🔷స్థానిక అధికారుల అనుమతి మేరకే విధుల్లోకి వెళ్లాలి
🔷తాజా మార్గదర్శకాలు జారీచేసిన కేంద్ర ప్రభుత్వం
♦కరోనా కంటైన్మెంట్ జోన్లలో నివసిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై కేంద్రం ఆంక్షలు విధించింది. స్థానిక అధికారుల మార్గదర్శకాలను అనుసరించాలని సూచించింది. అధికారుల అనుమతి మేరకు, సడలింపు ఇచ్చినప్పుడు మాత్రమే విధుల్లోకి వెళ్లాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు ముందు జాగ్రత్త చర్యలను కచ్చితంగా పాటించాలని సూచించింది. ‘కార్యాలయంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్క్‌ను ధరించాలి. తరచూ పరిశుభ్రత ఉండేలా చూసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత, శారీరక దూరాన్ని పాటించాలి’అని కోరింది.దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది
*♦ఇవీ మార్గదర్శకాలు..*
► ప్రభుత్వ కార్యాలయాలు, గదుల్లో క్రిమిసంహారక ప్రొటోకాల్‌ను పాటించాలి.
► సబ్బు, నీటితో తరచుగా చేతులు కడుక్కోవాలి.
► ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లను వాడండి.
► గదుల్లోని అధికారుల మధ్య తగినంత దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాట్లు చేయాలి.
► క్యాంటీన్లలో గుమిగూడటం మానుకోవాలి.
► కార్యాలయంలోని ఏ ప్రదేశంలోనైనా 5 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడకూడదు.
► కార్యాలయ సముదాయంలో సందర్శకుల ప్రవేశాలను తగ్గించాలి. సందర్శకుల తాత్కాలిక పాస్‌లను ఇప్పటికే నిలిపివేశాం.
► ఆఫీసర్ అనుమతి ఉన్న సందర్శకులను, వారు కలవాలనుకునే వారిని మాత్రమే సరిగ్గా పరీక్షించిన తరువాతే లోనికి అనుమతించాలి.
► సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే నిర్వహించాలి.
► అధికారిక ఈ–మెయిల్‌లో అవసరమైన కరస్పాండెన్స్ జరపాలి. ఫైళ్లు, పత్రాలను ఇతర కార్యాలయాలకు పంపించకుండా చూసుకోవాలి.
► అధికారులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
► జ్వరం, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు అనారోగ్యంగా అనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి. వారిని వెంటనే ఇంటికి పంపించాలి.
► గర్భిణీ ఉద్యోగులు, ఇతరత్రా అనారోగ్యంతో బాధపడుతున్నవారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.
► వీళ్లు ప్రజలతో ప్రత్యక్ష సంబంధముండే పనుల్లోకి రాకూడదు. అవసరమైతే హోం క్వారంటైన్‌కు పరిమితం కావాలి.
ReplyForward
|