Saturday, 8 May 2021

Teacher's Diary : 08.05.2021

 

1}.Immunity: రోగనిరోధక శక్తికి ఇదీ డైట్‌!

🍥దిల్లీ: కరోనా సెకండ్‌ వేవ్‌ మనపై ఉప్పెనలా విరుచుకుపడుతోంది. కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నా వాయువేగంతో వ్యాపిస్తూ మృత్యుఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ ముప్పు నుంచి బయటపడేందుకు డబుల్‌ మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడంతో పాటు రోగ నిరోధకశక్తి పెంచుకోవాలంటూ నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సహజ సిద్ధమైన ఆహార నియమాలతో శరీరానికి అధిక పోషకాలు అందించడం ద్వారా రోగ నిరోధకశక్తిని పెంచుకోవచ్చని కేంద్రం సూచిస్తోంది. MyGovIndia ట్విటర్‌ ఖాతాలో ఇమ్యూనిటీని పెంచేందుకు దోహదపడే డైట్‌ను సూచించింది. మీరు తీసుకొనే ఆహారంలో ఈ కింది పదార్థాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను ఎదుర్కోవడంతో పాటు ఇమ్యూనిటీని పెంచుకుని కోలుకోవచ్చని చెబుతోంది.

💥కొవిడ్ వేళ.. ఇమ్యూనిటీని పెంచే డైట్‌ ఇదే..

* 👉రాగులు, ఓట్లు‌, అమరంత్‌ వంటి తృణధాన్యాలను తీసుకోవాలి.*

* 👉ప్రొటీన్లు పుష్కలంగా లభించే కోడిమాంసం, చేపలు, గుడ్లు, పన్నీర్‌, సోయా, కాయధాన్యాలు, గింజలు తీసుకోవాలి.*

* 👉ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు కలిగిన వాల్‌నట్స్‌‌, బాదం, ఆలివ్‌ నూనె, ఆవ నూనె*

* 👉శరీరానికి తగిన విటమిన్లు, ఖనిజాలను అందించేలా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.*

👉 కరోనాతో నెలకొన్న ఆందోళనను తగ్గించేందుకు 70% కోకో మిశ్రమంతో ఉన్న డార్క్‌ చాక్లెట్‌ తక్కువ మోతాదులో తీసుకోవాలి.
 
* 👉పసుపు కలిపిన పాలు రోజుకోసారి తాగాలి.*

👉 రోజులో అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా సాఫ్ట్‌ ఫుడ్‌ తీసుకోవాలి. మీరు తీసుకొనే ఆహారంలో మ్యాంగోపౌడర్‌ కలిపి తింటే మంచిది.  

🌀రోజూ శరీరానికి తగిన వ్యాయామం చేయడంతో పాటు శ్వాస సంబంధమైన టిప్స్‌ పాటిస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు.

@@@@@

2}. వేగంగా క్లెయిం పరిష్కారం

🌀వెసులుబాట్లు కల్పించిన ఎల్‌ఐసీ

 బీమా క్లెయింలను వేగంగా పరిష్కరించేందుకు భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) ప్రత్యేక మినహాయింపులు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. పాలసీదారుల క్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. పాలసీదారులు కొవిడ్‌-19తో ఆసుపత్రిలో మరణించినప్పుడు.. మున్సిపల్‌ మరణ ధ్రువీకరణ స్థానంలో ప్రభుత్వ, ఈఎస్‌ఐ, ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌, కార్పొరేట్‌ ఆసుపత్రులు జారీ చేసిన మరణ ధ్రువీకరణ, డిశ్ఛార్జి సమ్మరీ, డెత్‌ సమ్మరీలో తేదీ, సమయంతో పాటు ఉన్న పత్రాలపై ఎల్‌ఐసీ క్లాస్‌ 1 ఆఫీసర్‌ సంతకం చేయించి, క్లెయిం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతోపాటు దహనం/ఖననం జరిగిన చోట నుంచి ఇచ్చిన ధ్రువీకరణా చెల్లుతుంది. ఇతర మరణాలకు సంబంధించి మున్సిపల్‌ డెత్‌ సర్టిఫికెట్‌ గతంలాగానే అవసరం ఉంటుంది.పెట్టుబడి వెనక్కిచ్చే యాన్యుటీ పథకాలను ఎంచుకున్న వారికి అక్టోబరు 31 వరకు లైఫ్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు. మిగతావారు ఇ-మెయిల్‌లో పంపాలి. వీడియోకాల్‌ ద్వారానూ ఈ ధ్రువీకరణను తీసుకునే ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. వ్యవధి తీరిన పాలసీల క్లెయింల కోసం సమీపంలోని ఎల్‌ఐసీ శాఖకు వెళ్లి అవసరమైన పత్రాలు సమర్పిస్తే సరిపోతుందని వెల్లడించింది. ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ నెఫ్ట్‌కు సంబంధించిన వివరాలను తెలియజేసే వీలునూ కల్పించినట్లు ప్రకటించింది.

@@@@@

3} స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ పరీక్షలు వాయిదా

🍥కొవిడ్‌ రెండో దశ తీవ్రత నేపథ్యంలో ఈ నెలలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తునట్టు స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌(ఎస్సెస్సీ) తెలిపింది. ఈ నెలాఖరులో, జూన్‌ మొదటి వారంలో జరగాల్సిన కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవెల్‌, గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. అలాగే ఈ నెల మొదటి వారంలో రావాల్సిన జనరల్‌ డ్యూటీ కానిస్టేబుల్‌ నోటిఫికేషన్‌ను తర్వాత విడుదల చేయనున్నట్టు తెలిపింది.

@@@@@

4}. "కళ్లద్దాలు  పెట్టుకునే  వారు  జాగ్రత్త" ! 

కరోనా నుంచి  గట్టెక్కేందుకు  బయటకు  వెళ్ళినప్పుడు  ముఖానికి   మాస్క్  పెట్టుకోవాలని,  చేతులను  శానిటైజ్  చేసుకోవాలని  వైద్య నిపుణులు  చెబుతున్నారు.  తాజాగా  కళ్లద్దాలపై  వైరస్ 9 రోజుల వరకు  ఉండే  అవకాశం  ఉందని  హైదరాబాద్ L.V ప్రసాద్  కంటి  ఆసుపత్రి  వైద్యులు  తెలిపారు.  బయటకు వెళ్లి వచ్చినప్పుడు  వాటిని  శుభ్రం చేసుకోవాలని  సూచించారు.  అయితే  కళ్లద్దాలను  ఆల్కహాల్  శానిటైజర్లతో  కాకుండా..  హైడ్రోజన్  పెరాక్సై తో  క్లీన్  చేయాలన్నారు.
@@@@@

5}.ఉస్మానియా యూనివర్సిటీ -  టీఎస్ పీజీఈసెట్ గడువు పెంపు

💫ఈ నెల 15 వరకుదరఖాస్తులకు చివరి గడువు

♻️టీఎస్ పీజీఈసెట్-2021 దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 15 వరకు ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)పొడిగించింది. అంతకుముందు ఈనెల 7తో గడువు ముగియగా కరోనా ఉధృతి, అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ గడువును పొడిగించినట్లు టీఎస్ పీజీఈసెట్ కన్వీనర్ ప్రొ. లక్ష్మీనారాయణ శుక్ర వారం మీడియాకు తెలిపారు. మిగతా వివరాలకు ఓయూ వెబ్సైట్ చూడవచ్చని పేర్కొన్నారు.
@@@@@

# Today's Service Info :


# Daily DSC+TET Material :

    @    NCERT Psychology