Tuesday, 4 May 2021

Online Registration Process for Corona Vaccine in Telugu

 వ్యాక్సినేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోండి ఇలా....

వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ఎలా?:(మొబైల్ లేదా కంప్యూటర్ ముందు కూర్చొని.. కింది పేర్కొన్న అంశాలను ఫాలో అవ్వండి)

☀ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలంటే ముందుగా మన పేరు వివరాలను రిజిస్టర్ చేసుకోవాలి.

☀ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం selfregistration.cowin.gov.in లింక్ అందుబాటులో ఉంచింది.

☀ ఈ లింక్‌ను మీరు స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ (ఇంటర్నెట్ ఉండాలి) ద్వారా ఓపెన్ చేయవచ్చు.

☀ బ్రౌజర్‌లో selfregistration.cowin.gov.in అని టైప్ చేస్తే చాలు రిజిస్ట్రేషన్ పేజ్ వస్తుంది.

☀ ‘రిజిస్టర్’ మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, గెట్ ఓటీపీ (Get OTP) మీద క్లిక్ చేయండి.

☀ ఇప్పుడు మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీ నెంబరును ఇచ్చి ‘వెరిఫై’ మీద క్లిక్ చేయండి.

☀ ఆ తర్వాత మరో పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఏదైనా గుర్తింపు కార్డు నెంబరును ఎంటర్ చేయండి.

☀ ఆధార్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, పింఛన్ పాస్‌బుక్, ఎన్పీఆర్ స్మార్ట్ కార్డ్, ఎంపీ, ఎంఎల్ఏ లేదా ఎంఎల్సి ఇచ్చిన గుర్తింపు కార్డు, వీటిలో ఏదైనా గుర్తింపు కార్డును ఉపయోగించవచ్చు.

☀ మీరు ఇచ్చిన ఐడీ కార్డు మీద ఉన్న పేరు, పుట్టిన తేదీ తదితర వివరాలను ఎంటర్ చేసి ‘రిజిస్టర్’ మీద క్లిక్ చేయాలి.

☀ దీని తర్వాత వ్యాక్సిన్ ఎప్పుడు, ఎక్కడ తీసుకుంటారనే వివరాలను నమోదు చేయాలి.

☀ మీ వివరాలు నమోదైన తర్వాత కనిపించే ‘స్టేటస్’ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.

☀ ఈ సందర్భంగా మీకు అందులో ‘షెడ్యూల్ అపాయింట్మెంట్ ఫర్ వ్యాక్సినేషన్’ మీద క్లిక్ చేసి మీ రాష్ట్రం, జిల్లా తదితర వివరాలు ఇవ్వాలి.

☀ ఈ వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత ‘సెర్చ్’ మీద క్లిక్ చేస్తే.. మీ ప్రాంతానికి సమీపంలో గల వ్యాక్సినేషన్ కేంద్రాల జాబితా కనిపిస్తుంది.

☀ ఆ జాబితాలో మీకు దగ్గరగా ఉండే వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఎంపిక చేసుకోండి.

☀ ఆ తర్వాత మీకు ఆ వ్యాక్సిన్ కేంద్రంలో మీకు అందుబాటులో ఉండే తేదీ, సమయాన్ని ఎంపిక చేసుకోండి. ఆ తర్వాత ‘కన్ఫర్మ్’ మీద క్లిక్ చేయండి.

☀ మీ వ్యాక్సిన్ నమోదు, అపాయింట్మెంట్ వివరాలన్నీ స్క్రీన్ మీద కనిపిస్తాయి. వీలైతే వాటిని స్క్రీన్ షాట్ తీసుకుని సేవ్ చేసుకోండి.

☀ ఒక్కసారి మీ ఫోన్ నెంబరుతో రిజిస్ట్రేషన్‌ పూర్తయితే మళ్లీ మళ్లీ రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు. మీ ఫోన్ నెంబరుతో లాగిన్ కావచ్చు.

☀ మీ ఒక్క మొబైల్ ఫోన్‌ నెంబరుతో ఇంట్లో నలుగురు కుటుంబసభ్యులకు వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

☀ రిజిస్ట్రేషన్ సమయంలో కుటుంబ సభ్యుల వివరాలు ఇచ్చేందుకు Add More మీద క్లిక్ చేసి.. వారి పేరు, ఐడీ వివరాలు ఇవ్వండి.

☀ అపాయింట్మెంట్‌లో మీరు ఏ తేదీ, సమయాన్ని పేర్కొన్నారో ఆ సమయం కంటే ముందుగా వ్యాక్సినేషన్ సెంటర్‌కు చేరుకోవాలి.

☀ వ్యాక్సినేషన్ సెంటర్‌కు వెళ్లినప్పుడు మీరు రిజిస్ట్రేషన్‌లో నమోదు చేసిన గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాలి. మీ కుటుంబ సభ్యులు కూడా వారి ఐడీ కార్డులు తీసుకెళ్లాలి.

☀ ఈ ప్రక్రియపై మీకు ఏమైనా సందేహాలుంటే హెల్ప్ లైన్ నంబర్ 1075 కి ఫోన్ చేయండి. ఈ లింక్ మీద క్లిక్ చేసి వ్యాక్సిన్ కోసం మీ పేరు నమోదు చేసుకోండి. https://selfregistration.cowin.gov.in/

☀ ఆరోగ్య సేతు, ఉమాంగ్ యాప్ ద్వారా కూడా లాగిన్ కావచ్చు.