English Language Enrichment Course to Secondary Grade Teachers
కొత్తగా నోటిఫికేషన్ జారీ......
వచ్చే రెండేండ్లలో మొత్తం పదివేల మందికి ఇంగ్లిష్ శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు మూడు బ్యాలకు శిక్షణఇవ్వగా..నాలుగోబ్యాచ్ కోసం ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది. వారందరికీ శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేక విధానాన్ని అమలుచేస్తున్నారు. ప్రతి ఐదుగురికి ఒక మెంటార్‌ను ఏర్పాటు చేశారు. ప్రతివారం ఒక క్లాసుతో పాటు వారికి ఇంగ్లిష్ భాషపై అసైన్మెంట్లు ఇస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందినవారు తిరిగి శిక్షణ ఇచ్చేలా తయారవుతున్నారు. ఇప్పటికే SRP , ELTCలు మెంటార్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రాథమిక స్కూల్ టీచర్లకు శిక్షణ పూర్తైన వెంటనే ఉన్నత పాఠశాలలకు చెందిన స్కూల్ అసిస్టెంట్ టీచర్లకు కూడా శిక్షణ ఇచ్చేందుకు విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేయనున్నది.
@ అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ సహకారం తో TS SCERT నిర్వహిస్తున్న 9 వారాల ఆన్ లైన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎన్ రిచ్ మెంట్ కోర్సు (లెవెల్ -1) లో చేరుటకు SGTs ఈ క్రింది లింక్ ద్వారా apply చేసుకోగలరు .
అప్ లోడ్ చేయాల్సినవి:-
1) సర్వీస్ సర్టిఫికేట్ (లేదా) టీచర్ ఐడెంటిటీ కార్డు (లేదా) అపాయింట్మెంట్ లెటర్
2) రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో & మరియు దాని కింద మీ సంతకం
అవసరమైన వివరాలు:-
1) mail ID
2) STO ID(Employee ID)
3) Mobile number
4) Working Place details