_24 ఏళ్ల యాంత్రిక పదోన్నతి స్కేల్‌పై ముఖ్యమైన ప్రశ్నలు-జవాబులు!_
_ప్రశ్న1: డిపార్ట్‌మెంట్ టెస్టులు పాస్ కాకపోవడం వల్ల 24 సంవత్సరాల స్కేల్ ఆలస్యమైతే, ఆ స్కేల్‌ను ఎప్పటి నుంచి మంజూరు చేయాలి? పరీక్ష రాసిన తేదీ నుంచి ఇవ్వాలా? లేక ఫలితాలు వచ్చిన తేదీ నుంచి ఇవ్వాలా? లేక పరీక్ష నోటిఫికేషన్ విడుదల తేదీ నుంచి ఇవ్వాలా?_
*_జవాబు: డిపార్ట్‌మెంటల్ టెస్టులు పాస్ కాకపోవడం వల్ల 24 సంవత్సరాల స్కేల్ ఆలస్యమైతే, అవసరమైన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే FR 26(a) Rule-2 ప్రకారం చివరి డిపార్ట్‌మెంటల్ పరీక్ష రాసిన మరుసటి రోజు నుంచి స్కేల్ మంజూరు చేయాలి._*
_ప్రశ్న2: ఎస్జీటీలు 24 సంవత్సరాల యాంత్రిక పదోన్నతి స్కేల్ మంజూరుకు తెలుగు, హిందీ స్పెషల్ లాంగ్వేజ్ టెస్టులు తప్పనిసరిగా పాస్ కావాలా?_
*_జవాబు: అవును. గెజిటెడ్ హెడ్‌మాస్టర్ (GHM) గ్రేడ్–II పోస్టుకు నిర్దేశించిన విద్యార్హతలు, శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణత తప్పనిసరిగా ఉండాలి. G.O.Ms.No.10, తేదీ 23-01-2009లో స్పష్టంగా ఉంది. కాబట్టి EOT, GOT పరీక్షలతో పాటు Special Language Test in Telugu Higher Standard, అలాగే Special Language Test in Hindi Lower Standard పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. GHM Gr-II పోస్టుకు నిర్దేశించిన అన్ని అర్హతలు ఉన్నప్పుడే 24 సంవత్సరాల యాంత్రిక పదోన్నతి స్కేల్ మంజూరు చేయాలి._*
_ప్రశ్న3: నాకు 24 సంవత్సరాల సర్వీస్ ఈ నెలలో పూర్తవుతుంది. త్వరలో రెగ్యులర్ ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. నేను ప్రమోషన్ తీసుకోవడం మంచిదా? లేక 24 సంవత్సరాల యాంత్రిక పదోన్నతి స్కేల్ తీసుకోవడం మంచిదా?_
*_జవాబు: 24 సంవత్సరాల యాంత్రిక పదోన్నతి స్కేల్ అనేది ఉద్యోగి ఇష్టానుసారం ఎంచుకునే ఆప్షన్ కాదు. నిర్ణీత సర్వీస్ పూర్తి చేసి, పోస్టుకు అవసరమైన అర్హతలు కలిగి ఉంటే, నిబంధనల ప్రకారం ఆ స్కేల్‌ను మంజూరు చేయాలి. దాన్ని నిలిపివేయడం లేదా తీసుకోకుండా ఉండడం ఉద్యోగి ఆప్షన్‌పై ఆధారపడదు. కాబట్టి 24 సంవత్సరాల సర్వీస్ పూర్తయి, అవసరమైన అర్హతలు ఉన్నట్లయితే మంజూరు అధికారి నిబంధనల ప్రకారం స్కేల్ మంజూరు చేయాలి._*
_ప్రశ్న4: నేను ఇంటర్మీడియట్‌లో సంస్కృతం చదివాను. డిగ్రీలో తెలుగును ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా చదివాను. నాకు స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్ ఇన్ తెలుగు నుంచి మినహాయింపు ఉంటుందా?_
*_జవాబు: మినహాయింపు లభిస్తుంది. ఇంటర్మీడియట్‌లోనే తెలుగు చదివి ఉండాలనే నిబంధన లేదు. ఇంటర్ లేదా డిగ్రీ లేదా పీజీ స్థాయిలో తెలుగును ఒక భాష/సబ్జెక్టుగా చదివి ఉంటే సంబంధిత స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్ నుంచి మినహాయింపు ఉంది._*
_ప్రశ్న5: ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేసి, బీఈడీ పూర్తి చేసిన ఎస్జీటీలకు 10+2+3 విద్యార్హత నిబంధన వర్తిస్తుందా? డిపార్ట్‌మెంటల్ టెస్టులు పాస్ అయితే 24 సంవత్సరాల స్కేల్ మంజూరు చేయవచ్చా?_
*_జవాబు: 10+2+3 విద్యార్హత నిబంధన భాషా పండితుల నుంచి స్కూల్ అసిస్టెంట్ కేడర్‌కు పదోన్నతి పొందిన వారికి పరిశీలించాల్సి ఉంటుంది. తెలుగు, హిందీ, ఉర్దూ స్కూల్ అసిస్టెంట్లకు తదుపరి పదోన్నతుల్లో 10+2+3 నిబంధన వర్తించే అంశాన్ని పరిశీలించాలి. ఎస్జీటీలు ఓపెన్ డిగ్రీ, బీఈడీ చేశారనే కారణంతో 24 సంవత్సరాల స్కేల్‌ను నిరాకరించకూడదు. (GO Ms.No.23 తేదీ: 28.01.2009)_*
_ప్రశ్న6: నేను తెలుగు మాధ్యమంలో పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివాను. అయితే ఈ కోర్సుల్లో తెలుగు ఒక సబ్జెక్టుగా చదవలేదు. నాకు తెలుగు స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్ నుంచి మినహాయింపు ఉంటుందా?_
*_జవాబు: ఉండదు. G.O.Ms.No.10, తేదీ 23-01-2009 ప్రకారం కేవలం తెలుగు మాధ్యమంలో చదివినంత మాత్రాన స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్ నుంచి మినహాయింపు ఉండదు. ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ లేదా పీజీ స్థాయిలో తెలుగును ఒక సబ్జెక్టుగా చదివి ఉంటేనే సంబంధిత స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్ నుంచి మినహాయింపు వర్తిస్తుంది._*
_ప్రశ్న7: నేను పదో తరగతిలో తెలుగును ఒక సబ్జెక్టుగా చదివాను. దీనివల్ల తెలుగు స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్ నుంచి మినహాయింపు లభిస్తుందా?_
*_జవాబు: లభించదు. G.O.Ms.No.10 ప్రకారం పదో తరగతిలో తెలుగు చదివినంత మాత్రాన స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్ నుంచి మినహాయింపు ఉండదు. ఇంటర్మీడియట్, డిగ్రీ లేదా పీజీ స్థాయిలో తెలుగును ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. అలా చదవని పక్షంలో సంబంధిత తెలుగు స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది._*
_ప్రశ్న8: నేను ఎస్‌ఏ కేడర్‌లో పనిచేస్తున్నాను. 2026 అక్టోబర్ 30 నాటికి నాకు 24 సంవత్సరాల సర్వీస్ పూర్తవుతుంది. నాకు 24 సంవత్సరాల యాంత్రిక పదోన్నతి స్కేల్‌ను హైస్కూల్ హెడ్‌మాస్టర్ మంజూరు చేయవచ్చా?_
*_జవాబు: మంజూరు చేయవచ్చు. G.O.Ms.No.40 తేదీ: 07.05.2002 ప్రకారం ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (AAS) స్కేల్స్ హైస్కూల్‌లో పనిచేస్తున్న అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్‌కు 24 ఏళ్ల యాంత్రిక పదోన్నతి స్కేల్ మంజూరు చేసే అధికారం హైస్కూల్ హెడ్‌మాస్టర్‌కు ఉంది._*
_(G.O.Ms.No.10, తేదీ 23-01-2009)