1). *🔊మోడల్ స్కూల్ ప్రవేశ దరఖాస్తు గడువు పెంపు*
🍥జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో 2021- 22 విద్యా సంవత్సరానికి 6 నుండి 10వ తరగతి వరకు ప్రవేశం కొరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసేందుకు తుది గడువు మే 8వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ అబ్దుల్ కరీం శనివారం ప్రకటనలో తెలిపారు.
కరోనా పరిస్థితులలో ఎక్కువ మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేకపోవడం వల్ల మళ్ళీ తిరిగి తేదీని పొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు. కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. చేసుకునేందుకు telanaganams.cgg.gov.in అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
@@@@@
2). *🔊ఎఫ్ఎ ఆధారంగా రాష్ట్రంలోనూ టెన్త్ గ్రేడ్లు!
*🌍రాష్ట్రంలో పదో తర తి విద్యార్ధులకు ఫార్మేటివ్ అసెస్మెం ట్-1 (ఎఫ్ఎ) మార్కుల ఆధారం గానే గ్రేడ్లను ఇవ్వను న్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పదో తరగతి విద్యార్థులను పాస్ చేసేందుకు విధానాన్ని ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర అధికారులు కూడా అదే విధంగా పదో తరగతి విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో ఈనెల 17వ తేదీ నుంచి నిర్వహించా ల్సిన పదో తరగతి పరీక్షలను గతనెల 15వ తేదీనే రద్దు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 5.21 లక్షలమంది పదో తరగతి విద్యార్థులను పాస్ చేస్తు న్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. అయితే వారికి మెమో గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్ యావరేజ్ ఎలా ఇవ్వాలన్న ఆలోచనలో పడింది.
ఈ నేపథ్యంలో శనివారం సీబీఎస్ఈ విధానాన్నిప్రకటించింది. ఇంటర్నల్స్కు 20 మార్కులు, పాఠ శాల స్థాయిలో నిర్వహించిన ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా మిగతా 80 మార్కులివ్వాలని నిర్ణయిం చింది. దీంతో రాష్ట్రంలోనూ టెన్త్ విద్యార్థులకు ఎఫ్ఎ-1 మార్కుల ఆధారంగానే గ్రేడింగ్ ఇవ్వాలనే ఆలోచనకు వచ్చింది. ఎవరైనా విద్యార్థులు ఆ మార్కులతో సంతృప్తి చెందకపోతే పరీక్షలు రాసే అవకాశం కల్పించ నుంది. అయితే సాధారణ పరిస్థితులొచ్చాక దానిపై నిర్ణయం ఉండనుంది. కాగా, నాలుగు ఎఫ్ఎలకు బదులు రెండు ఎఫ్ఎలను నిర్వహించాలనుకున్నా.. రాష్ట్రంలో ఒక ఎఫ్ఎ పరీక్షలే జరిగాయి. వాటిల్లో ఒక్క సబ్జెక్టులో వచ్చిన మార్కులనే 100 శాతానికి లెక్కించి వచ్చే మార్కుల ఆధారంగా గ్రేడ్లను ఇవ్వనున్నారు.
@@@@@
3) *🔊బడి బాధ్యత మనదే..!
*🌀కీలకం కానున్న యాజమాన్య కమిటీలు
*🍥ప్రభుత్వం పాఠశాలల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించింది. ‘బడి మనదే.. బాధ్యత మనదే’ అనే పేరుతో నూతన విధానానికి నాంది పలికింది. ఈ ప్రక్రియలో భాగంగా యాజమాన్య కమిటీలకు శిక్షణ ప్రారంభించారు. మే 2వ తేదీ వరకు ఈ శిక్షణ కొనసాగించాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా అధికారులకు మార్గదర్శకాలు రూపొందించారు. జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన వారు క్షేత్రస్థాయిలో ఆన్‌లైన్ ద్వారా అవగాహన కల్పించనున్నారు.*
*💥రాష్ట్ర స్థాయిలో 15 మందికి శిక్షణ*
*💠ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో శిక్షణకు 15 మందిని ఎంపిక చేశారు. వారు తిరిగి జిల్లా స్థాయిలో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణకు జిల్లాలోని ప్రతి మండలం నుంచి ఎనిమిది మంది ఉపాధ్యాయుల చొప్పున గతనెల 25న ఒక రోజు శిక్షణ కల్పించారు. సెక్టోరియల్ అధికారి, సాంకేతిక సిబ్బంది, ఎంఈవోలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు బడి మనదే బాధ్యత మనదే అనే అంశంపై అవగాహన కల్పించారు. వీరంతా యాజమాన్య కమిటీలకు విడతల వారీగా అవగాహన కల్పించాల్సి ఉంది. కరోనా ఉద్ధృతి కారణంగా ప్రత్యక్ష సమావేశాలు పెట్టేవీలు లేకపోవడంతో ఎంపిక చేసిన బృందం యాజమాన్య కమిటీలకు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అవసరాల గుర్తింపు, ఆయా అంశాల అమల్లో ప్రత్యక్ష చర్యలకు వీరికి బాధ్యతలు అప్పగించనున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి సమగ్ర ప్రణాళిక విధానాన్ని అమలు చేయనున్నారు.
*💥గుణాత్మక విద్య అమలు కోసమే..
*💫విద్యార్థులకు గుణాత్మక విద్య అందించేలా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలి. విద్యా విధానం అమలుపై యాజమాన్య కమిటీల పర్యవేక్షణ తప్పనిసరి. వీరికి ఇటీవలే ఆన్‌లైన్ ద్వారా శిక్షణ తరగతులు ప్రారంభించాం. మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యా విధానంలో మార్పులు తదితర అంశాలపై విద్యాశాఖ అధికారులకు వీరు సూచనలందించవచ్ఛు లోటుపాట్లను సవరించుకుని మెరుగైన విద్య అందేలా కృషి చేస్తాం.
*💥మార్గదర్శకాలు ఇవీ..*
*♦️శిక్షణ అనంతరం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధితో పాటు ఉపాధ్యాయుల వ్యవహార శైలిపై అధికారుల పర్యవేక్షణ.*
* ♦️బోధకుల సమయపాలన, పాఠ్యాంశాల బోధన తీరు, మధ్యాహ్న భోజనం అమలుపై దృష్టి.*
*♦️ పాఠశాల అభివృద్ధి కమిటీలను నూతన ప్రక్రియలో భాగస్వాములను చేయడం.*
* ♦️విద్యా హక్కు చట్టం అమలు తీరు, అభ్యసన ఫలితాలపై పరిశీలన.*
* ♦️ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు భవిత కేంద్రాల్లో వసతుల కల్పన.*
*♦️ బడి బయట పిల్లలను గుర్తించి చదువుపై దృష్టి సాధించేలా చైతన్యం చేయడం.*
* ♦️కస్తూర్బాల్లో విద్యా సౌకర్యాలు అందుతున్న తీరుపై దృష్టి.
@@@@@
4). *🔊ఆన్‌లైన్ నైపుణ్య బోధనపై ‘నార్మ్’ శిక్షణ*
🌍కరోనా కారణంగా ఆన్‌లైన్‌లో బోధనకు ప్రాధాన్యం పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న రాజేంద్రనగర్‌లోని జాతీయ వ్యవసాయ, పరిశోధన, నిర్వహణ సంస్థ(నార్మ్).. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఆన్‌లైన్‌లో పాఠాలను నైపుణ్యంగా బోధించే అంశంపై మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సు(ఎంఓఓసీ) పేరుతో ప్రత్యేకంగా శిక్షణ కోర్సును ప్రవేశపెట్టింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి నెలరోజుల పాటు ఆన్‌లైన్‌లో ఈ కోర్సును నిర్వహించనుంది. పట్టభద్రులతో పాటు ప్రస్తుతం బోధనా రంగంలో ఉన్న ఉపాధ్యాయులు కూడా ఈ కోర్సులో చేరవచ్చు. ఆసక్తి ఉన్నవారు elearning.naarm.org.in వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. కోర్సులో భాగంగా వీడియో పాఠాలను ఆన్‌లైన్‌లో ఇస్తామని, శిక్షణ పూర్తయ్యాక రూ.1,180 చెల్లించిన వారికి సర్టిఫికెట్‌ను అందజేస్తామని నార్మ్ సంచాలకుడు చెరుకుమల్లి శ్రీనివాసరావు తెలిపారు.
@@@@@
5). *🔊31 దాకా ఐటీఆర్ పొడిగించిన సీబీడీటీ*
*🌍 కరోనా పరిస్థితుల నేపథ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి (2020-21 మదింపు సంవత్సరం)గాను ఆలస్యమైన, సవరించిన ఆదాయ పన్ను (ఐటీ) రిటర్న్‌ల దాఖలు గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శనివారం పొడిగించింది. ఈ నెల 31లోగా దాఖలు చేయవచ్చని స్పష్టం చేసింది. ‘రోజురోజుకూ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి దృష్ట్యా, దేశవ్యాప్తంగా ఉన్న ట్యాక్స్ పేయర్లు, ట్యాక్స్ కన్సల్టెంట్లు, ఇతర వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఐటీఆర్‌సహా వివిధ ఆదాయ పన్ను గడువులను మే 31దాకా పొడిగిస్తున్నాం’ అని ఓ అధికారిక ప్రకటన విడుదలైంది.
సెక్షన్ 148 కింద ఐటీఆర్‌ల కోసం నోటీసులు అందుకున్నవారు కూడా మే 31లోగా దాఖలు చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నట్లు సీబీడీటీ పేర్కొన్నది. వివాదాల పరిష్కార కమిటీ (డీఆర్పీ)కి అభ్యంతరాల దాఖలుకున్న గడువునూ ఈ నెలాఖరుదాకా పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. సీబీడీటీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుత పరిస్థితుల్లో పన్ను చెల్లింపుదారులకు ఎంతో మేలు చేయగలదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే పరిస్థితులు ఇలాగే ఉంటే గడువును మరికొంతకాలం పొడిగించే వీలుకూడా లేకపోలేదని వారు చెప్తున్నారు.
@@@@@
6) *🔊టీఎస్‌ఆర్‌జేసీ సెట్ దరఖాస్తు గడువు పెంపు*
*🍥తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ఆర్‌జేసీ సెట్ దరఖాస్తు గడువును ఈ నెల 17వ తేదీ వరకు పొడిగించినట్లు సంస్థ కార్యదర్శి రమణకుమార్ తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు www.tsrjdc.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
@@@@@
7). *🔊‘ఏకలవ్య’ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం*
*🍥 రాష్ట్రంలోని 23 ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశపరీక్షలకు అర్హులైన గిరిజన విద్యార్థులు ఈ నెల 3 నుంచి 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఏకలవ్య గురుకుల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ తెలిపారు. పూర్తి వివరాలకు తెలంగాణ ఈఎంఆర్‌ఎస్ వెబ్‌సైట్ సందర్శించాలని ఆయన సూచించారు.
@@@@@
8). SBI Home Loan :
దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)గుడ్‌న్యూస్ చెప్పింది. ఎస్‌బీఐ గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. గృహ రుణాలను తీసుకునే వారికి 6.70 శాతం నుంచి వడ్డీ రేట్లు ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా మహిళ రుణ గ్రహీతలకు 5 బేసిక్ పాయింట్ల వరకు రాయితీని ఇవ్వనుంది. ఖాతాదారులు యోనో యాప్ నుంచి గృహరుణాలను పొందవచ్చునని ఎస్‌బీఐ తెలిపింది. యోనో యాప్ నుంచి రుణాలను తీసుకున్న ఖాతాదారులకు 5 బేసిక్ పాయింట్ల వరకు రాయితీని ఇవ్వనుంది.
ఈ సందర్భంగా సంస్ధ ఎండీ సీఎస్ శెట్టి(రిటైల్ & డిజిటల్ బ్యాంకింగ్) మాట్లాడుతూ...“ఎస్‌బీఐ హోమ్ ఫైనాన్స్‌లో మార్కెట్ లీడర్‌గా ఉంటూ, గృహ రుణ మార్కెట్లో వినియోగదారులను సంతృప్తి పరచడానికి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత గృహ రుణ వడ్డీ రేట్లతో ఖాతాదారులకు రుణాలను తీసుకునే స్థోమత బాగా పెరుగుతుంది. అంతేకాకుండా ఇది ఈఎంఐ మొత్తాలను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ చర్యలతో రియల్ ఎస్టేట్ పరిశ్రమకు వెనుదన్నుగా నిలుస్తుంద"ని పేర్కొన్నారు.
ఎస్‌బీఐ గృహ రుణ వడ్డీ రేట్లు రూ. 30 లక్షలకు 6.70 శాతం , రూ. 30 లక్షలు నుంచి 75 లక్షల వరకు 6.95 శాతం . రూ. 75 లక్షలకుపైగా రుణాలను తీసుకునే వారికి 7.05 శాతం వద్ద గృహ రుణాలు లభిస్తాయని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. బ్యాంకు గృహ రుణ పోర్ట్‌ఫోలియో రూ. 5 లక్షల కోట్ల మైలు రాయిని చేరిందని ఎస్‌బీఐ తెలిపింది. 2020 డిసెంబర్ 31 నాటికి బ్యాంకు దగ్గర ఆటో లోన్ బుక్ రూ. 75,937 కోట్లు ఉందని తెలిపింది. బ్యాంకు డిపాజిట్ బేస్ రూ. 35 లక్షల కోట్లు ఉందని పేర్కొన్నారు
9). *💠💰అవసరాలకు అందజెయండి!*
*🌀సహాయాన్ని నిరాకరించిన 82 ప్రైవేటు పాఠశాలల టీచర్లు*
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రముఖ పాఠశాలలో 120 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. కరోనా ఉద్ధృతిలోనూ ఆన్‌లైన్ తరగతులు సజావుగా నిర్వహించారు. పూర్తిస్థాయిలో ఫీజులు వసూలు చేశారు. నెలనెలా టీచర్లకు జీతాలు చెల్లించింది ఆ పాఠశాల యాజమాన్యం. ప్రైవేటు పాఠశాలల బోధనా సిబ్బందికి రూ.2వేల ఆర్థిక సాయంతోపాటు బియ్యం అందించాలని గత నెలలో ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. తమకు ఆర్థికంగా ఇబ్బంది లేనందున ఆ టీచర్లు ప్రభుత్వ సాయాన్ని వద్దనుకున్నారు. ఒక్క ఈ పాఠశాల బోధన సిబ్బంది మాత్రమే కాదు.. ఇదే కారణంతో హైదరాబాద్ జిల్లా పరిధిలోని 30 పాఠశాలల టీచర్లు ఆసక్తి చూపలేదు.*
*🔰కరోనా కారణంగా ప్రైవేటు విద్యాసంస్థలు మూతపడడంతో ఫీజుల వసూళ్లు మందగించాయి. ముఖ్యంగా బడ్జెట్ కేటగిరీలోని ప్రైవేటు పాఠశాలలు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్న పరిస్థితి. ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించగా వసూలైన ఫీజులు భవనాల అద్దెలు, విద్యుత్తు ఛార్జీలకు సరిపోవడంతో ఉపాధ్యాయులు, సిబ్బందికి చాలావరకు జీతాలు చెల్లించలేదు. నెలల తరబడి ఆదాయం లేకపోవడంతో వేలాది మంది కుటుంబాలు రోడ్డునపడ్డాయి. దిక్కులేని స్థితిలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా చితికిపోయిన వారిని ఆదుకునేందుకు నెలకు రూ.2 వేలు ఆర్థిక సాయంతోపాటు 25 కిలోల బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మొత్తం 4691 ప్రైవేటు పాఠశాలలు ఉండగా, 82 విద్యాసంస్థల్లోని దాదాపు 4800 మంది ఉపాధ్యాయులు సాయాన్ని వద్దనుకున్నారు.*
*👏కష్టాల్లో ఉన్న తోటి ఉపాధ్యాయుల కోసమే..
*♻️దరఖాస్తులు రాకపోవడంతో సాయం అవసరం లేదని ఆయా పాఠశాల యాజమాన్యాల తరఫున లేఖలు ఇచ్చారు. దాదాపు ఈ పాఠశాలలన్నీ కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్థాయివే. ఒక్కొక్క పాఠశాలలో సగటున 100 మందికి తగ్గకుండా సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి ఎప్పటికప్పుడు పూర్తిగా లేదా 70-80 శాతం జీతాలు చెల్లించారు. తమకు జీతాలు అందాయని, ఇతర పాఠశాలల్లో వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్న తోటివారికి సాయం అందుతున్న ఉద్దేశంతో వద్దనుకున్నట్లు కొందరు చెబుతున్నారు.*
*🔶‘‘గత విద్యా సంవత్సరం ఆన్‌లైన్ తరగతులు నిర్వహించి సిలబస్ పూర్తి చేశాం. ఆన్‌లైన్‌లో పరీక్షలూ నిర్వహించాం. చాలావరకు ఫీజులు వసూలయ్యాయి. ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాం. ఈ నేపథ్యంలో తమ ఉపాధ్యాయులు ప్రభుత్వ సాయం అక్కర్లేదని చెప్పడంతో మేం దరఖాస్తు చేయలేదని’’ హైటెక్‌సిటీ ప్రాంతంలోని ఓ కార్పొరేట్ స్కూల్ ప్రిన్సిపాల్ చెప్పారు.