Thursday, 6 May 2021

Teacher's Diary:06.05.2021

1). 🔊ఆన్‌లైన్‌లో ‘నిష్ఠ’ శిక్షణ

 *_🍥ఉపాధ్యాయులకు గతంలో ప్రత్యక్షంగా నిర్వహించిన ‘నిష్ఠ’ శిక్షణ కార్యక్రమాన్ని ఈసారి ఆన్‌లైన్‌ విధానంలో ఈ నెలలోనే నిర్వహించేందుకు జాతీయ విద్య, పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) సన్నాహాలు చేస్తోంది. నిష్ఠ 2.0 పేరిట నిర్వహించే ఈ శిక్షణను సెకండరీ పాఠశాలల స్థాయి ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు ఇస్తారు. ప్రభుత్వ, స్థానిక సంస్థల, ప్రభుత్వ ఎయిడెడ్‌ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్‌ అసిస్టెంట్లు, భాషా పండితులు, ప్రధానోపాధ్యాయుల వివరాలను నిర్దేశిత నమూనాలో ఈ నెల 10లోగా పంపించాలని ఎస్‌సీఈఆర్‌టీ సంచాలకుడు జిల్లా విద్యాశాఖాధికారులకు తాజాగా పంపిన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

@@@@@

2). 🔊31 వరకు ఓయూకు వేసవి సెలవులు.
🍥ఉస్మానియా యూనివర్సిటీకి ఈ నెల 31 వరకు వేసవి సెలవులు ప్రకటించినట్లు ఆ వర్సిటీ రిజిస్ర్టార్‌ గోపాల్‌రెడ్డి తెలిపారు. ఓయూ క్యాంప్‌సతో పాటు పలు జిల్లాలో ఉన్న వర్సిటీ అనుబంధ కాలేజీలన్నింటికీ సెలవులు వర్తిస్తాయని పేర్కొన్నారు. జూన్‌ 1 నుంచి క్యాంపస్‌, కాలేజీలు పునఃప్రారంభమవుతాయని ఆయన ప్రకటించారు.

💥ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించండి: జేఎన్టీయూ

🌀యూజీ, పీజీ ఆన్‌లైన్‌ తరగతులను వెంటనే ప్రారంభించాలని అనుబంధ కాలేజీలను.. జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఆదేశించింది. బోధనా సిబ్బందిని ఎట్టి పరిస్థితుల్లోనూ కాలేజీకి పిలువొద్దని రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ మన్జూర్‌ హుస్సేన్‌ బుధవారం అన్ని కాలేజీలను కోరారు.

@@@@@

3). 🔊ఇంటినుంచే ఇంజినీరింగ్‌ పరీక్షలు

💠జేఎన్టీయూ అధికారుల యోచన_*

*_🍥కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఇంజినీరింగ్‌ పరీక్షలను ఇంటినుంచే ఆన్‌లైన్‌లో నిర్వహించాలని జేఎన్టీయూ అధికారులు యోచిస్తున్నారు. ముందుగా ప్రయోగాత్మకంగా బీటెక్‌ 8వ సెమిస్టర్‌ విద్యార్థులకు నిర్వహించాలని భావిస్తున్నారు. కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతపడగా, అనేక పరీక్షలు వాయిదాపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ ఎలా అన్న అంశంపై అధికారులు సమాలోచనలు జరపుతున్నారు. గతేడాది విద్యార్థులకు సమీపంలోని కాలేజీల్లో పరీక్షలు రాసుకొనే వెసులుబాటును కల్పించారు. ఇలా పరీక్షా కేంద్రాలను ఎంచుకునే అవకాశమిచ్చి, సెమిస్టర్‌ పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసి ఫలితాలు ప్రకటించారు. ఈసారి కరోనా ఉధృతి తీవ్రంగా ఉండటంతో పరీక్షాకేంద్రాల్లో నిర్వహించడం అంత శ్రేయస్కరంకాదన్న నిర్ణయానికి అధికారులు వచ్చారు. ఇదే క్రమంలో ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణపై దృష్టిసారించారు. బీటెక్‌ చివరి సంవత్సరం, చివరి సెమిస్టర్‌ పరీక్షలు కావడం, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, జూన్‌, జూలై మాసాల్లో పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు. ఈ ప్రతిపాదన తమ పరిశీలనలో ఉన్నదని.. జూన్‌, జూలై మాసాల్లో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని జేఎన్టీయూ రిజిస్ట్రార్‌ మంజూరు హస్సేన్‌ తెలిపారు.

*💥ఇంటి నుంచే బోధన_*

🌀కరోనా నేపథ్యంలో అధ్యాపకులంతా ఇంటి నుంచే పాఠాలు బోధించేందుకు అవకాశం కల్పిస్తూ జేఎన్టీయూ ఉత్తర్వులు జారీచేసింది. యూజీ, పీజీ కోర్సుల్లో అధ్యాపకులంతా ఇంటి నుంచే ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని జేఎన్టీయూ రిజిస్ట్రార్‌ మంజూర్‌ హస్సేన్‌ సర్కులర్‌ జారీచేశారు. అటానమస్‌, గుర్తింపు పొందిన, ఇతర కాలేజీలన్నీ ఉత్తర్వులను పాటిస్తూ షెడ్యూల్‌ ప్రకారం తరగతులను నిర్వహించాలని తెలిపారు. అధ్యాపకులను కాలేజీకి రావాలని ఇబ్బంది పెట్టవద్దని యాజమాన్యాలకు ఆయన సూచించారు.

@@@@@

4). 🔊కేవైసీపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం..డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు.!_*

🍥న్యూఢిల్లీ: దేశీయ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆప్ ఇండియా(ఆర్‌బీఐ) కేవైసీ అప్‏డేట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా మహమ్మరి విజృంభిస్తున్న కారణంగా 2021 డిసెంబర్ 31 వరకు కేవైసీ అప్‏డేట్ చేయడంలో విఫలమైన వినియోగదారులపై ఎటువంటి ఆంక్షలు విధించవద్దని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కోరారు. నేడు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి చాలా తీవ్రంగా ఉందని, గత నెలలో పరిస్థితి తీవ్రంగా మారిందని ఆర్‌బీఐ గవర్నర్ చెప్పారు. వినియోగదారుల ఖాతాలకు సంబంధించిన కార్యకలాపాల కోసం కేవైసీ అప్‏డేట్ తప్పనిసరిగా చేయాలని గతంలో సూచించిన సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకులు కేవైసీ అప్‏డేట్ చేసుకోవాలని కస్టమర్లను ఇటీవల కోరాయి. ఇందుకోసం మే 31 వరకు గడువును విధించాయి. అయితే ఆర్‌బీఐ మాత్రం తాజాగా కేవైసీ అప్ డేట్ గడువును డిసెంబర్ చివరి వరకు పొడగిస్తున్నట్లుగా ప్రకటించింది. అంటే డిసెంబర్ 31 వరకు కేవైసీ అప్ డేట్ చేసుకోకపోయిన కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిరంతరంగా వారు లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.

@@@@@

5). 🔊పదవీ విరమణ తర్వాత ఏడాది వరకూ తాత్కాలిక పింఛను

🌀కొవిడ్‌ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం_*

🍥దిల్లీ: తాత్కాలిక పింఛనుకు సంబంధించిన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సరళీకరించింది. ఉద్యోగులు పదవీ విరమణ పొందిన తేదీ నుంచి ఏడాది వరకూ తాత్కాలిక పింఛను చెల్లించేలా గడువును పొడిగించింది. కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ బుధవారం వెల్లడించారు. అర్హులైన కుటుంబ సభ్యులు కుటుంబ పింఛను క్లెయిము రసీదు, మరణ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించిన వెంటనే పింఛనును మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. సంబంధిత క్లెయిమును చెల్లింపు, పద్దుల కార్యాలయానికి పంపించి ఎదురుచూడాల్సిన అవసరం ఇకపై ఉండబోదన్నారు. జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌) పరిధిలోని ఉద్యోగులు విధి నిర్వహణలో వైకల్యం బారిన పడి, ప్రభుత్వ సర్వీసులో కొనసాగితే.. వారికి కూడా ఏకమొత్తంలో అధిక పరిహారం చెల్లించే ప్రయోజనాన్ని వర్తింపజేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.

@@@@@

6) 🔊హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రవేశ పరీక్ష వాయిదా_*

దేశవ్యాప్తంగా బీఎస్సీ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశానికి జూన్‌ 12వ తేదీన నిర్వహించతలపెట్టిన నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ 2021) పరీక్షను వాయిదా వేస్తున్నట్లు జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) తెలిపింది. పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించింది.

@@@@@