర్సులకు ఇదే షెడ్యూల్ వర్తిస్తుంది. కానీ, సబ్జెక్టులవారీ షెడ్యూల్‌ను వేరుగా విడుదల చేస్తారు.*
@@@@
2)*🔊ఎడ్‌సెట్‌లో 98.53% అర్హత*
*🔶ఇప్పటిదాకా ఇదే అత్యధిక ఉత్తీర్ణత*
*🔷తమ్మిశెట్టి మహేందర్‌కు ఫస్ట్ ర్యాంకు*
*🔶అకెనపల్లి ప్రత్యూషకు రెండో ర్యాంకు*
*🔷ఫలితాలు విడుదలచేసిన ప్రొఫెసర్ లింబాద్రి*
*🍥టీఎస్ ఎడ్‌సెట్‌లో 98.53 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఎడ్‌సెట్‌లో ఇంతమంది క్వాలిఫై కావడం సెట్ చరిత్రలో ఇదే తొలిసారి. రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాలకు ఆగస్టు 24, 25 తేదీల్లో ఎడ్‌సెట్ నిర్వహించగా.. శుక్రవారం మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. 33,683 (98.53%) విద్యార్థులు అర్హత సాధించారు. గతేడాది 77 శాతమే ఉత్తీర్ణులయ్యారని, 98 శాతానికిపైగా పాస్ కావడం ఇదే తొలిసారి అని అధికారవర్గాలు వెల్లడించాయి. పురుషులు 99.52 శాతం, మహిళలు 98.24 శాతం మంది అర్హత సాధించారు.*
*🌀బీఈడీ కోర్సుల్లో చేరే మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. 42 వేలమంది ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 32 వేల మంది మహిళలే ఉండటం గమనార్హం. అర్హత సాధించినవారిలోనూ వారే అధికం.*
*💠ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 100కు వందశాతం క్వాలిఫై కావడం గమనార్హం. ఎస్సీలు 4,770 మంది, ఎస్టీలు 7,868 మంది పరీక్ష రాయగా.. అంతా పాస్ అయ్యారు.*
*🥏భద్రాద్రి కొత్తగూడెం, విజయవాడ కేంద్రాల్లో పరీక్షరాసిన వందశాతం మంది అర్హత సాధించారు.*
*♦️ఇంగ్లిష్/ తెలుగులో 98.71%, ఇంగ్లిష్/ ఉర్దూలో 96.54 % చొప్పున మంది అర్హత సాధించారు.*
@@@@@
3).*🔊సర్కారు కాలేజీలో చదివారా.. ఇంజినీరింగ్ విద్య ఉచితం*
*🔶ఎంసెట్‌లో పదివేలపైన ర్యాంకు వచ్చినా..*
*🔷బీసీ, ఓసీ విద్యార్థులకు పూర్తిగా ఫీజు లేదు*
*🔶ప్రభుత్వ ఇంటర్ కాలేజీ విద్యార్థులకు వర్తింపు*
*🔷ఎంసెట్ తొలి విడతలో 4,566 మందికి లబ్ధి*
*🔶చలాన్‌లో జీరో ఫీజు.. విద్యార్థుల సంబురాలు*
*🍥ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీల్లో చదివిన పేద విద్యార్థులకు ప్రభుత్వం ఆపన్నహస్తం అందించింది. ఎంసెట్‌లో పదివేలకంటే ఎక్కువ ర్యాంకు వచ్చినా ఈ ఏడాది నుంచి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ కల్పిస్తున్నది. గతేడాది వరకు ఓసీ, బీసీ విద్యార్థులకు ఎంసెట్‌లో పదివేలలోపు ర్యాంకు వస్తేనే ఇంజినీరింగ్‌లో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉండేది. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ కాలేజీల్లో చదివిన విద్యార్థులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పటికే ఎంసెట్ మొదటి విడత కౌన్సెలింగ్‌లో 4,566 మంది విద్యార్థులు లబ్ధి పొందారు. టాప్‌టెన్ ఇంజినీరింగ్ కాలేజీల్లో సీటు వచ్చినా ప్రభుత్వ విద్యార్థులకు ఈ అవకాశం ఉండనున్నది.*
*💥ఆదాయ ధ్రువీకరణ తప్పనిసరి*
*🌀ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో భాగంగా ఎంసెట్‌లో 10వేలలోపు ర్యాంకు వచ్చినవారికి ఏ కాలేజీలో సీటు వచ్చినా పూర్తి ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ఏ కులం వారికైనా ఇది వర్తిస్తుంది. పదివేల పైన ర్యాంకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు తమ కుటుంబ ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన స్థాయికంటే తక్కువే ఉన్నదని ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే పూర్తి ఫీజును ప్రభుత్వం చెల్లిస్తున్నది. పదివేల పైన ర్యాంకు వచ్చిన బీసీ విద్యార్థులకు రూ.35 వేలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌గా చెల్లిస్తుండగా, మిగతా ఫీజును విద్యార్థులే భరించాలి. తాజా నిర్ణయం ప్రకారం సర్కారు కాలేజీల్లో చదివిన ఏ కులం విద్యార్థులకైనా ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రభుత్వ కాలేజీలతోపాటు, రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకులాలు, కార్పొరేట్ కాలేజీ స్కీమ్‌లలో లబ్ధిపొందిన విద్యార్థులకు కూడా ఈ పథకం వర్తిసుంది. వీరు కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. కుటుంబ వార్షికాదాయం ప్రభుత్వం నిర్ణయించిన స్థాయికి మించి ఉంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదు.*
*💥విద్యార్థుల ఆనందం*
*🥏ఈ ఏడాది ఎంసెట్ మొదటి విడత కౌన్సిలింగ్‌లో ప్రభుత్వం ఈ పథకాన్ని వర్తింపజేసింది. దాంతో ఫీజుల భారంతో భయపడుతున్న విద్యార్థులకు ట్యూషన్ ఫీజు జీరో అని వెబ్‌సైట్‌లో చూపించటంతో ఎగిరి గంతేస్తున్నారు. వేలకువేల ఫీజులకు డబ్బు కూడగట్టుకోలేక సతమతమవుతున్న తల్లిదండ్రులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. టెక్, బీఆర్క్ కోర్సుల్లో చేరేవారికి ప్రస్తుతం అవకాశం కల్పించారు.*
*💥పేద విద్యార్థులకు వరం*
*💠ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇంటర్ చదివిన విద్యార్థులు ఉత్తమ కళాశాలల్లో బీటెక్ చేసేందుకు ఆర్థిక స్తోమత లేక వెనక్కు పోవాల్సిన వస్తున్నది. ప్రభుత్వ తాజా నిర్ణయం వారికి గొప్ప అవకాశం. భవిష్యత్తులో మరింత మంది మంచి ఇంజినీర్లు బయటకు రావడానికి ఇలాంటి నిర్ణయాలే దోహాదపడతాయి.
Ad:
Smart Teachers Online Shop :
@ ఎక్కువగా మార్కెట్లో అల్యూమినియం ప్రెజర్ కుక్కర్స్ వాడుతూ ఉంటారు.
@ వాటితో పోలిస్తే స్టీల్ ప్రెజర్ కుక్కర్ వేగంగా ఆహారాన్ని కుక్ చేస్తుంది.
@ అయితే అల్యూమినియం వాటితో పోలిస్తే స్టీల్ ప్రెజర్ కుక్కర్ లు కొద్దిగా బరువు ఎక్కువగా ఉంటాయి.
@ అయినప్పటికీ మంచి పెర్ఫార్మెన్స్ కోసం స్టిల్ ప్రెజర్ కుక్కర్ తీసుకోవాలనుకునే వారు దీనిని ఎంపిక చేసుకోవచ్చు.
@ డిష్‌వాషర్‌లో వాష్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. మామూలు గ్యాస్ స్టవ్ మీద మాత్రమే కాకుండా ఇండక్షన్ స్టవ్‌లపై కూడా వాడొచ్చు.
@ 3 లీటర్ల కెపాసిటీ ఉన్న కుక్కర్‌ని లైట్నింగ్ డీల్‌లో రూ. 1,615కి ఇక్కడ కొనుగోలు చేయవచ్చు.
@ కొనుగోలు చేసే లింకు: https://amzn.to/3ApA8nl
@ 5 లీటర్ల కెపాసిటీ ఉన్న మోడల్ ని రూ. 1,979 లకే ఇక్కడ కొనొచ్చు
@ కొనుగోలు చేసే లింకు: https://amzn.to/3Cv60HR