1)🔊‘సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలపై నిర్ణయం తీసుకోలేదు'
🌍సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల నిర్వహ ణకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బోర్డు తెలిపింది. కొందరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ మేరకు స్పష్టత నిచ్చింది. పరీక్షలపై ఎటువంటి నిర్ణయం తీసు కున్నా అధికారికంగా ప్రకటిస్తామని బోర్డు సీనియర్ అధికారి తెలిపారు. జూన్ 1 తరువాత పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. పరీక్షల తేదీని కనీసం 15 రోజుల ముందుగా విద్యార్థులకు తెలియజేస్తా మని వివరించారు. కొవిడ్ రెండో ఉద్ధృతి దృష్ట్యా 10వ తరగతి పరీక్షలను సీబీఎస్ఈ రద్దు చేసింది. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది.*
@@@@@
2).*🔊ప్రైవేట్ టీచర్లకు ఆర్థికసాయం 48 కోట్లు విడుదల*
*🌍రాష్ట్రంలోని ప్రైవేట్ టీచర్లకు ఆర్థికసాయం అందిచేందుకు రూ.48 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా కాలంలో ప్రైవేట్ టీచర్లను ఆదుకునేందుకు నెలకు ఒక్కొక్కరికి రూ.2 వేల ఆర్థిక సాయంతో పాటు 25 కిలోల బియ్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పాఠశాలలు తెరిచే వరకు సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలకుగాను ప్రైవేట్ టీచర్ల బ్యాంక్ ఖాతాల్లో నగదును జమచేసింది. మే నెల ఆర్థిక సాయానికి రూ.40 కోట్లను, మిగతా రూ.8 కోట్లు ఏప్రిల్ నెల బకాయిలను తాజాగా విడుదల చేసింది. ప్రైవేట్ టీచర్లకు ఆర్థికసాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశాలు జారీ చేశారు.*
@@@@@
3).*🔊ముందుకొచ్చిన జేఎన్‌టీయూ ‘చివరి’ పరీక్షలు*
*🍥14 నుంచి బీటెక్ నాలుగో ఏడాది చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణ*
*🌀బీటెక్ చివరి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు ఆలస్యమైతే పలు సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని భావిస్తున్న జేఎన్‌టీయూహెచ్ వాటిని సకాలంలో పూర్తి చేయాలని నిర్ణయించింది. పరీక్షల నిర్వహణను జూన్ రెండో వారంలోనే ప్రారంభించాలని ఇటీవల కాలపట్టికను ఖరారు చేశారు. ఫలితాలను జులై 15 నాటికి వెల్లడించి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంజినీరింగ్ పట్టా ఇచ్చి పంపాలని భావిస్తున్నారు.*
*🌀రెండు నెలలు ముందుగానే...*
*💫బీటెక్ చివరి ఏడాది రెండో సెమిస్టర్ పరీక్షలను ఆగస్టు నెలాఖరులో ప్రారంభించి సెప్టెంబరులో పూర్తి చేయాలని కొద్ది నెలల క్రితం ప్రాథమిక కాలపట్టికను ఖరారు చేశారు. గతనెల 26వ తేదీ నుంచి చివరి సెమిస్టర్ ఆన్‌లైన్ పాఠాలను ప్రారంభించారు. ముందుగా రోజుకు 3 గంటలు పాటు బోధించాలన్నది ప్రణాళిక. వైరస్ తీవ్రత తగ్గే వరకు పరీక్షలు జరపకుండా ఆగడం వల్ల పలు సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని, ఆగస్టు/సెప్టెంబరులో వైరస్ తీవ్రత తగ్గకుండా ఉంటే ఎంటెక్/ఎంఫార్మసీలో ప్రవేశాలతోపాటు విదేశీ చదువుకు వెళ్లేందుకు ఇబ్బంది అవుతుంది. అమెరికాలో మంచి వర్సిటీల్లో సీట్లు ఖరారైన పలువురు విద్యార్థులు పరీక్షలు ఆలస్యం చేస్తే తమకు జరిగే నష్టంపై ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఎగ్జామ్ ఫ్రం హోం(ఇంటి నుంచి పరీక్షలు)కు శ్రీకారం చుట్టాలని వర్సిటీ ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రోజుకు 3 గంటల ఆన్‌లైన్ పాఠాలను ఆరు గంటలపాటు బోధించేందుకు కళాశాలలకు అనుమతి ఇచ్చారు. ఫలితంగా జూన్ 14 నుంచి 19వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ముందస్తు పరీక్షల వల్ల సప్లిమెంటరీ విద్యార్థులతో కలిపి దాదాపు 45 వేల నుంచి 50 వేల మంది విద్యార్థులకు ఇబ్బంది తప్పుతుంది.*
@@@@@
4)*🔊ఎన్‌టీఎస్‌ఈ రెండో స్థాయి పరీక్ష వాయిదా*
*:జాతీయ స్థాయిలో జూన్ 13వ తేదీన నిర్వహించతలపెట్టిన జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష(ఎన్‌టీఎస్‌ఈ) రెండో స్థాయిని కరోనా ఉద్ధృతి కారణంగా వాయిదా వేయాలని ఎన్‌సీఈఆర్‌టీ నిర్ణయించింది. పదో తరగతి విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసం ఈ పరీక్ష రాస్తారు. రాష్ట్ర స్థాయి పరీక్షలో ప్రతిభ చూపిన వారు జాతీయ స్థాయిలో జరిగే రెండో స్థాయి పరీక్షకు అర్హులు. పరీక్ష నిర్వహించే తేదీని తర్వాత తెలియజేస్తామని ఎన్‌సీఈఆర్‌టీ పేర్కొంది.*
@@@@@
5).*🔊వీడియో పాఠం నిడివి పది నిమిషాలే!*
*📱దీక్ష యాప్‌లో సంస్కరణలు*
*🍥ఉపాధ్యాయులు చెప్పేవాటితో పాటు పుస్తకాలలోని క్యూఆర్ కోడ్ సహాయంతో ఆయా పాఠ్యాంశాలపై మరింత వివరణ ఇచ్చేందుకు ఉద్దేశించిన దీక్ష యాప్‌లో సంస్కరణలకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. పుస్తకంలో ముద్రించిన కోడ్‌ను స్కాన్ చేస్తే యూట్యూబ్ ద్వారా ఎక్కువ సమాచారం అందుబాటులో ఉండేది. కరోనా కన్నా ముందు నుంచే ఈ విధానాన్ని ప్రారంభించిన విద్యాశాఖ, కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో పరిస్థితులు చక్కబడే వరకు పది నిమిషాల కన్నా తక్కువ వ్యవధి ఉండే పాఠ్యాంశాలను రూపొందిస్తోంది. సెల్‌ఫోనులో డాటా పెద్దఎత్తున వినియోగం కాకుండా విద్యార్థికి అవసరమైన సమాచారాన్ని సూటిగా క్లుప్తంగా అందించాలని నిర్ణయించింది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే పాఠ్యాంశం తాలూకు సమాచారం 7-10 నిమిషాలలోపు అందించేలా రూపొందిస్తోంది. మరీ పెద్ద పాఠ్యాంశమైతే రెండు భాగాలు చేయనుంది.*
@@@@@
@ Today's Service Info :
@ Today's TRT & TET Material Info :