Friday 23 October 2020

Calculation of DA

-: కరువు భత్యం నిర్ణయించు విధానం :-

@ కేంద్ర 6వ పే కమిషన్ ప్రకారమే కరువుభత్యం నిర్ణయించబడుతుంది.

@ 1.1.06 నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆరవ సి.పి.సి ప్రకారము, 1.7.13 నుండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవ పి.ఆర్ .సి ప్రకారము వేతన స్కేళ్ళు అమలు చేయబడుచున్నవి.

@ 1.7.13 నుండి దిగువ తెలిపిన విధముగా డి.ఏ కన్వర్షన్ ఫార్ములా ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము కరువుభత్యం ప్రకటించుచున్నది.

@  1.1.06 నాటికి అఖిలభారత వినియోగదారుల  ధరల సూచిక పన్నెండు నెలల సగటు 536 పాయింట్లు ( మూల సంవత్సరము 1982 = 100 ).

@ 1.7.13 నాటికి అఖిలభారత వినియోగదారుల  ధరల సూచిక పన్నెండు నెలల సగటు 1022 పాయింట్లు

536/1022 = 0.524

@ ఈ కన్వర్షన్ ఫార్ములా ప్రకారము కేంద్ర ప్రభుత్వం ప్రకటించు ప్రతి ఒక శాతమునకు రాష్ట్ర ప్రభుత్వం 1.1.14 నుండి 0.524% చొప్పున ప్రకటించుచున్నది

ఉదాహరణలు :-

@ 1.7.15 న కేంద్ర ప్రభుత్వం ఆరు శాతము డి.ఏ ప్రకటించగా రాష్ట్ర ప్రభుత్వం 3.144% ( 6*0.524) డి.ఏ ప్రకటించినది.

@1.1.16 న కూడా కేంద్ర ప్రభుత్వం  6వ సి పి సి ప్రకారం ఆరు శాతము డి.ఏ ప్రకటించగా రాష్ట్ర ప్రభుత్వం 3.144% ( 6*0.524) డి.ఏ ప్రకటించినది.

@1.7.16 న కూడా కేంద్ర ప్రభుత్వం  6వ సి పి సి ప్రకారం ఏడు శాతము డి.ఏ ప్రకటించగా రాష్ట్ర ప్రభుత్వం 3.668% ( 7*0.524) డి.ఏ ప్రకటించినది.

@1.1.17 న కూడా కేంద్ర ప్రభుత్వం  6వ సి పి సి ప్రకారం నాలుగు శాతము డి.ఏ ప్రకటించగా రాష్ట్ర ప్రభుత్వం 2.096% ( 4*0.524) డి.ఏ ప్రకటించినది. అయితే 1.1.16 నుండి కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ఏడవ సి.పి.సి ప్రకారము వేతన స్కేళ్ళు మంజూరు చేయుచున్నందున డి.ఏ కన్వర్షన్ మారవలసిఉన్నది.

@ 01.01.2016 నాటికి అఖిల భారత వినియోగదారుల ధరల సూచిక 12 నెలల సగటు 1210m పాయింట్లు (మూల సంవత్సరం 1982 = 100).

1210/1022 = 1.184.

కావున కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ప్రతి 1% డీ.ఏ కు రాష్ట్ర ప్రభుత్వం 1.184% చొప్పున ప్రకటించవలసి ఉంటుంది.

డీఏ రేటు

@ ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు పొందుతున్న DA.. 33.536% (Jan.2019 నాటిది) నవంబర్ 2019లో ప్రకటించారు..

@ ఈరోజు ప్రకటించింది జులై 2019 నుండి రావాల్సిన DA..

(జులై 2019లో కేంద్ర 7వ PRC ప్రకారం 5% DA పెంపుదల, 6వ PRC ప్రకారం 10% గా ఉంది.. అనగా తెలంగాణ ఉద్యోగులు పొందే DA 10*0.524=5.240%)

అనగా అప్పటివరకు గల మొత్తం DA..
33.536 +5.240 = 38.776%
.

ఇంకా పొందాల్సిన DA లు ఇలా..

1. జనవరి 2020 నుండి రావాల్సిన DA..
(జనవరి 2020లో కేంద్ర 7వ PRC ప్రకారం 4% DA పెంపుదల, 6వ PRC ప్రకారం 10% గా ఉంది.. అనగా తెలంగాణ ఉద్యోగులు పొందే DA 10*0.524=5.240%)

అప్పటివరకు గల మొత్తం DA..
38.776 + 5.240 = 44.016%

.
2. జులై 2020 నుండి రావాల్సిన DA..
(జులై 2020లో కేంద్ర 7వ PRC ప్రకారం 3% DA పెంపుదలగా ఉండబోతుంది, 6వ PRC ప్రకారం 8%గా ఉండబోతుంది.. అనగా తెలంగాణ ఉద్యోగులు పొందే DA 8*0.524=4.192%)

ఇప్పటివరకు తెలంగాణా ఉద్యోగులకు తాజాగా గల మొత్తం DA..
44.016 + 4.192 = 48.208%

# జనవరి 2020 నుంచి రావాల్సిన రెండు DAలు (అనగా 7%) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు on hold లో ఉంచబడినవి..

#తెలంగాణ ఉద్యోగులకు జులై 2018  DA తో కలుపుకుని ఉన్న 30.392% ప్రస్తుత PRC చివరి DA గా ఉంటుంది..

#తదుపరి 4 DA లు అనగా ప్రస్తుతం మనం పొందుతున్న (జనవరి 2019) DA మరియు ఇప్పుడు వచ్చిన DA 5.240% (జులై 2019) మరియు రావాల్సిన 2  (జనవరి 2020, జులై 2020) DAలు మరో PRCలో కొత్త DAలుగా ఉంటాయి.

Download : Click on below link

*********