1) PECET దరఖాస్తు గడువు మరోసారి పెంపు
వ్యాయామ విద్య(బీపీఎడ్, డీపీఎడ్) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పీఈసెట్‌కు ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 22 వరకు పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. గడువును పెంచడం ఇది రెండోసారి. ఈ కోర్సులకు ఇప్పటివరకు 1,525 దరఖాస్తులు మాత్రమే అందాయి.*
@@@@@
2)BITSAT-2021 వాయిదా...
వచ్చే విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం జూన్ 24వ తేదీ నుంచి 29 వరకు నిర్వహించతలపెట్టిన బిట్‌శాట్-2021(బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్) పరీక్షలను కరోనా పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేసినట్లు బిట్స్ పిలానీ సంస్థ తెలిపింది. ఈ విషయాన్ని సంస్థ వెబ్‌సైట్‌లో ప్రకటించింది. ఆ పరీక్షను జులై-ఆగస్టులో నిర్వహించే అవకాశముందని, నిర్వహణ తేదీలను జూన్‌లో వెల్లడిస్తామని పేర్కొంది. పరీక్షకు దరఖాస్తు చేసే గడువును జూన్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపింది.
*💥క్లాట్-2021 కూడా..*
*🌀దేశంలోని 22 ప్రతిష్ఠాత్మక న్యాయ విశ్వవిద్యాలయాల్లో 2021-22 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు జూన్ 13వ తేదీన నిర్వహించతలపెట్టిన కామన్ లా అడ్మిషన్ టెస్టు(క్లాట్-2021) వాయిదా పడింది. ఈ మేరకు వర్సిటీల కన్సార్షియం కమిటీ శనివారం నిర్ణయం తీసుకుంది. పరీక్ష నిర్వహించే తేదీని తర్వాత వెల్లడిస్తారు. పరీక్ష వాయిదా పడిన నేపథ్యంలో దరఖాస్తుల సమర్పణకు తుది గడువును జూన్ 15వ తేదీ వరకు పొడిగించారు. హైదరాబాద్‌లోని నల్సార్, విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం సీట్లను క్లాట్ ర్యాంకు ఆధారంగానే భర్తీ చేస్తారు.
@@@@@
3) ఉస్మానియా ఇంజినీరింగ్ చివరి ఏడాది పరీక్షలు ఆన్‌లైన్‌లో..
ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాల నాలుగో ఏడాది రెండు సెమిస్టర్ల పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. నాలుగో ఏడాది మొదటి సెమిస్టర్‌కు సంబంధించి మార్చి మూడో వారంలో ఒక పరీక్ష పూర్తయ్యాక.. మిగతావి వాయిదా పడ్డాయి. వీటిని జూన్ మొదటి వారంలో నిర్వహించనున్నారు. చివరి సెమిస్టర్ పరీక్షలపై నెలాఖరులోగా విభాగాధిపతులతో చర్చించి షెడ్యూల్ ప్రకటించనున్నట్లు ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.ఎం.కుమార్ తెలిపారు. జులై 10 నుంచి ఈ పరీక్షలు జరిగే అవకాశం ఉందని సమాచారం. అనంతరం పది రోజుల్లో ఫలితాలు ప్రకటించి, జులై ఆఖరుకల్లా విద్యార్థులకు పట్టాలు ఇవ్వాలని భావిస్తున్నారు.
*💥జేఎన్‌టీయూలో ప్రాజెక్టుల మూల్యాంకనం..*
ఇంజినీరింగ్, ఫార్మసీ చివరి ఏడాది విద్యార్థుల ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్ మూల్యాంకనాన్ని ఈ ఏడాది కూడా ఆన్‌లైన్‌లో చేపట్టాలని జేఎన్‌టీయూ నిర్ణయించింది. చివరి ఏడాది విద్యార్థుల ప్రాజెక్టుల వివరాలను ఈ నెల 18లోపు వర్సిటీకి సమర్పించాలని రిజిస్ట్రార్ డాక్టర్ మంజూర్ హుస్సేన్ శనివారం వర్సిటీ అనుబంధ, గుర్తింపు పొందిన కళాశాలల యాజమాన్యాలను ఆదేశించారు. గత జూన్‌లో విద్యాసంస్థలు మూసి ఉండటంతో ఆన్‌లైన్‌లో మూల్యాంకనం నిర్వహించిన విషయం తెలిసిందే.
@@@@@
4)ఆధార్ లేకపోయినా టీకా వేయాలి - భారత విశిష్ఠ ప్రాధికార సంస్థ
ఆధార్ కార్డు లేదన్న సాకుతో కొవిడ్-19 టీకాలు వేయడం నిరాకరించకూడదని భారత విశిష్ఠ ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) స్పష్టం చేసింది. ఆస్పత్రుల్లో చికిత్స, ఔషధాల విషయంలో ఆధార్ కార్డు తప్పనిసరి కాదని పేర్కొంది. ఆధార్ కార్డు లేని రోగులకు కొన్ని ఆస్పత్రులు చికిత్స చేయడం లేదని, టీకాలు వేయడం లేదని వస్తున్న వార్తలపై స్పందించింది. ‘‘ఆధార్ లేదని టీకా, ఔషధాలు, ఆస్పత్రుల్లో చికిత్స నిరాకరించకూడదు’’ అని ఒక ప్రకటనలో పేర్కొంది.
@@@@@
@ Today's Service Info:
@ Today's TRT & TET Material Info :