Tuesday, 4 May 2021

Teacher's Diary:04.05.2021


1).*🔊ప్రతి స్టూడెంట్.. పాస్!*

*🍥 ఎఫ్ఎ 1 ఆధారంగా పదోతరగతి విద్యార్థులకు గ్రేడింగ్*

*✍️నేడో, రేపో ప్రభుత్వానికి విద్యాశాఖ లేఖ

🌍కరోనా కారణంగా రద్దయిన పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి పదో తరగతి విద్యార్థులకు గ్రేడింగ్ ఇచ్చేందుకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. ఫార్మేటివ్ అసెస్మెంట్-1 ఆధారంగానే విద్యార్ధులకు గడింగ్ ఇచ్చేలా అధికారులు నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5.47 లక్షల మంది పదో తరగతి విద్యార్ధులు ఉంటే అందులో 5,21,393 మంది పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజు కట్టారు. ఎఫ్ఎ1 ఆధారంగా ప్రతి విద్యార్థిని పాస్ చేయనున్నట్లు తెలిసింది. ఒకవేళ రాష్ట్రంలో కరోనా ఉధృతి లేకుండా ఉన్నట్లయితే ఈనెల మే 17 నుంచి 26 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు జరగాల్సి ఉండేది. కానీ రాష్ట్రంలో ఒక్క సారిగా అనూహ్యంగా కరోనా కేసులు పెరిగి పాఠశాల విద్యార్థులు కరోనా బారిన పడుతుండడంతో పరీక్షలను ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. విద్యార్థులందరికీ అబ్జెక్టివ్ క్రైటీరియా ఆధారంగా ఫలితాలు వెల్లడిస్తామని ప్రభుత్వం తెలిపింది. 
సీబీఎస్ఈ కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. అలాగే సీబీఎస్ఈ బోర్డు ఇంటర్నల్, ఇప్పటి వరకు జరిగిన పరీక్షల మార్కులను పరిగణలోకి తీసుకుని విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఎస్ఎస్సీ బోర్డు సైతం ఫార్మేటివ్ అసెస్మెంట్-1 ఆధారంగానే గ్రేడింగ్ ఇవ్వాలని అధికారులు అనుకుంటున్నారు. ఫలితాలు, గ్రేడింగ్పై ప్రభుత్వానికి విద్యాశాఖ అధికారులు ఓ లేఖ రాయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఏప్రిల్ 26తో పదో తరగతి విద్యార్థుల ఎఫ్ఎ1 మార్కుల వివరాలు సేకరణకు చివరి గడువు ముగిసింది. అయితే మొత్తం 5.22లక్షల మందికిపైగా విద్యార్థుల మార్కులను అధికారులు సేకరించారు.
@@@@@

2). *🔊ఆగస్టు 31 తర్వాతే నీట్‌ పీజీ*

*♦️కరోనా నివారణ సేవల్లో వైద్య విద్యార్థులు*
 
*🎙️ప్రధాని నేతృత్వంలో నిర్ణయం*

🌏 వైద్య విద్యార్థుల ద్వారా కరోనా రోగులకు సేవలు అందించాలని నిర్ణయించిన దృష్ట్యా నీట్‌-పీజీ పరీక్షలు మరో 4 నెలలపాటు వాయిదా పడనున్నాయి. ఆగస్టు 31 వరకు ఆ పరీక్షలు నిర్వహించకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మళ్లీ ఎప్పుడు ఈ పరీక్ష నిర్వహించేది విద్యార్థులకు కనీసం నెలరోజుల ముందు చెప్పనున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఈ నిర్ణయం కారణంగా రోగులకు సేవలందించేందుకు పెద్దసంఖ్యలో డాక్టర్లు అందుబాటులోకి వస్తారని పేర్కొంది. సోమవారం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

* ★ఇంటర్న్‌షిప్‌లో వైద్యశిక్షణార్థులను వారి అధ్యాపకుల పర్యవేక్షణలో కొవిడ్‌ విధుల్లో నియమించనున్నారు.

* ★తుది సంవత్సరం ఎంబీబీఎస్‌ విద్యార్థులను టెలీ కన్సల్టేషన్‌, తేలికపాటి లక్షణాలున్న రోగుల పర్యవేక్షణ, చికిత్స క్రమాన్ని నిర్ధరించడం లాంటి సేవలకోసం ఉపయోగించుకుంటారు.

* ★కొత్త సంవత్సరం పీజీ విద్యార్థులు వచ్చేవరకు  తుది సంవత్సరం పీజీ విద్యార్థుల సేవలను  కొనసాగిస్తారు.

* ★సీనియర్‌ డాక్టర్లు, నర్సుల పర్యవేక్షణలో  బీఎస్సీ/జీఎన్‌ఎం అర్హత ఉన్న నర్సులను ఫుల్‌టైం కొవిడ్‌ నర్సింగ్‌ డ్యూటీల్లో ఉపయోగించుకుంటారు.

*★ కొవిడ్‌ విధుల్లో కనీసం 100 రోజులు పూర్తిచేసిన వారికి ప్రభుత్వ వైద్య   నియామకాల్లో ప్రాధాన్యం. వ్యాక్సిన్‌, కేంద్ర ప్రభుత్వ బీమా వర్తింప జేస్తారు.

*★ కనీసం 100 రోజులపాటు కొవిడ్‌ విధులు నిర్వర్తించిన వారికి కేంద్రం నుంచి ప్రధానమంత్రి కొవిడ్‌ జాతీయ సేవా సమ్మాన్‌ గౌరవాన్ని అందిస్తారు.

* ★నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ద్వారా 2,206 స్పెషలిస్టులు, 4,685 మంది మెడికల్‌ ఆఫీసర్లు, 25,593 మంది స్టాఫ్‌ నర్సులను నియమిస్తారు.

@@@@@

3) *🔊ఈ నెలలో జరగాల్సిన ఆఫ్‌లైన్‌ పరీక్షలన్నీ వాయిదా*

🌀దేశవ్యాప్తంగా కేంద్ర విద్యాసంస్థల్లో  మేలో నిర్వహించాల్సిన అన్ని రకాల ఆఫ్‌లైన్‌ పరీక్షలను వాయిదా వేయాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి అమిత్‌ఖరే దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీలు సహా అన్ని కేంద్ర విద్యాసంస్థల అధిపతులకు సోమవారం లేఖ రాశారు. ఆన్‌లైన్‌ పరీక్షలను కొనసాగించవచ్చని సూచించారు.

@@@@@

4). *🔊నేడే ‘షహదత్‌ హజ్రత్‌ అలీ’ ఐచ్ఛిక సెలవు*
🍥ఈ నెల 3వ తేదీకి బదులు ఈ నెల 4న ‘షహదత్‌ హజ్రత్‌ అలీ’ ఐచ్ఛిక (ఆప్షనల్‌) సెలవు ఉంటుందని ప్రభు త్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

@@@@@

5). *🔊కోహెల్ప్‌ యాప్‌తో కొవిడ్‌ పూర్తి సమాచారం*

🌏కొవిడ్‌పై ప్రజలకు కావాల్సిన పూర్తి సమాచారం అందించేలా సాగర్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్‌ సంస్థ కోహెల్ప్‌ యాప్‌, ‌www.cohelp.info వెబ్‌సైట్‌ను రూపొందించింది. వీటిని సోమవారం అరణ్యభవన్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జీవ వైవిధ్యమండలి సభ్య కార్యదర్శి కాళీ చరణ్‌ ఆవిష్కరించారు. సాగర్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్‌ సంస్థ సీఈవో జోగి రితేష్‌ వెంకట్‌ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఉచితంగా ఈ యాప్‌ ద్వారా అందించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం రెండు రాష్ట్రాల్లోని దాదాపు 4 వేలకుపైగా ఆసుపత్రులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు.

@@@@@

6). *🔊వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్..*

 వాట్సాప్‌ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు టెక్ట్స్ మెసేజ్‌లను మాత్ర‌మే స‌రిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని పంపేవాళ్లం. కానీ ఈ సౌల‌భ్యం వాయిస్ మెసేజ్‌లకు లేదు. ఒక‌సారి రికార్డు చేసిన తర్వాత.. పంప‌డ‌మో, లేక డిలీట్ చేయ‌డ‌మో మాత్రమే చేయాల్సి ఉంటుంది. రికార్డు చేసింది.. క‌రెక్ట్ గా ఉందో లేదో సెండ్ చేయ‌క ముందు వినే అవ‌కాశం లేదు. పంపిన త‌ర్వాతే వినాలి. కానీ ఇప్పుడు వాయిస్ మెసేజ్ ల‌ను సెండ్ చేయ‌క‌ముందే అది క‌రెక్టుగా ఉందో లేదో వినే ఫీచ‌ర్ ను వాట్సాప్ తీసుకురానుంది. అంతేకాకుండా వాయిస్‌ మెసేజ్‌లను యూజర్లు ఎంపిక చేసుకున్న స్పీడ్‌ల‌లో వినే అవ‌కాశం ఉంటుంది. రానున్న‌ రోజుల్లో వాయిస్‌ మెసేజ్‌లను సెండ్ చేసేప్పుడు 'రివ్యూ' బటన్ తో వినేలా వాట్సాప్ ఓ ఫీచ‌ర్ తెస్తోంది. ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ ఫోన్లలో వాట్సాప్‌ తీసుకురానుంది.

@@@@@

7) . *🔊టీకాలు వచ్చేశాయ్‌..*

*♦️రాష్ట్రానికి చేరిన 4 లక్షల డోసులు*

*🍥నేడు మరో 50 వేల కొవాగ్జిన్‌ వ్యాక్సిన్లు*

*💫నేటి నుంచి యథావిధిగా పంపిణీ*
🌏నలభై అయిదేళ్లకు పైబడిన వారికి ఉచిత టీకాల పంపిణీలో భాగంగా మరో 4 లక్షల కొవిషీల్డ్‌ టీకా డోసులు సోమవారం రాష్ట్రానికి చేరుకున్నాయి. 50 వేల కొవాగ్జిన్‌ డోసులు మంగళవారం రానున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో టీకాల కొరత కారణంగా వారం రోజులుగా పంపిణీ మందకొడిగా సాగుతోంది. గత శని, ఆదివారాలైతే ప్రభుత్వ వైద్యంలో పంపిణీని పూర్తిగా నిలిపివేశారు. సోమవారం 200 కేంద్రాల్లో మాత్రమే వ్యాక్సినేషన్‌ జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి సకాలంలో వ్యాక్సిన్‌ అందకపోవడంతో రెండోడోసు పొందాల్సిన వారు కూడా వారాల తరబడి వేచి చూడాల్సి వస్తోందని వైద్యవర్గాలే చెబుతున్నాయి. తాజాగా 4 లక్షల డోసులు చేరడంతో.. వాటిని సోమవారం రాత్రికే అన్ని జిల్లాలకూ ప్రత్యేక వాహనాల ద్వారా తరలించే ఏర్పాట్లు చేశారు. మంగళవారం నుంచి అన్ని ప్రభుత్వ పంపిణీ కేంద్రాల్లో టీకాలను ఇవ్వనున్నారు.

🌻రెండో డోసు ఎప్పుడంటే..
‘‘టీకా రెండోడోసు ఎప్పుడుతీసుకోవాలనే దానిపై చాలామందికి సందేహాలున్నాయి. కొవిషీల్డ్‌ తొలి డోసు తీసుకున్న తర్వాత 6-8 వారాల మధ్య ఎప్పుడైనా రెండో డోసు తీసుకోవచ్చు. కొవాగ్జిన్‌ టీకా తొలి డోసు తీసుకున్న తర్వాత 4-6 వారాల మధ్య రెండో డోసు స్వీకరించవచ్చు. ఒకట్రెండు రోజులు అటూఇటూ అయినా ఇబ్బంది లేదు. రెండో డోసు తప్పనిసరిగా తీసుకుంటేనే యాంటీబాడీలు వృద్ధి చెంది కొవిడ్‌ నుంచి పూర్తి రక్షణ లభిస్తుంది’’ అని డాక్టర్‌ శ్రీనివాసరావు వివరించారు.
@ నమోదుకు నానా తిప్పలు...
ముందుగా నమోదు చేసుకున్నవారికి మాత్రమే వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు వైద్యవర్గాలు చెబుతున్నారు. అయితే కొవిన్‌ యాప్‌లో నమోదుకు అనేక సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. సాంకేతికంగా బాగా తెలిసిన వారికి కూడా ఈ యాప్‌ ద్వారా తేదీ, కేంద్రాన్ని ఎంపిక చేసుకోవడం కష్టతరంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో సాంకేతికంగా అంతగా పరిజ్ఞానం లేనివారి పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా ఇంటర్నెట్‌ సౌకర్యం అంతగా లేనిచోట్ల నమోదు కుదరడంలేదు. ఇది టీకా పంపిణీకి అవరోధంగా మారే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకూ ఇచ్చినట్లే వచ్చిన వారికి వచ్చినట్లుగా టీకాలు వేస్తేనే ఈ ప్రక్రియ సజావుగా సాగుతుందని, లేదంటే కేంద్రాల వద్ద గందరగోళ పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

🍥18 ఏళ్ల పైబడినవారికి ఎప్పుడు?

💫18 ఏళ్ల పైబడిన వారికి టీకాల విషయంలో ఇంకా స్పష్టత రాలేదని, త్వరలో ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం దీనిపై కార్యాచరణ సిద్ధమవుతుందని వైద్యవర్గాలు తెలిపాయి. వీరందరికీ ఉచితంగా టీకాలు అందించడంలో భాగంగా లక్ష కొవాగ్జిన్‌ డోసులను, 2 లక్షల కొవిషీల్డ్‌ డోసులను సరఫరా చేయాల్సిందిగా ఆయా ఉత్పత్తి సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు తెలిసింది. అవి రావడానికి మరికొంత సమయం పడుతుందని, అప్పటి వరకూ 18 ఏళ్ల పైబడిన వారికి టీకాల అందజేత ఉండదని వైద్యవర్గాలు పేర్కొన్నాయి.

✍️ముందుగా నమోదు చేసుకుంటేనే..

★కొవిన్‌ అధికారిక పోర్టల్‌లో ముందుగా నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఇక నుంచి పంపిణీ కేంద్రాల్లో టీకాలను ఇస్తామని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు స్పష్టంచేశారు. 45 ఏళ్ల పైబడిన వారందరూ కొవిన్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. సొంతంగా నమోదు చేసుకోలేనివారు సమీపంలోని ఇంటర్నెట్‌ కేంద్రాల్లో తమకు అనువైన పంపిణీ కేంద్రాన్ని, తేదీని ఎంపిక చేసుకోవాలని తెలిపారు. నేరుగా పంపిణీ కేంద్రాలకు వచ్చేవారికి టీకా ఇవ్వడం కుదరదన్నారు.

@@@@@

8). *💠📞పిల్లల రక్షణకు ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌*

*⏺️కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి నేపథ్యంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేసినట్లు జిల్లా సంక్షేమ అధికారి నర్సింహారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా బారిన పడిన పిల్లలకు, వైరస్‌ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అవసరమైన సహాయం అందిస్తామన్నారు. హెల్ప్‌ డెస్క్‌ ఫోన్‌ నెంబర్లు 040-23733665, 1098లలో సంప్రదించాలని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.