1)._🔊ప్రధానోపాధ్యాయులకు ఆన్‌లైన్ శిక్షణ_*
*🌀దరఖాస్తుల ఆహ్వానం..
*_🍥పాఠశాల నిర్వహణలో బృంద నాయకుడిగా ప్రధానోపాధ్యాయుడి పాత్ర కీలకమైనది. తోటి ఉపాధ్యాయులను సమన్వయపరుస్తూ.. పాఠశాల ప్రగతిలో సమాజ భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ విద్యా పురోభివృద్ధికి .. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాల్సి ఉంటుంది. నేడు విద్యారంగంలో నూతన పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తుండడంతో రోజు రోజుకూ ప్రధానోపాధ్యాయుడి బాధ్యతలు వినూత్నంగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారిని పాఠశాల నిర్వహణ తదితర అంశాల్లో మరింత సుశిక్షితులుగా చేసేందుకు ఆన్‌లైన్ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ఎలిమెంటరీ, ఉన్నత, సీనియర్ సెకండరీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లకు పాఠశాల నాయకత్వం, నిర్వహణ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో జాతీయ పాఠశాల నాయకత్వ కేంద్రం (ఎన్‌సీఎస్‌ఎల్) నిర్వహిస్తోంది. భవిష్యత్తులో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కావాలనుకునే సీనియర్ ఉపాధ్యాయులు కూడా ఈ కోర్సులో చేరవచ్చు. ఇది ఉచిత శిక్షణ. ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాక పాఠశాల నాయకత్వం, నిర్వహణపై ధ్రువపత్రాన్ని కూడా పంపిస్తారు.
*💥ఏఏ అంశాలపై..
*_💠స్వీయ అభివృద్ధి, బోధన అభ్యసన ప్రక్రియ బదలాయింపు, బృందాల నిర్మాణం, నాయకత్వం, ఆవిష్కరణలు, భాగస్వామ్యాలు, పాఠశాల పరిపాలన, పాఠశాల అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేయడం లాంటి విస్తృత అంశాలపై ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమం మూడు స్థాయిల్లో ఉంటుంది. ప్రాథమిక, మాధ్యమిక, అడ్వాన్స్‌డ్. ప్రస్తుత కార్యక్రమం ప్రాథమిక స్థాయికి సంబంధించినది. మిగతా స్థాయి కార్యక్రమాలను ఎన్‌సీఎస్‌ఎల్ త్వరలో తన పోర్టల్‌లో అందుబాటులోకి తేనుంది. పూర్తి వివరాలకు.. http://pslm.niepa.ac.in వెబ్‌సైట్‌ను వీక్షించవచ్చు.
*💥ఈ కోర్సు ఎందుకు..?
*_🥏పాఠశాల అభివృద్ధి, ప్రగతి, మార్పులో ప్రధానోపాధ్యాయుడి పాత్ర కీలకమైనది. నేడు పాఠశాలల అభివృద్ధి కోసం జరుగుతున్న కృషి నిరంతరమైనది. అందువల్ల పాఠశాల నాయకత్వ అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఎల్‌డీపీ)ను దేశవ్యాప్తంగా ప్రధానోపాధ్యాయులకు నిర్వహిస్తున్నారు.
@@@@@
2).*🔊తెలంగాణ అగ్రి వర్సిటీ ప్రవేశ అర్హతల్లో మార్పులు
* ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అందించే వ్యవసాయం, అగ్రి-ఇంజనీరింగ్, సేంద్రీయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి అర్హత ప్రమాణాలను సవరించింది. 60 శాతం సీట్లు గ్రామీణ విద్యార్థులకు. ఇందులో నాలుగు సంవత్సరాలు గ్రామీణ ప్రాంతాల్లో చదివి ఉండాలి. మిగతా 40 శాతం సీట్లు గ్రామీణ, పట్టణ విద్యార్థులకు కేటాయించనుంది.*
*🌀అంతకుముందు గ్రామీణ ప్రాంతాల్లో చదివిన విద్యార్థులకు మాత్రమే మొత్తం సీట్లను కేటాయించారు. ఇటీవల జరిగిన విశ్వవిద్యాలయ అకాడెమిక్ కౌన్సిల్ సమావేశంలో అర్హత ప్రమాణాల్లో మార్పులు చేసినట్లు పీజేటీఎస్ఏయూ రిజిస్ట్రార్ ఎస్ సుధీర్ కుమార్ బుధవారం తెలిపారు. టీఎస్ పాలీసెట్ అర్హత ప్రమాణం ద్వారా ప్రవేశాలు జరుగుతాయి. ప్రవేశాలకు అవసరమైన అర్హతల్లో విశ్వవిద్యాలయం మార్పులు చేసినట్లు ఆయన తెలిపారు.*
*💫అంతకుక్రితం పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు కోర్సు చేసేందుకు అర్హులుగా ఉండే. ఇకమీదట ఇంటర్మీడియట్, పాలీసెట్‌లో చూపిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు ప్రవేశాలకు అర్హులు అని సుధీర్ తెలిపారు. ప్రవేశాలకు వయోపరిమితిలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. 15 ఏళ్లు పూర్తై 22 ఏళ్లలోపు విద్యార్థులు ఈ కోర్సులకు అర్హులు అని ఆయన తెలిపారు*
@@@@@
3).*🔊జూన్ 3వరకు ఎంసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
*🍥ఎంసెట్ పరీక్ష దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు. జూన్ 3వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చని ఎంసెట్ కన్వీనర్ ఎ.గోవర్ధన్ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
@@@@@
4).జేఈఈ అడ్వాన్స్‌డ్ వాయిదా- ప్రకటించిన ఐఐటీ ఖరగ్‌పుర్
* ఐఐటీల్లో బీటెక్‌తోపాటు బీఆర్క్ సీట్ల భర్తీకి జులై 3న నిర్వహించతలపెట్టిన జేఈఈ అడ్వాన్స్‌డ్-2021 వాయిదా పడింది. ఈ పరీక్ష నిర్వహిస్తున్న ఐఐటీ ఖరగ్‌పుర్ బుధవారం ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ ఏడాది జేఈఈ మెయిన్‌ను నాలుగు విడతల్లో జరపాల్సి ఉండగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో రెండు పరీక్షలు పూర్తయ్యాయి. ఆ తర్వాత కరోనా రెండో దశ విజృంభణతో ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించాల్సిన 3, 4 విడతల పరీక్షలను జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఆ పరీక్షల్లో మెరిట్ సాధించిన 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అనుమతి ఇస్తారు. అంటే జేఈఈ మెయిన్ 4 విడతలు పూర్తికాకుండా అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించడం కుదరదు. ఈ నేపథ్యంలో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఐఐటీ ఖరగ్‌పుర్ వెల్లడించింది. కొత్త తేదీని తర్వాత ప్రకటిస్తామని తెలిపింది.
@@@@@
5).🔊జూలై రెండో వారంలో ఇంటర్ పరీక్షలు!
*🔶కసరత్తు చేస్తున్న ఇంటర్ బోర్డు.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు
*🔷సగం ప్రశ్నలకే సమాధానాలు రాసేలా ఏర్పాట్లు.. పరీక్ష సమయం కూడా 90 నిమిషాలకు కుదింపు
*🔶వారంలో నిర్ణయం తీసుకునే చాన్స్!
* ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలను జూలై రెండో వారంలో నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. పరిస్థితులు అనుకూలిస్తే కచ్చితంగా పరీక్షలు నిర్వహించేందుకే మొగ్గు చూపుతోంది. జూన్ నెలాఖరుకు పరీక్షలు నిర్వహిస్తామని ఇటీవల అన్ని రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు, కార్యదర్శులతో కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిర్వ హించిన వర్చువల్ సమావేశంలో ప్రభుత్వం వెల్ల డించింది. అయితే జూన్ నెలాఖరుకు కరోనా అదు పులోకి వస్తుందో లేదోనన్న భావన అధికారుల్లో నెలకొంది.*
*💥సగం ప్రశ్నలకే జవాబులు*
*💠రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలను నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ప్రశ్న పత్రాలను కూడా ముద్రించింది. కరోనా కారణంగా ద్వితీయ సంవత్సర పరీక్షలను వాయిదా వేసింది. ప్రథమ సంవత్సర పరీక్షలను రద్దు చేసింది. తర్వాత వీలైనప్పుడు నిర్వహిస్తామని పేర్కొంది. ఇప్పుడు జూలైలో ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ పరీక్షలకు ఇప్పటికే ముద్రించిన ప్రశ్న పత్రాలనే వినియోగించాలని భావిస్తోంది.అయితే కరోనా, లాక్‌డౌన్ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులకు ఎక్కువ ఆప్షన్లు ఉండేలా చర్యలు చేపడుతోంది. ప్రశ్న పత్రంలో ముద్రించిన ప్రశ్నల్లో అన్నింటికీ కాకుండా సగం చాయిస్ ఉండేలా చర్యలు చేపడుతోంది. అంటే విద్యార్థులు సమాధానాలు రాసిన సగం ప్రశ్నలకు వేసే మార్కులను రెట్టింపు చేసి తుది మార్కులు ఇవ్వాలని భావిస్తోంది. అలాగే పరీక్ష సమయం కూడా 90 నిమిషాలకే కుదించాలని భావిస్తున్నట్లు తెలిసింది.*
*💥ఆప్షన్‌గానే ఫస్టియర్ పరీక్షలు..*
*🥏జూలైలో ద్వితీయ సంవత్సర విద్యార్థులతో పాటు ప్రథమ సంవత్సర విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. విద్యార్థుల పరీక్షలను రద్దు చేసినట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినందున, జూలైలో నిర్వహించే పరీక్షలను విద్యార్థులకు ఆప్షన్‌గానే నిర్వహించే అవకాశం ఉంది. ప్రథమ సంవత్సరం విద్యార్థులందరినీ 45 శాతం కనీస మార్కులతో పాస్ చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అయితే ఆ మార్కులు తక్కువగా ఉన్నాయని ఎవరైనా భావిస్తే.. పరీక్షలకు హాజరై మార్కులు పెంచుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అందుకోసమే ప్రథమ సంవత్సర పరీక్షలను నిర్వహించాలని యోచిస్తోంది.
@@@@@
@ Today's Service Info :
@ Today's TET & TRT Material Info :