Saturday, 1 May 2021

Teacher's Diary: 01.05.2021

1).*🔊ప్రాథమిక పాఠశాలల్లో హెచ్ఎంల లెక్కతేలాకే...*

*💫బదిలీలు, పదోన్నతులు!*

*📜 ఆర్థికశాఖ నుంచి ఆమోదం లభించిన వెంటనే ప్రక్రియ ప్రారంభం*
💫ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మరింత ఆలస్య మయ్యేటట్లు సూచనలు కనిపిస్తున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో 10వేల హెడ్మాసర్ల పోస్టుల్లో 5571 పోస్టులకు సంబంధించి ఆర్థికశాఖ నుంచి రావాల్సిన అనుమతిలో ఏర్పడిన జాప్యం కారణంగా ఈ ప్రక్రియ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టుల కు పీఎస్చ్ఎం పోస్టులకు అనుమతి కోరుతూ పాఠశాల విద్యాశాఖ అధికారులు నెల రోజుల క్రితమే ఆర్థిక శాఖకు లేఖ రాశారు. దీనిపై ఆర్థిక శాఖ నుంచి ఇంకా ఎటు వంటి ఆమోదం లభించలేదని అధికారులు పేర్కొంట న్నారు. ఆమోదం వచ్చిన తర్వాతే ప్రక్రియ ను ప్రారంభిం చనున్నట్లు విద్యాశాఖ ఓ అధికారి పేర్కొన్నారు. 
ప్రస్తుతం రాష్ట్రంలోకరోనా విపత్కర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు ప్రక్రియ ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. మరోపక్క పరీక్షలు రద్దు, పాఠశాల లకు వేసవి సెలవులు కూడా ఇచ్చారు కాబట్టి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి. 
వారం పది రోజుల్లో ఈ ప్రక్రియనంతా ముగించేయాలని కోరుతున్నారు. అధికారులు మాత్రం 5571 పీఎస్ హెచ్ఎంల పోస్టుల - అనుమతి వచ్చిన తర్వాతే బదిలీలు, పదోన్నతులు చేపట్ట నున్నట్లు పేర్కొంటున్నారు. ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభించిన వెంటనే ప్రభుత్వ అనుమతి తీసుకుని పాఠశాల విద్యాశాఖ అధికారులు షెడ్యూల్ విడుదల చేయనున్నారు.

*🌀రాష్ట్రంలో 10వేల ప్రాథమిక పాఠశా ప్రధానోపాధ్యాయుల పోస్టులను మంజూరు చేయనున్నట్లు గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలోని 18,217 ప్రైమరీ స్కూళ్లలో 4429 స్కూళ్లకు లోయర్ ఫిమేల్ లిటరసీ (ఎల్ఎఫ్ఎల్) ప్రధానోపాధ్యాయుల పోస్టులను మంజూరు చేశారు. 10వేల పోస్టుల్లో 4429 పోస్టులు పోనూ అదనంగా భర్తీ చేయాల్సింది 5571 హెడ్ మాస్టర్ పోస్టులు మాత్రమే. వీటిని భర్తీ చేయ డానికి ఆర్థిక శాఖకు పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే లేఖను కూడా రాశారు. 
ఆర్ధిక శాఖ నుండి పోస్టుల భర్తీకి ఆమోదం లభించిన వెంటనే బదిలీలు, పదోన్నతులు ప్రక్రియను ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యా శాఖలో దాదాపు లక్ష మందికి పైగా టీచర్లు బదిలీల కోసం, వివిధ కేటగిరీల వారిగా సుమారు 25 వేల మంది వరకు ఉపాధ్యా యులు పదోన్నతులు పొందను న్నారు. వారం పది రోజుల్లో ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభించే అవకాశాలున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.

@@@@@

2). *🔊ఓపెన్ స్కూల్ పరీక్షలు రద్దు!*

*✍️ఇంటర్నల్స్ ఆధారంగా ఫలితాలు*
*🌍తెలం గాణ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) విద్యార్థులను కూడా పరీక్షలు లేకుండానే పాస్ చేయా లని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. పరీక్షలు రద్దుచేసి, ఇంటర్నల్స్ ఆధారంగా వీరికి మార్కులు వేయాలని యోచిస్తున్నారు. దీనిపై ప్రభుత్వాన్ని సంప్ర దించి, నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతానికి పరీక్ష 5. ఫీజును స్వీకరిస్తున్నా.. కరోనా నేపథ్యంలో పరీక్షలు నిర్వహించకపోవటమే మేలన్న అభిప్రాయాలు వ్యక్త ఆ మవుతున్నాయి. గతేడాది ఫీజు చెల్లించిన వారందరికీ పరీక్ష నిర్వహించకుండానే 35% మార్కులు వేసి ఉత్తీ ర్టులను చేశారు. ఈ ఏడాది ఇంటర్నల్స్ ఆధారంగా ఫలితాలు ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు.

@@@@@

3). *🔊గ్రూప్ ఇన్స్యూరెన్స్ వడ్డీ పెంపు*
*🌍రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గ్రూప్ ఇన్స్యూరెన్స్స్కీం -1984 వడ్డీరేట్లను సవరిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల జీపీఎఫ్ వంటి పొదుపులపై 2020 జులై 1 నుంచి 2020 సెప్టెంబర్ 30వరకు 7.1 శాతంగా వడ్డీని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వడ్డీ రేటు జీపీఎఫ్, ఇతర పొదుపులపై వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది.

@@@@@

4). *🔊రికార్డుల ఆధారంగా ప్రాక్టికల్ మార్కులు!*

*💫ప్రభుత్వానికి ప్రతిపాదించిన ఇంటర్ బోర్డు*

🌍కరోనా ఉధృతి నేపథ్యంలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర విద్యార్థు లకు ఈసారి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించే అవ కాశం లేదు. ఈ నేపథ్యంలో 2,62,169 మంది అందజేసే రికార్డుల ఆధారంగా ప్రాక్టికల్ మార్కులు వేసేందుకు ఇంటర్ బోర్డు చర్యలు చేపడుతోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. కరోనా కారణంగా విద్యా సంస్థలను తాత్కాలికంగా ప్రభుత్వం మూసేసిన నేపథ్యంలో విద్యార్థులకు ప్రత్యక్ష బోధన నిర్వహించలేదు. 
ప్రాక్టి కల్స్ నిర్వహణ కూడా సమస్యగా మారింది. దీంతో రికార్డుల ఆధారంగా మార్కులు వేసేందుకు బోర్డు కసరత్తు చేస్తోంది. కాలేజీల్లో ప్రత్యక్ష విద్యాబోధన కొనసాగి ఉంటే ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేలా ఇంటర్ బోర్డు షెడ్యూలు జారీ చేసింది. అయితే అది సాధ్యపడలేదు. ఫిబ్రవ రిలో ప్రత్యక్ష బోధన మొదలైనా.. కేసులు పెరగడంతో ప్రత్యక్ష బోధన నిలిపేసిం ది. అలాగే ఏప్రిల్లో నిర్వహించాల్సిన ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేసింది. మేలో వార్షిక పరీక్షల తర్వాత నిర్వహిస్తామని పేర్కొంది. 
ప్రథమ సంవత్సర వార్షిక పరీక్షలను ప్రస్తుతానికి రద్దు చేస్తున్నామని, భవిష్యత్తులో వీలైతే నిర్వహి స్తామని స్పష్టం చేసింది. ఇదే బాటలో రెండో సంవత్సర వార్షిక పరీక్షలను కూడా బోర్డు వాయిదా వేసింది. జూన్ మొదటి వారంలో కరోనా కేసుల పరిస్థితిని సమీ క్షించాక పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలన్నది నిర్ణయిస్తామని, 15 రోజుల ముందు వివరాలు తెలుపుతామని పేర్కొంది. దీంతో ప్రాక్టికల్ పరీక్షలను కూడా నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. అందుకే విద్యార్థులు సమరి ్పంచే రికార్డుల ఆధారంగానే ప్రాక్టికల్ మార్కులు వేసేలా ప్రభుత్వానికి ప్రతిపా దించింది. కాగా, ప్రథమ సంవత్సర మార్కుల ఆధారంగా ద్వితీయ సంవ త్సరం విద్యార్థులకు మార్కులు వేస్తారన్న వాదనలను బోర్డు అధికారులు ఖండించారు. మరోవైపు జాతీయ స్థాయిలో 12వ తరగతి విద్యార్థుల విష యంలో కేంద్రం తీసుకునే నిర్ణయం తర్వాత ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీ క్షల విషయంపై జూన్ నెలలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఓ ఉన్నతా ధికారి పేర్కొన్నారు.

@@@@@

5). *🔊పాలీసెట్ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా*
 *🍥పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 1వ తేదీ నుంచి ప్రారంభించాల్సిన దరఖాస్తుల ప్రక్రియను వాయిదా వేశారు. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి కార్యదర్శి డాక్టర్ సి.శ్రీ నాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. 
 జూన్ 12వ తేదీన పాలీసెట్-2021 నిర్వహించనున్నట్లు, మే 1వ తేదీ నుంచి విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రకటించామని ఆయన తెలిపారు. అయితే కరోనా వ్యాప్తి నేప థ్యంలో ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. మళ్లీ దరఖాస్తులు స్వీకరించే తేదీని తర్వాత తెలియ జేస్తామని వివరించారు.

@@@@@

6). *🔊మైనార్టీ గురుకుల ప్రవేశ పరీక్ష రద్దు*


*🌀5 నుంచి 8 తరగతులు, జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల*

*🍥కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరం రాష్ట్ర మైనార్టీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షను రద్దు చేశారు. ప్రవేశ పరీక్షకు బదులు డ్రా పద్దతిలో ప్రవేశాలు చేపట్టనున్నట్లు తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి షఫియుల్లా శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మైనార్టీ పాఠశాలల్లో లక్కీ డ్రా నిర్వహించి దరఖాస్తులు చేపడతామని తెలిపారు. అదేవిధంగా మైనార్టీ గురుకుల పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు లక్కీ డ్రా ద్వారా మైనార్టీ జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత సీట్లు మిగిలితే అర్హులైన విద్యార్థుల నుంచి కొత్త దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు.*

*💥మే 20 వరకు దరఖాస్తుల స్వీకరణ*

*💠రాష్ట్రంలో మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 8 వ తరగతితో పాటు ఇంటర్మీడియేట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తులను ఆన్‌లైన్ పద్ధతిలో స్వీకరించనున్నారు. ఈ మేరకు తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి షఫియుల్లా నోటిఫికేషన్ జారీ చేశారు. ఏప్రిల్ 30(శుక్రవారం) నుంచి మే 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తలు స్వీకరిస్తామని తెలిపారు. మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు జూన్ 1న, 6,7,8 తరగతుల్లో ప్రవేశాలకు జూన్ 3వ తేదీన లక్కీ డ్రా నిర్వహించనునన్నట్లు పేర్కొన్నారు.*

*🥏అలాగే జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు జూన్ 1 నుంచి 4వ తేదీ వరకు లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 6వ తేదీన మైనార్టీ గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందిస్తామని అన్నారు. జూన్ 8 నుంచి 12 వ తేదీ వరకు సిర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు. జూన్ 14 వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. ఇతర వివరాలకు www.tmreis.telangana.gov.in వెబ్‌సైట్‌లో లేదా 040 23437909 హెల్ప్‌లైన్ సెంటర్‌లో సంప్రదించాలని తెలిపారు.

@@@@@

7) *🔊TGCET-2021 దర‌ఖాస్తు గ‌డువు పొడిగింపు*

*🌍తెలంగాణ‌లోని గురుకులాల్లో ఐదోత‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించే టీజీసెట్ ద‌ర‌ఖాస్తు గ‌డువును ప్ర‌భుత్వం మ‌రోసారి పొడిగించింది. వ‌చ్చే నెల 10 వ‌ర‌కు గ‌డువు పొడిగిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

🍥ఐదో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు గురుకులాల్లో ప్ర‌వేశానికి యేటా ప్ర‌భుత్వం టీజీసెట్ నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసింది. కొవిడ్ నేప‌థ్యంలో ఈ ఏడాది ప్ర‌వేశ ప‌రీక్ష కాస్త ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశం క‌నిపిస్తున్న‌ది.

🍥ప్రస్తుత విద్యాసంవత్సరంలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు ప్ర‌వేశ ప‌రీక్ష‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

*💫ప్రవేశ పరీక్షను మే 30న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్ష ద్వారా మొత్తం 46,937 సీట్లను భర్తీ చేయ‌నున్నారు.

@@@@@

8). 🔊విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సుల్తానియా*

 💫పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియాకు విద్యాశాఖలో అదనపు బాధ్యతలు అప్పగించారు. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా చిత్రా రాంచంద్రన్‌ శుక్రవారం పదవీ విరమణ చేయడంతో ఆమె స్థానంలో సుల్తానియాకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.

@@@@@

9) *🔊8 వరకు నైట్‌ కర్ఫ్యూ*

*📜ఆంక్షలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ

*🥏కరోనా కట్టడికి ప్రభుత్వ నిర్ణయం

*🍥కరోనా మహమ్మారి సెకండ్‌వేవ్‌ విస్తరణను అరికట్టేందుకు విధించిన రాత్రి కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8వ తేదీ ఉదయం 5 గంటల వరకు పొడిగించింది. ఏప్రిల్‌ 20న కర్ఫ్యూ ప్రకటించిన సందర్భంగా విధించిన నిబంధనలన్నీ అమలులో ఉంటాయని తెలిపింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏప్రిల్‌ 30 వరకు రాత్రి కర్ఫ్యూ విధిస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది.
 ఈ కర్ఫ్యూ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటున్న సంగతి తెలిసిందే. తాజా ఉత్తర్వులతో రాత్రి 8 గంటలలోపే అన్ని వ్యాపార సం స్థలు, కార్యాలయాలు, దుకాణాలు, సంస్థలు, రెస్టారెంట్లు మూసివేయాలి. 
మరికొన్ని రోజులు రాత్రి కర్ఫ్యూ విధిస్తేనే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చిన సర్కారు తాజాగా మరోవారం రోజులు పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నది.*

*💥మినహాయింపులు ఈ సేవలకు మాత్రమే..*

*👉ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా*

*👉టెలికమ్యూనికేషన్స్‌, ఇంటర్నెట్‌ సేవలు, బ్రాడ్‌ కాస్టింగ్‌, కేబుల్‌ సర్వీసెస్‌, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు*

*👉ఇ-కామర్స్‌ ద్వారా అన్ని వస్తువుల పంపణీ*

*👉పెట్రోల్‌ పంపులు, ఎల్పీజీ, సీఎన్‌జీ, పెట్రోలియం, గ్యాస్‌ ఔట్‌లెట్‌లు.*

*👉విద్యుత్తు ఉత్పత్తి- సరఫరా- పంపిణీ.*

*👉నీటి సరఫరా- పారిశుద్ధ్యం*

*👉కోల్డ్‌ స్టోరేజీ, గిడ్డంగులు*

*👉ప్రైవేటు భద్రతా సేవలు*

*👉నిరంతర ప్రక్రియకు అవసరమయ్యే సేవలు, ఉత్పత్తి యూనిట్లు*

*👉అత్యవసర సర్వీసులైన దవాఖానలు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లు, ల్యాబ్‌లు, ఫార్మసీలు.*

*💥గుర్తింపు కార్డులు తప్పనిసరి*

*💫మినహాయంపు ఇచ్చిన సంస్థలు, వ్యక్తులు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు, పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్‌ సంస్థలు ఇచ్చే ఎమర్జెన్సీ డ్యూటీ గుర్తింపు కార్డులు కలిగి ఉండాలి. అన్ని ప్రైవేటు దవాఖానల్లో పనిచేసే వైద్య సిబ్బంది, డాక్టర్లు, నర్సింగ్‌ స్టాఫ్‌, పారామెడికల్స్‌, దవాఖాన సర్వీస్‌ ప్రొవైడర్స్‌కు గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలి. 
వైద్య సేవలు పొందే గర్భిణిలు, రోగులు, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల నుంచి ఇండ్లకు వెళ్లే వ్యక్తులు వారు ప్రయాణం చేసిన టికెట్‌ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. అంతర్రాష్ట్ర వస్తువుల రవాణపై ఎలాంటి ఆంక్షలు లేవు. వాటికి ప్రత్యేక పాస్‌లు అవసరం లేదు. అటోలు, ట్యాక్సీలతో సహా ప్రజా రవాణా సేవలు కర్ఫ్యూ సమయంలో మినహాయింపు ఇచ్చిన వారికి మాత్రమే పరిమితం. 
రాత్రి కర్ఫ్యూ నిబంధనలు వెంటనే అమలులోకి వస్తాయి. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ చట్టంలోని ఐపీసీ సెక్షన్‌ 188 ప్రకారం శిక్షార్హులు.

@@@@@

10) *🔊💉నేడు, రేపు టీకా బంద్‌*


*🌀కేంద్రం నుంచి అందని వ్యాక్సిన్లు*

*🍥అర్హులందరికీ వ్యాక్సిన్‌ అనే కేంద్రం నిర్ణయానికి ఆదిలోనే అడ్డంకులు మొదలయ్యాయి. మార్చి 1 నుంచి 18 నుంచి 44 ఏండ్లవారికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉండగా, వ్యాక్సిన్ల కొరత కారణంగా టీకా కార్యక్రమమే నిలిచిపోతున్నది. కేంద్రం నుంచి సరిపడా డోసులు రాష్ట్రానికి రాకపోవటంతో రాష్ట్ర వ్యాప్తంగా శని, ఆదివారాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్టు వైద్యారోగ్య శాఖ సంచాలకుడు జీ శ్రీనివాస్‌ శుక్రవారం ప్రకటించారు. ఇప్పటికే వ్యాక్సిన్లు అందకపోవటం వల్ల తొలి డోసు తీసుకున్న అనేక మంది రెండో డోసు కోసం ఎదురు చూస్తున్నారు. కొవాగ్జిన్‌ తొలి డోసు పూర్తిగా కరువైపోగా, కోవిషీల్డ్‌ మొదటి డోసు తీసుకొని సెకండ్‌ డోసు కోసం ఎదురు చూస్తున్న వారి పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు పూర్తిగా నిండుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ దవాఖానల్లో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. కేంద్రం నుంచి వ్యాక్సిన్లు వస్తే గాని రాష్ట్రంలో మళ్లీ వ్యాక్సినేషన్‌ మొదలయ్యే పరిస్థితి లేదని ఆరోగ్యశాఖ అధికారులు చెప్తున్నారు.

@@@@@