1). స్వీయ మదింపునకు సగం మంది ఉపాధ్యాయులు దూరం
🍥ఉపాధ్యాయులు తమ పనితీరును స్వయంగా అంచనా వేసుకోవడానికి పాఠశాల విద్యాశాఖ ప్రవేశపెట్టిన ఉపాధ్యాయుల స్వీయ మదింపు(టీచర్స్ సెల్ఫ్ అసెస్‌మెంట్-టీఎస్‌ఏ)కు సగం మందే ముందుకొచ్చారు. మొత్తం 1,33,206 మంది ఉపాధ్యాయులుండగా వారిలో 71,557 మందే (53.7 శాతం) ఇప్పటివరకు నమోదు చేసుకున్నారు. వారిలో 50,430 మంది అన్ని వివరాలను నింపి ఆన్‌లైన్‌లో సమర్పించారు. అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 91.59 శాతం మంది సమర్పించగా.. యాదాద్రి జిల్లాలో కేవలం 0.76 శాతం మందే పూర్తి చేశారు. 11 జిల్లాల్లో నాలుగో వంతు కూడా పూర్తి చేయకపోవడం గమనార్హం.
@@@@@
2). ‘కళాశాలల అనుమతిని పరిశీలించండి’
కళాశాల భవనాల క్రమబద్ధీరణ దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో.. కళాశాలల అనుమతి అంశాన్ని పరిశీలించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ)ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో జీఓ 111కు విరుద్ధంగా ఉన్నాయంటూ 12 ఇంజినీరింగ్ కళాశాలలను ఏఐసీటీఈ 2021-22 విద్యా సంవత్సరంలో ‘నో అడ్మిషన్’ విభాగంలో పెట్టింది. ఈ క్రమంలో ఆరు కళాశాలలు హైకోర్టును ఆశ్రయించగా.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది.
@@@@@
3).🗳️పోలింగు రోజున పైలం
*🔶నిర్లక్ష్యం చూపితే అపార నష్టం*
*🔷మినీ పురపోరులో ఇప్పటికే పెరిగిన కరోనా కేసులు*
*🗳️రేపే ఎన్నికలు*
మహానగరపాలక సంస్థ, ఖమ్మం నగరపాలక సంస్థ, సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, అచ్చంపేట, నకిరేకల్ పురపాలక సంఘాలకు ఎన్నికలు, వివిధ కారణాల వల్ల ఖాళీగా ఉన్న మరికొన్ని స్థానాలకు ఉప ఎన్నికల సందర్భంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సందర్భంగానూ ఇదే అనుభవం ఎదురైంది. ఆ నియోజకవర్గంలో నోటిఫికేషన్‌కు ముందు 25 నుంచి 30 కేసులు నమోదు కాగా... ఎన్నికల ప్రచారం చివరి రోజున అవి 266 అయ్యాయి. ప్రచారం నిర్వహించిన కేసీఆర్‌తో పాటు ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు కరోనా బారిన పడ్డారు. నాగార్జునసాగర్ తర్వాత ప్రారంభమైన మినీ పురపోరు క్రమంలోనూ ఈ వాతావరణమే ఉంది. కొవిడ్ రెండో దశ తీవ్రత నేపథ్యంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఆయా ప్రాంతాల ఓటర్లు, ఎన్నికల సిబ్బంది, అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.
*💥వరంగల్‌లో పెరుగుదల అధికం
*🌀ఈ నెల 15న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజున వరంగల్‌లో 86 కేసులుండగా... బుధవారం వాటి సంఖ్య 203కి చేరింది. అచ్చంపేటలో 20 నుంచి 43కు, నకిరేకల్‌లో 32 నుంచి 43కు, సిద్దిపేటలో 75 నుంచి 80కి పెరిగింది. నోటిఫికేషన్ రోజున జడ్చర్లలో 85, కొత్తూరులో 14 కేసులుండగా... తాజాగా అదే స్థాయిలో ఉన్నాయి. ఖమ్మం నగరపాలక సంస్థలో 432 నుంచి 312కు తగ్గాయి.
*💥సురక్షిత చర్యలు పాటించకపోవడమే...
*💠ఈ ఎన్నికల్లో భారీఎత్తున పోటీ ఏర్పడింది. ప్రధాన పార్టీలకు తోడు తిరుగుబాటు, స్వతంత్ర అభ్యర్థుల్లో చాలామంది మందీమార్బలంతో నామినేషన్లు వేసేందుకు తరలారు. ప్రచారమూ అదే రీతిలో సాగింది. చాలా చోట్ల భౌతిక దూరం పాటించలేదు. ఓటర్లు తమను గుర్తు పడతారో లేదోనన్న అనుమానంతో మాస్క్‌లు ధరించకుండా తిరిగారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల సంఘం.. అధికారులను, పార్టీలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనల అమలుపై నిఘాకు ఆదేశించింది. అది కొంత మేర సత్ఫలితమిచ్చింది.
*💥30న కీలకం
*🥏ఈ నెల 30న జరిగే ఎన్నికలు అత్యంత కీలకం కానున్నాయి. స్థానిక ఎన్నికలు కావడంతో పెద్దఎత్తున పోలింగు జరిగే వీలుంది. బందోబస్తు, నేతల హడావిడి కొనసాగనుంది. పోలింగు సిబ్బంది ఎక్కువ సంఖ్యలో విధుల్లో ఉంటారు. ఈ సమయంలో నిర్లక్ష్యం చూపితే మళ్లీ కేసులు పెద్దసంఖ్యలో పెరిగే ప్రమాదం ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం దీనిని దృష్టిలో పెట్టుకొని పోలింగు రోజున అమలు చేయాల్సిన నిబంధనలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మాస్క్‌ల ధారణ, సురక్షితదూరం, చేతుల శుభ్రత వంటివి పాటించాలని పేర్కొంది.
@@@@@
4).సర్కారు కళాశాలల్లో ప్రైవేట్ ఆడిట్
ఇప్పటికే 2 తనిఖీలుండగా ఇది అదనం
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఇక నుంచి ప్రైవేట్ ఛార్టెడ్ అకౌంటెంట్ల(సీఏ)తో ఆడిట్ జరగనుంది. ఇప్పటికే అకౌంటెంట్ జనరల్(ఏజీ) సిబ్బందితో పాటు, విద్యాశాఖ అధికారులతో ఏడాదికి రెండు సార్లు అంతర్గత ఆడిట్ ఉంది. భారీ ఫీజు చెల్లిస్తూ తిరిగి తనిఖీ చేయించాలనే నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వంపై భారమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేయగా...దీనిపై ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రతి సంవత్సరం ఏజీ అధికారులు ఆడిట్ చేస్తున్నారు. కళాశాలలకు మంజూరు చేసిన నిధులు, విద్యార్థుల ఫీజులు, నిర్మాణ పనులకు కేటాయించిన బడ్జెట్, ఖర్చులపై తనిఖీలు నిర్వహించి నివేదికలు తయారు చేస్తారు. అందుకు కళాశాలలు ఏజీ సిబ్బందికి చెల్లించాల్సిందీ ఏమీ ఉండదు. కళాశాల విద్యాశాఖ కమిషనర్ మాత్రం ప్రైవేట్ ఆడిటింగ్ సంస్థలతో 2020-21 నుంచి 2023-24 వరకు నాలుగేళ్లపాటు ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించారు. అందుకు 12 సంస్థలను టెండర్ల పద్ధతిన నియమించామని, ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.48 నుంచి రూ.51 చొప్పున కళాశాలలు చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రాష్ట్రంలో 130 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా...అందులో దాదాపు 1.30 లక్షల మంది చదువుతున్నారు. మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా ఏటా రూ.65 లక్షలు ఆడిటర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో విద్యార్థికి రూ.50 నిర్ణయించినా గరిష్ఠంగా ఒక కళాశాలకు రూ.50 వేలు అని పరిమితి విధిస్తే బాగుండేదని కళాశాల విద్యాశాఖలో పనిచేసిన విశ్రాంత అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
💥అవకతవకలు జరగకుండా ఉండేందుకే...
*💠కళాశాలల నిధుల్లో అవకతవకలు జరగకుండా ఉండేందుకే ఈ ఏర్పాటు. నల్గొండ లాంటి కొన్ని కళాశాలల్లో అవకతవకలు వెలుగు చూశాయి. ప్రిన్సిపాళ్లు బదిలీ అవుతుంటారు, పదవీ విరమణ చేస్తుంటారు. అలాంటి సందర్భాల్లో నిధులకు సంబంధించిన లెక్కలు సరిగా ఉండటం లేదు. మూడు నెలలకు ఒకసారి ఆడిట్ వల్ల అలాంటి ఇబ్బందులు తప్పుతాయి.
@@@@@
5). ఇంజనీరింగ్, ఫార్మసీ మిడ్ పరీక్షలు ఆన్‌లైన్లో
*🌀మే 5, 6 తేదీల్లో నిర్వహించాలి: జేఎన్‌టీయూ ఆదేశాలు
*🍥ఉన్నత విద్యలో పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎట్టకేలకు ఓ అడుగుపడింది. కరోనా కారణంగా విద్యాసంస్థలు బంద్ చేయడంతోపాటు ఇప్పటికే జరగాల్సిన ఆఫ్‌లైన్ పరీక్షలు వాయిదాపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 240 ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో పరీక్షలు ఆన్‌లైన్లో నిర్వహించాలని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ) నిర్ణయించింది. ఈ అంశంపై రెక్టార్ ప్రొఫెసర్ గోవర్ధన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మన్జూర్ హుసేన్, డైరెక్టర్లు బుధవారం ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల ప్రిన్సిపాల్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. మే 5, 6 తేదీల్లో అన్ని ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలు ద్వితీయ, తృతీయ, చివరి సంవత్సరం విద్యార్థులకు మిడ్ ఎగ్జామ్స్ నిర్వహించాలని ఆదేశించారు. ఈసారి ప్రథమ సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైనందున వీరికి పరీక్షలు 15 రోజుల తర్వాత నిర్వహిస్తారు. ప్రతిసారి పరీక్షలకు ప్రశ్నపత్రం జేఎన్‌టీయూ సిద్ధం చేస్తుండగా.. ఈసారి ఆ బాధ్యతలను కాలేజీలకే అప్పగించారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాన్ని అంచనావేసేలా ప్రశ్నాపత్రాన్ని రూపొందించాలని మన్జూర్ హుసేన్ కాలేజీల ప్రిన్సిపాల్స్‌ను కోరారు. విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంను వినియోగించాలని.. జూమ్, గూగుల్‌తోపాటు ఈ సేవలందించే ప్రైవేటు సంస్థల సహకారం తీసుకోవచ్చని సూచించారు. ఈ విధానం మిడ్ పరీక్షలకే వర్తిస్తుందని, కొవిడ్ ఉధృతి తగ్గాక ఫైనల్ పరీక్షలను జేఎన్‌టీయూ నిర్వహిస్తుందన్నారు. అన్ని కాలేజీలు ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించాలని కోరారు.
@@@@@
6). టీచర్ల మెడికల్ బిల్లులు పోస్టు ద్వారానే
*🌀కరోనా నేపథ్యంలో ఆదేశాలు జారీ*
*🍥ఉపాధ్యాయుల మెడికల్ బిల్లులను పోస్టు ద్వారా మాత్రమే స్వీకరించనున్నట్టు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఇదివరకు టీచర్లు తమ మెడికల్ బిల్లులను ప్రత్యక్షంగా హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌లో సమర్పించేవారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో పోస్టు ద్వారానే స్వీకరిస్తామని,నేరుగా రావొద్దని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ఇన్‌వార్డు ఎదుట నోటీసులు అంటించారు.
@@@@@
7). *🔊పీపీఎఫ్, జీపీఎఫ్ వడ్డీరేట్లు యథాతథం*
న్యూఢిల్లీ : జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్), గ్రాట్యుటీ ఫండ్లపై 7.1 శాతంగా ఉన్న వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ క్వార్టర్ లో జీపీఎఫ్ ఇతర ప్రత్యేక డిపాజిట్ పథకాలపై వడ్డీరేటు 7.1 శాతం ఉంటుందని ఆర్ధిక మంత్రిత్వ శాఖ అధీనంలోని ఆర్థిక వ్యవహారాల విభాగం ఓ ప్రకటనలో పేర్కొంది.*
*🌀ప్రభుత్వేతర భవిష్య నిధి, ఇతర గ్రాట్యుటీ ఫండ్ లపైనా 7.1 శాతం వడ్డీ ఉంటుందని తెలిపింది. పీపీఎఫ్, ఎన్ఎస్సీ వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేటును యథాతథంగా ఉంచిన క్రమంలో దానికి అనుగుణంగా జీపీఎఫ్, గ్రాట్యుటీ ఫండ్ల వడ్డీరేటుపై తాజా నిర్ణయం తీసుకున్నారు.
@@@@@
8). గురుకుల సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష వాయిదా
*🍥తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర సైనిక పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఈనెల 30న నిర్వహించతలపెట్టిన ప్రవేశ పరీక్ష కరోనా ఉధృతి నేపథ్యంలో వాయిదా పడింది. ఈ మేరకు టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్, టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రుక్మాపూర్, వరంగల్‌లోని అశోక్‌నగర్‌లో ఉన్న సైనిక విద్యాలయాల్లో ఆరో తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈనెల 30న పరీక్ష నిర్వహించాలని నిర్ణయించామని పేర్కొన్నారు.
@@@@@