1) ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు*
♻️తొలిసారి సిద్ధంచేసే పనిలో విద్యాశాఖ*
🌏రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు గుర్తింపుకార్డులు ఇవ్వనున్నారు. స్థానిక సంస్థలు, ప్రభుత్వ, ఎయిడెడ్, మోడల్ స్కూళ్లు, అర్బన్ రెసిడెన్సియల్ స్కూళ్ల టీచర్లందరికీ ఐడీకార్డులు ఇచ్చేందుకు విద్యాశాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు.
టీచర్లకు గుర్తింపు కార్డులివ్వడం విద్యాశాఖ చరిత్రలో తొలిసారి కానుండటం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా 1.2 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. ఇప్పటికే ఎస్సీ, బీసీ గురుకుల విద్యాలయాల సొసైటీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న టీచర్లకు గుర్తింపుకార్డులిచ్చారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ టీచర్లందరికీ ఐడీ కార్డులివ్వాలని నిర్ణయించింది. కార్డు డిజైన్‌ను ఖరారుచేశారు. కార్డుకు రూ.42 చొప్పున చెల్లించేందుకు అంగీకరించి ఓ ముద్రణా ఏజెన్సీని ఎంపికచేశారు.
ప్రస్తుతానికి జిల్లాలవారీగా పదవీ విరమణ, చనిపోయిన ఉపాధ్యాయుల సమాచారాన్ని సేకరిస్తున్నారు. త్వరలోనే ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు చేపట్టనుండటంతో ఆ ప్రక్రియ పూర్తికాగానే ఐడీకార్డులు ఇవ్వాలని భావిస్తున్నారు.
@@@@@
2) జీవో 111 అమలు నుంచి మినహాయింపు ఇవ్వండి
*ఏఐసీటీఈకి సీఎస్ సోమేశ్ కుమార్ లేఖ
*ఇంజనీరింగ్ కాలేజీల విషయంలో రూపొందించిన జీవో-111 అమలు నుంచి ఈ ఏడాది కూడా మినహాయింపునివ్వాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ)కి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. జీవో ప్రకారం ఏఐసీటీఈ పరిధిలోని అన్ని కాలేజీలు తమ భవన క్రమబద్ధీకరణకు సంబంధించిన వివరాలను ఏఐసీటీఈకి సమర్పించాల్సి ఉంది. ఈ వివరాలను రెండేళ్లుగా ఏఐసీటీఈ కోరుతుండగా.. ప్రభుత్వం గడువు కోరుతూ వచ్చింది. ఈ ఏడాదీ మినహాయింపునివ్వాలంటూ సీఎస్ సోమేశ్ కుమార్ లేఖ రాశారు.
@@@@@
3) *🔊ఈపీఎఫ్ సభ్యులకు గుడ్ న్యూస్...!
💫ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సభ్యులకు ఇక మీదట గరిష్టంగా రూ.7 లక్షల జీవిత బీమా సదుపాయం లభించనుంది. ప్రస్తుతం గరిష్ట బీమా రూ.6 లక్షలుగా ఉండగా, రూ.7 లక్షలకు పెంచాలన్న ఈపీఎఫ్‌వో ట్రస్టీల నిర్ణయాన్ని కేంద్ర కార్మిక శాఖ ఆమోదించింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను బుధవారం జారీ చేసినట్టు కేంద్ర కార్మిక మంత్రి సంతోష్‌గంగ్వార్ తెలిపారు.
2020 సెప్టెంబర్ 9నాటి ఈపీఎఫ్‌వో కేంద్ర ట్రస్టీల బోర్డు సమావేశంలో.. మంత్రి సంతోష్ గంగ్వార్ అధ్యక్షతన బీమా కవరేజీని రూ.7లక్షలకు పెంచాలని నిర్ణయించడం గమనార్హం.*
*🌀ఈపీఎఫ్‌వో సభ్యులకు ‘ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ 1976’ (ఈడీఎల్‌ఐ) కింద బీమా కవరేజీ అమలవుతోంది. ఈ పథకం కింద కనీస బీమా రూ.2.5 లక్షలుగా ఉంది. మరణించడానికి ముందు 12 నెలల్లో ఒకటికి మించిన సంస్థల్లో పనిచేసినా బీమా సదుపాయం వర్తింపజేయాలని గతేడాది మార్చిలోనే నిర్ణయించిన విషయం గమనార్హం. గతంలో అయితే చనిపోవడానికి ముందు 12 నెలల్లో సభ్యుడు ఒక్కటికి మించిన సంస్థల్లో పనిచేస్తే బీమా సదుపాయం ఉండేది కాదు. ఉద్యోగి మరణానికి ముందు 12 నెలల్లో అందుకున్న సగటు వేతనానికి (మూలవేతనం, కరువు భత్యం కలిపి) 30 రెట్ల వరకు బీమా సదుపాయం ఉంటుంది. బీమా కవరేజీకి ఉద్యోగి కనీసం ఇంతకాలం పనిచేయాలన్న నిబంధనేదీ లేదు.
@@@@@
4) *💠పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను మూసేద్దామనుకుంటున్నారా!*
*✍️ఛైర్మన్‌తో సహా ఖాళీలను భర్తీ చేసి చెప్పండి*
*📢ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం*
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)కి ఛైర్మన్, ఇతర సభ్యులను నియమించకుండా మూసివేయాలని అనుకుంటున్నారా అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని గురువారం హైకోర్టు ప్రశ్నించింది. ఉన్న ఒక్క సభ్యుడూ ఆగస్టులో పదవీ విరమణ చేస్తారని, తరువాత మేమే దాన్ని మూసేస్తామని వ్యాఖ్యానించింది. ఛైర్మన్‌తో సహా సభ్యుల నియామకాన్ని చేపట్టి దానికి సంబంధించిన నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను జూన్ 17వ తేదీకి వాయిదా వేసింది.
టీఎస్‌పీఎస్సీకి ఛైర్మన్‌ను, 9 మంది సభ్యులను నియమించకపోవడాన్ని సవాలు చేస్తూ జగిత్యాలకు చెందిన నిరుద్యోగి జె.శంకర్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ ఛైర్మన్ పోస్టు ఫిబ్రవరి నుంచి ఖాళీగా ఉందని, 10మంది సభ్యులకు 9మంది పోస్టులు ఖాళీ అయ్యాయన్నారు. మిగిలిన సభ్యుడి పదవీకాలం ఈ ఆగస్టుతో ముగుస్తుందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ రాష్ట్రంలో ఇంతటి కీలకమైన సంస్థలో సభ్యుల పోస్టుల భర్తీలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని పేర్కొంది.
@@@@@
5) *💠రాత్రి కర్ఫ్యూ పొడిగింపు!*
*🌀నేడు ముఖ్యమంత్రి నిర్ణయం*
తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా ప్రభుత్వం గతనెల 20 నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. అది శుక్రవారంతో ముగియనుంది.
ప్రస్తుతం కేసుల సంఖ్య మరింత పెరిగినందున మరికొన్ని రోజులు కర్ఫ్యూ కొనసాగించాలనే అభిప్రాయం ప్రభుత్వవర్గాల్లో ఉంది. బుధవారం హోంమంత్రి మహమూద్ అలీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి రాష్ట్రంలోని పరిస్థితులు తెలుసుకున్నారు. వీటిన్నంటినీ పరిశీలించిన సీఎం కేసీఆర్ కర్ఫ్యూ పొడిగింపునకే మొగ్గు చూపనున్నట్లు తెలుస్తోంది. దీనిపై శుక్రవారం నిర్ణయం ప్రకటించనున్నారు.
తెలంగాణలో లాక్‌డౌన్ వస్తుందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతుండగా అదేమీలేదని హోంమంత్రి మహమూద్‌అలీ తెలపగా, ఇప్పటికైతే లాక్‌డౌన్ విధించే ఆలోచన లేదని వైద్యమంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు.
6) *నేడు చిత్రా రామచంద్రన్ పదవీ విరమణ*
*విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ శుక్రవారం పదవీ విర మణ పొందనున్నారు. 1985 బ్యాచ్కు చెందిన ఆమె గత ఏడాది ఫిబ్రవరి నుంచి విద్యాశాఖలో పనిచేస్తు న్నారు. ఆమెను గురువారం నాంపల్లిలోని రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్(రూసా) కార్యాలయంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ఘనంగా సన్మానించారు.
@@@@@
7) అంతర్గత మార్కులే ఆధారం*
*✍️పది విద్యార్థులకు వీటి ద్వారానే గ్రేడింగ్*
మహమ్మారి తీవ్రరూపం దాల్చుతుండడంతో ఈ ఏడాది విద్యాసంవత్సరం పదో తరగతి పరీక్షలను సర్కారు రద్దు చేసింది. వార్షిక పరీక్షలు నిర్వహించపోవడంతో గ్రేడింగ్ విషయంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ బడుల్లో చదివే వారికి 10 జీపీఏ వస్తే ఐఐఐటీలో సీటు వచ్చే అవకాశం ఉంటుంది. అంతర్గత పరీక్షలు (ఎఫ్‌ఏ-1) ఆధారంగా ఉత్తీర్ణత ప్రకటించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ పరీక్ష రాయని, మార్కులు తక్కువగా వచ్చాయని భావించిన వారికి కరోనా తీవ్రత తగ్గాక మళ్లీ పరీక్ష నిర్వహిస్తారు.*
*🌀జిల్లా వ్యాప్తంగా 408 పాఠశాలల్లో 13,986 మంది పదో తరగతి చదవుతున్నారు. మే నుంచి వీరికి వార్షిక పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, కొవిడ్-19 ప్రభావంతో రద్దయ్యాయి. అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్‌లను నిర్ణయించాలని ఆదేశాలు రావడంతో అందరి దృష్టి వీటిపై పడింది. ఈ పరీక్షలు పాఠశాలలోనే నిర్వహించి, పాఠ్యాంశాలను బోధించే ఉపాధ్యాయులే మూల్యంకణం చేశారు. ప్రస్తుతం ఇందులో వచ్చిన మార్కులను అప్‌లోడ్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో 10 జీపీఏ రావాలన్న ఉద్దేశంతో అంతర్గ పరీక్షల్లో పిల్లలకు ఎక్కువ మార్కులు వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటి పరిశీలన లేకపోవడంతో అప్‌లోడ్ సమయంలో అన్ని పాఠ్యంశాల్లో పూర్తి మార్కులు సమర్పించాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కూడా పూర్తి మార్కులు వస్తుండడంతో ఈ సారి 10 జీపీఏ వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రైవేట్ పాఠశాలల్లో మార్కుల నమోదుపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.*
*🔷పారదర్శకతోనే న్యాయం: ఈ విద్యాసంవత్సరం 10 జీపీఏ వచ్చే విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పదో తరగతి మార్కులను ట్రిపుల్ ఐటీలో సీటు కేటాయిస్తుండటంతో ఈసారి తీవ్ర పోటీ ఉండనుంది. ఎఫ్‌ఏ-1 మార్కుల నమోదు పారదర్శకంగా ఉంటే అర్హులైన విద్యార్థులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు.
@@@@@
8) *🔊బదిలీలు, పదోన్నతుల తర్వాతే టీచర్లకు 'గుర్తింపు'*
*👨🏫1. 16లక్షల మంది టీచర్లకు ఐడీ కార్డులు ఇచ్చేందుకు ఏర్పాట్లు*
🌍రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ విద్యాసంస్థల ఉపాధ్యాయులందరికీ గుర్తింపు(ఐడీ) కార్డులు ఇవ్వాలని సర్కారు ఎప్పటి నుంచో భావిస్తోంది. అయితే మొదట ఈ నెలాఖరులోగా అందరికీ ఐడీ కార్డులు ఇవ్వాలని అధికారులు భావించినా ప్రస్తుతం తమ నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తి అయిన తరువాతే గుర్తింపు కార్డులు ఇవ్వాలని భావిస్తున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు ఐడీ కార్డుల జారీ ప్రక్రియకు మోక్షం కలిగిందనుకునే లోపే తాజా నిర్ణయంతో మళ్లీ వాయిదా పడినట్లు తెలుస్తోంది.*
*🌀33 జిల్లాల పరిధిలోని 1,16,864 మంది టీచర్లకు ఈ నెలాఖరుకల్లా ఐడీ కార్డులు ఇచ్చేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అందుకూ అన్ని జిల్లాల నుంచి ప్రభుత్వ, లోకల్ బాడి, మోడల్ స్కూల్స్, కేజీబీవీ, యూఆర్ఎస్, ఎయిడెడ్, సొసైటీ గురుకులాల్లోని అందరీ ఉపాధ్యాయుల వివరాలను ఇప్పటికే సేకరించారు . గుర్తింపు కార్డులు పొందేవారిలో స్కూల్ అసిస్టెంట్లు 39,600 మంది, ఎస్జీటీలు 52,563 మంది,హెచ్ఎంలు2,723, భాషా పండితులు 8,966, ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్లు 2,386 మంది, పీఈటీలు 2,127 మంది, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎస్ఏలు 516 మంది ఉన్నారు. వీరితో పాటు క్రాఫ్ట్ మ్యూజిక్ అండ్ డ్రాయింగ్ టీచర్లు, కేజీబీవీ, యూఆర్ఎస్లో పనిచేసే ఉపాధ్యాయులు 7,900 మందికిపైగాపొందనున్నారు. ఐడీ కార్డులుఅయితే బదిలీలు, పదోన్నతులు కాకముందే ఐడీ కార్డులు ఇస్తే తర్వాత బదిలీలు, పదోన్నతులు పొందిన వారికి మళ్లీ ఐడీ కార్డులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన అధికారులు బదిలీలు, పదోన్నతులు ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ఐడీ కార్డుల జారీ ప్రక్రియ గత రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. కేంద్ర సమగ్ర శిక్షా అభియాన్ రెండేళ్ల క్రితమే కార్డులు ఇచ్చేందుకుఅంగీకరించినప్పటికినీ కార్డు డిజైన్ల ఎంపిక, ఇతర కారణాలతో ప్రక్రియ ఆలస్యమవుతూ వచ్చింది. ప్రస్తుతం బదిలీలు, పదోన్నతుల కారణంతో గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ మళ్లీ ఆలస్యం కానుంది.
@@@@@