Tuesday, 7 September 2021

Standard Operating Procedure for Schools Reopening

SOP for reopening of all Educational Institutions in the context of Covid 19

     సుమారు 16 నెలల తర్వాత తెలంగాణలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి స్కూల్స్ పున: ప్రారంభమయ్యాయి. కరోనా థర్డ్ వేవ్ నేపధ్యంలో హైకోర్టు పలు కీలక ఆదేశాలు ఇవ్వడంతో.. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ మినహా మిగతా అన్ని పాఠశాలలు, సంక్షేమ పాఠశాలలు గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనకు సర్కార్ అనుమతించింది. ఈ క్రమంలోనే హైకోర్టు ఆదేశాలను అనుసరిస్తూ విద్యాసంస్థల్లో కోవిడ్ బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. అన్ని రకాల విద్యాసంస్థలు వీటిని తప్పనిసరిగా అమలు చేయాలని సూచించింది.

@    విద్యాసంస్థలు పాటించాల్సిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి..

* ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలి.

* స్టూడెంట్స్, టీచర్లు ఎలప్పుడూ మాస్కులు ధరించాలి.

* తరచూ చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవడం, శానిటైజర్ వాడటం తప్పనిసరి.

* విద్యార్థుల ఆరోగ్యంపై రెగ్యులర్ మోనిటరింగ్ చేయాలి.

* పాఠశాల ఆవరణలో ఉమ్మడం నిషేధం.

*విద్యార్థులు ఇంటి దగ్గరే ఉండి చదువుకోవాలనుకుంటే ఆన్లైన్ తరగతుల ద్వారా చెప్పాల్సిందే.

* ఫిజికల్ అటెండెన్స్ తప్పనిసరి కాదు.

* వెనకబడిన విద్యార్థులను స్కూల్ ప్రిన్సిపాల్ తప్పనిసరిగా దృష్టి సారించాలి.

* అవసరమైతే బ్రిడ్జి కోర్సు‌లను అమలు చేయాలి.

* పాఠశాల ఆవరణలో స్నేహపూర్వక వాతావరణం ఏర్పాటయ్యేలా చూసుకోవాలి.

* పిల్లలను స్కూలుకు పంపకపోతే పేరెంట్స్‌పై లేదా విద్యార్థిపై ఎలాంటి పెనాల్టీ విధించకూడదు.

* పాఠశాల అసెంబ్లీ, గ్రూప్ డిస్కషన్స్, గేమ్స్ తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అనుమతి లేదు.
* మిడ్ డే మీల్స్ సమయంలో కిచెన్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలి.

* పోషకాలు నిండిన ఆహారం విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలి.

* కిచెన్ రూమ్, డైనింగ్ హాల్, డ్రింకింగ్ వాటర్ దగ్గర ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరి.

* విద్యార్థులు ఎంట్రీ ఎగ్జిట్ సమయాల్లో ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరి.

* ట్రాన్స్‌పోర్ట్ సమయంలో కోవిడ్ నిబంధనలు పాటించాలి.

* ప్రతీ విద్యార్ధికి పాఠ్య పుస్తకాలు అందించాలి.

* పెన్సిల్, పెన్, బుక్స్, ఫుడ్, వాటర్ బాటిల్స్, గ్లాసులు, ప్లేట్స్ ఇలా ఏవి కూడా విద్యార్ధులు ఒకరికొకరు షేర్ చేసుకోకుండా చూసుకోవాలి.

DOWNLOAD :