Friday, 7 May 2021

Teacher's Diary: 07.05.2021



*1). 🔊విద్యాశాఖలో ఇక 'ఈ-ఆఫీస్'*

*💫10వ తేదీ నుంచి అమలు*

*📜విద్యాశాఖ ఇన్ఛార్జి కార్యదర్శి సుల్తానియా ఆదేశాలు*
 *🌀విద్యాశాఖలో ఈ-ఆఫీస్ విధానం అమలులోకి రానుంది. ఈ మేరకు ఈ నెల 10వ తేదీ నుంచి అన్ని దస్త్రాలను ఈ-ఆఫీస్ విధానంలోనే పంపించాలని విద్యాశాఖ ఇన్ఛార్జి కార్యదర్శి సందీపుమార్ సుల్తానియా గురువారం ఆదేశాలు జారీ చేశారు. 
 దీంతో ఇకపై ఉన్నతాధికా రులు ప్రత్యేకంగా అడిగితే తప్ప కాగితపు దస్తా లను అనుమతించరు. ఇప్పటికే అధికారులకు డిజి టల్ సంతకాలను జారీ చేయడంతోపాటు శిక్షణ ఇచ్చినందున 10వ తేదీ నుంచి ఈ-ఆఫీస్ విధా నాన్ని కచ్చితంగా అమలుచేయాలని విద్యాశాఖ అదనపు, సంయుక్త, ఉప, సహాయ కార్యదర్శులు, సెక్షన్ అధికారులను సందీపక్కుమార్ సుల్తానియా ఆదేశించారు. ప్రస్తుతం ఉన్నత, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్, ఇంటర్ విద్యాశాఖ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ విధానం అమలవుతుండగా.. తాజా ఆదే శాలతో పాఠశాల విద్యాశాఖలోనూ అమలు కానుంది.

@@@@@

2).🔊1998 డీఎస్సీ మెరిట్‌, పోస్టింగ్‌ లిస్టులను ఇవ్వండి_*
🌀రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం_*

🍥1998 డీఎస్సీకి సంబంధించి అప్పటి మెరిట్‌, పోస్టుల భర్తీ లిస్టులను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సింగిల్‌ జడ్జి విధించిన జైలు శిక్ష, జరిమానాలను రద్దు చేయాలని కోరుతూ నాలుగు జిల్లాల డీఈఓలు వేసిన అప్పీల్‌ పిటిషన్లపై విచారణను జూన్‌ 24కి హైకోర్టు వాయిదా వేసింది. '1998 డీఎస్సీ మెరిట్‌ అభ్యర్థులకు పోస్టింగ్స్‌ లభించాయి. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టుల పదవిలో భర్తీ చేశాం. నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో పోస్టింగ్‌లు ఇచ్చాం' అని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది. ఈ విషయాన్ని రికార్డుల్లో నమోదు చేసిన హైకోర్టు అప్పటి మెరిట్‌ లిస్ట్‌, పోస్టుల్లో భర్తీ చేసిన వారి లిస్ట్‌లను సమర్పించాలని ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లీ, జస్టిస్‌ బి.విజరుసేన్‌రెడ్డిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది. 
పోస్టుల భర్తీ పూర్తి చేసినందున సింగిల్‌ జడ్జి నలుగురు డిఇఓలకు విధించిన రెండు నెలల జైలు శిక్షను రద్దు చేయాలని ప్రభుత్వం కోరింది. ఇప్పటికే రూ. 2వేలు జరిమానా చెల్లించినట్టు కూడా చెప్పింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఉమ్మడి ఏపీ సర్కార్‌ 1998లో నోటిఫికేషన్‌ ఇచ్చింది. పరీక్షల తర్వాత ప్రభుత్వం అన్ని కేటగిరీ అభ్యర్థులకు ఐదు చొప్పున కట్‌ ఆఫ్‌ మార్కులు తగ్గించింది. ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరడంతో తొలుత స్టే ఇచ్చింది. తర్వాత పాలనా సౌలభ్యం కోసం అన్ని కేటగిరీలకు సమానంగా కట్‌ఆఫ్‌ మార్కులు ఉన్నందున తప్పులేదని ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమోదించింది. దీంతో మెరిట్‌ లిస్ట్‌ ప్రకారం భర్తీ చేయాలని తిరిగి అభ్యర్థులు ట్రిబ్యునల్‌లో కేసు వేసి గెలిచారు. అయితే ప్రభుత్వం ట్రిబ్యునల్‌ తీర్పును అమలు చేయకపోవడంతో హైకోర్టులో అప్పీల్‌ చేశారు. కోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయలేదని హైకోర్టు సింగిల్‌ జడ్జి విధించిన జైలు శిక్ష, జరిమానాలను రద్దు చేయాలని నాలుగు జిల్లాల డీఈఓల అప్పీల్‌ పిటిషన్లపై విచారణ జూన్‌ 24కి వాయిదా పడింది.

@@@@@

3).*🔊డిజెబిలిటీ సర్టిఫికెట్లు ఇక నుంచి ఆన్లైన్లోనే*

న్యూఢిల్లీ: *🌍 దివ్యాంగులకు కేంద్రప్రభుత్వం ఊరట కల్పించింది. దివ్యాంగుల ధ్రువీకరణ పత్రాలను (డిజెబిలిటీ సర్టిఫికెట్లు) ఇక నుంచి తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారానే జారీచేయాలని నిర్ణ యించింది. ఈ మేరకు కేంద్రం సామాజిక న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు యూడీఐడీ పోర్టల్ ద్వారా దివ్యాంగులకు ధ్రువీక రణ పత్రాలు జారీచేయాలని అందులో పేర్కొన్నది. ఈ నిర్ణయం జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది.*

@@@@@

4). *_🔊ఎల్‌ఐసీలో వారానికి 5 రోజుల పని_*

🍥జీవితబీమా రంగంలోని ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసీ వారానికి 5 పనిదినాల్లోకి మారుతోంది. ఈ నెల 10వ తేదీ నుంచి ఇది అమలులోకి వస్తుంది. ఎల్‌ఐసీకి ప్రతి శనివారం సెలవు దినంగా ప్రకటిస్తూ ఏప్రిల్‌ 15న ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఈ మార్పు చేసినట్టు తెలిపింది. ఇక ఎల్‌ఐసీ కార్యాలయాలన్నీ సోమవారం నుంచి శుక్రవారం మధ్యలో 5 రోజులూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 వరకు పని చేస్తాయి.

@@@@@

5).*🔊ఆదర్శ పాఠశాలల ప్రవేశ దరఖాస్తు గడువు పొడిగింపు
*🌀ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశ దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెల 20 వరకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

💫ఆరో తరగతిలో ప్రవేశాలకు, 7వ తరగతి నుంచి 10 వరకు ఖాళీగా ఉన్న సీట్లకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
🌍ఆసక్తి గల విదార్థులు https://telanganams.cgg.gov.in వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలతో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.*

*📚దరఖాస్తులు చేసుకున్న వారికి జూన్‌ 5, 6న ప్రవేశ పరీక్ష ఉంటుంది. మెరిట్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

@@@@@

6) *🔊సెప్టెంబర్‌ 1 నుంచి బీటెక్‌ క్లాసులు*

*♻️అదే నెల 15 నుంచి ఫస్టియర్‌ వారికి*

*📚2021-22 విద్యాక్యాలెండర్‌ విడుదల

`🌍వచ్చే విద్యాసంవత్సరంలో సెప్టెంబర్‌ ఒకటి నుంచి బీటెక్‌ క్లాసులు ప్రారంభించనున్నట్టు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) వెల్లడించింది. ఆగస్టు 31లోపు తొలివిడత సీట్ల భర్తీని పూర్తిచేసి, సెప్టెంబర్‌ ఒకటి నుంచి తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. ఇక బీటెక్‌ ఫస్టియర్‌లో మొదటి, రెండోవిడత ప్రవేశాలు పూర్తయిన తర్వాత సెప్టెంబర్‌ 15 నుంచి క్లాసులను ప్రారంభించాలని సూచించింది. ఈ మేరకు 2021-22 విద్యాసంవత్సర క్యాలెండర్‌ను ఏఐసీటీఈ విడుదలచేసింది. కాలేజీల గుర్తింపు, సీట్ల భర్తీ, తరగతుల నిర్వహణకు షెడ్యూల్‌ను ప్రకటించింది.

🌍జూలై ఒకటి నుంచి పీజీడీఎం, పీజీసీఎం తరగతులు
పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎం), పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ సర్టిఫికెట్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీసీఎం), ఆన్‌లైన్‌, ఓడీఎల్‌ కోర్సుల అకాడమిక్‌ క్యాలెండర్‌ను సైతం ఏఐసీటీఈ విడుదల చేసింది. పీజీడీఎం, పీజీసీఎం కోర్సులు నిర్వహించే విద్యాసంస్థలు జూన్‌ 30లోపు అనుమతులు పొంది, జూలై 1 నుంచి తరగతులు నిర్వహించాలని ఏఐసీటీఈ పేర్కొన్నది. సీట్లు పొందిన వారు జూలై 5వ తేదీలోపు రద్దుచేసుకోవచ్చని, జూలై10వ తేదీలోపు మొత్తం ప్రవేశాల ప్రక్రియను పూర్తిచేయాలని ఏఐసీటీఈ షెడ్యూల్‌లో ప్రకటించింది. ఆన్‌లైన్‌, ఓపెన్‌ డిస్టెన్స్‌
లర్నింగ్‌ కోర్సులు నిర్వహించే విద్యాసంస్థలు జూన్‌ 30లోపు అనుమతులు తెచ్చుకొని, సెప్టెంబర్‌ 1లోపు తొలివిడత, ఫిబ్రవరి 1, 2022లోపు రెండోవిడత ప్రవేశాలు
పూర్తిచేయాలని వెల్లడించింది.

💫ముగియకుండానే..
ప్రస్తుత విద్యాసంవత్సరం ముగియకుండానే ఏఐసీఈటీ నూతన విద్యాసంవత్సరాన్ని ప్రకటించింది. 2020- 21 విద్యాసంవత్సరం కొనసాగుతుండగా, కరోనా దృష్ట్యా పరీక్షలు జరుగలేదు. పరీక్షల నిర్వహణపై వర్సిటీ అధికారులు మల్లగుల్లాలు పడుతుండగానే నూతన విద్యాసంవత్సరం షెడ్యూల్‌ ప్రకటనపై తెలంగాణ స్కూల్స్‌ టెక్నికల్‌ కాలేజెస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (టీఎస్‌టీసీఈఏ) అధ్యక్షుడు అయినేని సంతోష్‌కుమార్‌ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. క్లాసులు జరుగుతున్నాయో, లేదో తెలుసుకోకుండా షెడ్యూల్‌ విడుదల చేయడంమేంటని ప్రశ్నించారు.

🌀ఏఐసీఈటీ నిర్ణయం అశాస్త్రీయం..

♦️వాస్తవ పరిస్థితులను అంచనా వేయకుండానే ఏఐసీఈటీ 2021-22 విద్యాసంవత్సరం షెడ్యూల్‌ ప్రకటించడం విడ్డూరంగా ఉన్నదని టెక్నికల్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (టీపీఐఈఏ) అధ్యక్షుడు డాక్టర్‌ వీ బాలకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. ఏఐసీటీఈ నిర్ణయం అశాస్త్రీయమని, ఏదో తంతు పూర్తిచేసినట్టుగా షెడ్యూల్‌ విడుదలచేసి చేతులు దులుపుకొన్నారని ఆరోపించారు. సిలబస్‌, పరీక్షలు పూర్తికాకుండా కొత్త షెడ్యూల్‌ విడుదల గందరగోళానికి దారితీస్తుందన్నారు.

షెడ్యూల్‌ – గడువు..🔰

★టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూషన్ల నుంచి గుర్తింపు పొందడానికి జూన్‌ 30

★విశ్వవిద్యాలయాలు, బోర్డుల నుంచి గుర్తింపునకు జూలై 15

★తొలివిడత కౌన్సిలింగ్‌, సీట్ల కేటాయింపు, ప్రవేశాలు ఆగస్టు 31

★2,3,4 సంవత్సరాల విద్యార్థులకు క్లాసుల నిర్వహణ సెప్టెంబర్‌ 1

★రెండోవిడత కౌన్సెలింగ్‌, సీట్ల కేటాయింపు, ప్రవేశాలు సెప్టెంబర్‌ 9

★నచ్చిన కాలేజీల్లో సీట్లు దక్కకుంటే సీట్ల రద్దు సెప్టెంబర్‌ 10

★మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి గడువు సెప్టెంబర్‌ 15

ఫస్టియర్‌ విద్యార్థులకు తరగతుల నిర్వహణ  : సెప్టెంబర్‌ 15
లాటరల్‌ ఎంట్రీతో  సెకండియర్‌లో చేరేందుకు సెప్టెంబర్‌ 20

@@@@@@