Sunday, 9 May 2021

Teacher's Diary: 09.05.2021

1).*🔊టీఎస్ పీఈసెట్ ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగింపు*

 తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ పీఈసెట్) 2021 కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించే చివరి తేదీని ఆలస్య రుసుము లేకుండా మే 15వ తేదీ వ‌ర‌కు పొడిగించారు. కొవిడ్-19 సెకండ్ వేవ్ నేప‌థ్యంలో రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి ఈ నిర్ణ‌యం తీసుకుంది. అంత‌కుక్రితం ఆల‌స్య‌రుసం లేకుండా ద‌ర‌ఖాస్తు గ‌డువు మే 8వ తేదీగా ఉండే. దరఖాస్తులను https://pecet.tsche.ac.in/ వెబ్‌సైట్ ద్వారా సమర్పించవచ్చు.*

*🌀రిజిస్ట్రేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీలకు రూ .400, ఇతరులకు రూ .800గా ఉంది. ఇంతకుముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం భౌతిక సామర్థ్య పరీక్షలు జూన్ 7 నుండి ప్రారంభమవుతాయి. పరీక్ష కోసం నమోదు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య ఆధారంగా అవి ముగియ‌నున్నాయి. ఫిజిక‌ల్ ప‌రీక్ష‌లు ముగిసిన వారం తర్వాత ఫలితాలు ప్రకటించబడతాయి.

@@@@@

2). *🔊🔊6 నుంచి 10 వరకు క్యూఆర్ కోడ్ పుస్తకాలు*

*❇️చాప్టర్కు రెండు క్యూఆర్ కోడ్లు*

*📜అందుబాటులోకి ప్రాక్టీస్ పేపర్లు*
 *📚రానున్న విద్యా సంవ త్సరంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ క్యూఆర్ కోడ్ పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఒక్కో అధ్యాయానికి 2క్యూఆర్ కోడ్లను ముద్రించనున్నారు. ఇందులో ఒకటి టీచర్లు అభివృద్ధి చేసిన ఈ కంటెంట్కు సంబం ధించినది కాగా, మరొకటి ప్రశ్నల ప్రాక్టీసు ఉద్దేశించినది. పాఠ్య పుస్తకాల్లోని ప్రతి అధ్యాయంలో ముద్రించే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే.. ఆయా పాఠ్యాంశాలపై అదనపు సమాచారం, లోతైన విశ్లేష ణలు, చిత్రాలు, వీడియోలను వీక్షించే అవకాశం లభిస్తుంది.

@@@@@

3). *🔊💰వేతనాలు లేక.. వెత!*

  *💠కరోనా బారిన డీటీలు పోస్టింగులకు నోచుకోని ఆబ్కారీ ఎస్సైలు*
* అసలే దూర ప్రాంతాల్లో పోస్టింగులు.. కరోనా వైరస్‌తో అవస్థలు. వీటికితోడు వేతనాలు అందకపోవడంతో ఆ ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పేరుకు ప్రభుత్వ ఉద్యోగమైనా.. కుటుంబాలను పోషించలేక దుర్భర జీవితం గడుపుతున్నామని వాపోతున్నారు. 2016లో గ్రూప్‌-2లో ఎంపికైన 257 మంది డిప్యూటీ తహసీల్దార్ల(డీటీల)కు ప్రభుత్వం గత నెలలో పోస్టింగులు ఇచ్చింది. అదీ సుదూర ప్రాంతాల్లో. వీరికి శిక్షణ సమయానికి సంబంధించి రెండు నెలలు, ఉద్యోగంలో చేరిన తరువాత ఒక నెలకు సంబంధించి.. మొత్తం మూడు నెలల వేతనం అందాల్సి ఉంది. వారిలో 60 మంది డీటీలకు కరోనా సోకింది. యాదాద్రి జిల్లాకు చెందిన ఓ డీటీకి కరోనా రావడంతో ఆరోగ్య పరిస్థితి విషమించింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతనికి తలా కొంత డబ్బు సేకరించి ఆర్థికసాయం చేశారు. మరికొందరు డీటీలు, వారి కుటుంబ సభ్యులు కూడా వైరస్‌ బారిన పడ్డారు. వేతనాలు రాకపోవడంతో చికిత్సకు, మందుల కొనుగోళ్లకు పడరాని పాట్లు పడుతున్నారు.*  

*🌀 రాష్ట్రంలోని 280 మంది ఆబ్కారీ ఎస్సైలు పోస్టింగుల కోసం ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వీరికి ప్రభుత్వం గతేడాది నియామక ఉత్తర్వులు అందజేసింది. అనంతరం పోస్టింగులను విస్మరించింది. ఎక్సైజ్‌ అకాడమీకి అటాచ్‌ అయిన మరో 87 మంది ఎస్సైలకు గత మూడు నెలలుగా వేతనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు వేతనాలు అందించాలని డీటీలు, ఆబ్కారీ ఎస్సైలు కోరుతున్నారు.

@@@@@

@.   Today's Service Info:


@     Daily Dsc/ TRT & TET Material :

        # Maths Methodology