Monday, 24 May 2021

TS Teacher's Diary: 24.05.2021




1)🔊🔊ఇష్టంగా.. మరింత పటిష్ఠంగా...*

*💻డిజిటల్ బోధనపై విద్యాశాఖ కసరత్తు*

*🛍️జూన్ చివరిలో లేదా జులైలో ప్రారంభించే యోచన*
     *📚వచ్చే విద్యా సంవ త్సరం (2021-2022) పాఠశాలలు తెరిచి ప్రత్యక్ష తరగ తులు మొదలు పెట్టే పరిస్థితి వచ్చే వరకు ఆన్లైన్ పాఠా లను మరింత పకడ్బందీగా కొనసాగించాలని విద్యాశాఖ భావిస్తోంది. గత ఏడాది అనుభవాలు, లోటుపాట్లను సరిదిద్దుకొని మెరుగ్గా ఆన్లైన్ విద్యను ముందుకు తీసు కెళ్లేందుకు సంసిద్ధమవుతోంది. గత విద్యా సంవ త్సరం (2020-21) సెప్టెంబరు 1 నుంచి ఆన్లైన్ విద్యను ప్రారంభించారు. కరోనా సద్దుమణిగి ప్రత్యక్ష తరగతులు మొదలు పెట్టొచ్చని ఎదురుచూస్తూ చివరకు ఇక లాభం లేదని ఆలస్యంగా డిజిటల్ పాఠాలకు శ్రీకారం చుట్టారు. ఈసారి ప్రత్యక్ష తరగతుల కోసం ఎదురుచూడకుండా ఆన్లైన్ పాఠాలను జూన్ నెలాఖరు లేదా జులై నుంచి ప్రారంభించాలని యోచిస్తున్నారు. గత ఏడాది తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో 3-10 తరగతులకు కలిపి దాదాపు 2 వేల ఆన్లైన్ పాఠాలను పాఠశాల విద్యాశాఖ లోని రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ(సైట్) రూపొందిం చింది. వాటిని టీవీల ద్వారా ప్రసారం చేశారు. సిలబ స్లో 30 శాతం తగ్గించినందున వాటికి సంబంధించిన అంశాలపై మరో 700 వరకు పాఠాలను రికార్డు: చేయాల్సి ఉంటుందని అధికారి ఒకరు తెలిపారు.*
@@@@@

2).🔊జూన్‌ నెలాఖరులో ఇంటర్‌ పరీక్షలు!
*🌀తెలంగాణ ప్రభుత్వ యోచన

*🍥 కరోనా తీవ్రత తగ్గితే జూన్‌ నెలాఖరులో ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర మంత్రులు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, అధికారులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. అవకాశం ఉంటే జూన్‌ నెలాఖరులో పరీక్షలు జరుపుతామని, లేని పక్షంలో ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించుకుంటున్నామని ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా వారికి చెప్పినట్లు తెలిసింది. రెండో ఏడాది విద్యార్థులకు పరీక్షలు లేకుంటే ప్రథమ సంవత్సరం పరీక్షల్లో మార్కుల ఆధారంగా ఇవ్వడం లాంటి వాటిని పరిశీలిస్తున్నామని వివరించినట్లు సమాచారం. ఈ ప్రత్యామ్నాయ మార్గాలపై ఇంటర్‌బోర్డు గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చింది. ఇంటర్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏప్రిల్‌లో ప్రకటించిన ప్రభుత్వం జూన్‌ 1న సమీక్షించి అప్పటి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో దాదాపు 9.50 లక్షల మంది ఇంటర్‌ విద్యార్థులు పరీక్షలపై స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు.
@@@@@

3).*1 నుంచి పిల్లలపై కొవాగ్జిన్‌ ట్రయల్స్‌!

*_🍥భారత్‌ బయోటెక్‌ 2-18 ఏండ్ల వయస్కులవారిపై కొవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను జూన్‌ 1వ తేదీ నుంచి ప్రారంభించాలని భావిస్తున్నది. దేశవ్యాప్తంగా 525 మంది బాలలపై ప్రయోగాలు జరుపనున్నట్టు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. ప్రయోగాలు త్వరగా పూర్తయ్యి ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో పిల్లలకు కొవాగ్జిన్‌ టీకా వేసేందుకు అనుమతులు వస్తాయని భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణా ఎల్లా ఆశాభావం వ్యక్తంచేశారు. పిల్లలపై కొవాగ్జిన్‌ ఫేజ్‌ 2, 3 క్లినికల్‌ ట్రయల్స్‌కు ఇటీవలే కేంద్రం అనుమతులు మంజూరుచేసిన సంగతి తెలిసిందే._
@@@@@

4).*🔊వ్యవసాయ పాలిటెక్నిక్‌.. గ్రామీణ విద్యార్థులకు వరం*
*🍥గ్రామీణ విద్యార్థులకు మెరుగైన ఉపాధి, ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలను నిర్వహిస్తోంది. పదో తరగతి తత్సమాన విద్యార్హతతో డిప్లొమా కోర్సును పూర్తిచేసిన విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో స్థిరపడేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తెలంగాణ ఏర్పడ్డాక డిప్లొమా పూర్తిచేసిన విద్యార్థులతో వ్యవసాయ విస్తరణాధికారి పోస్టులను భర్తీ చేయడంతో ప్రవేశాలకు పోటీ తీవ్రమైంది. 2021-22 సంవత్సరానికి గానూ వ్యవసాయ పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి ప్రకటన వెలువడిన నేపథ్యంలో ...........

*🥏అర్హత : విద్యార్థులు ఒకటి నుంచి పదో తరగతి వరకు ఏవైనా 4 సంవత్సరాలు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతంలో చదివి ఉండాలి. పదో తరగతి తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతతో పాటు, తెలంగాణ పాలిసెట్‌లో అర్హత సాధించిన వారు అర్హులు. విద్యార్థులు 2021 డిసెంబరు 31 నాటికి 15 - 22 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. (31.12.1999 - 31.12.2006 మధ్య జన్మించినవారై ఉండాలి)*

*💥ఎంపిక విధానం*

 *👉ఇలా.. : పాలిసెట్‌-2021లో అభ్యర్థులు సాధించిన మెరిట్‌ ర్యాంకుల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.*

*👉ముఖ్యమైన తేదీలు : ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రారంభ తేదీ - మే 24 2021*

*👉దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ : 11 జూన్‌ 2021*

*👉రూ.100 అపరాధ రుసుముతో 13 జూన్‌ 2021*

*👉రూ.300 అపరాధ రుసుముతో 15 జూన్‌ 2021*

*👉పరీక్ష తేదీ, ఫలితాలు, కౌన్సిలింగ్‌ తేదీలను త్వరలో ప్రకటిస్తారు.*

@@@@@

@    Today's Service Info : 

        #    Extra Ordinary Leave ( EOL)

@    Today's TRT & TET Material Info :

        #    10th Class Social TM